TS Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన , ఐ లవ్ యూ డాడీ అంటూ అరుపులు-hyderabad news in telugu ts assembly mla padi kaushik reddy daughter shouted i love you daddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన , ఐ లవ్ యూ డాడీ అంటూ అరుపులు

TS Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన , ఐ లవ్ యూ డాడీ అంటూ అరుపులు

HT Telugu Desk HT Telugu
Dec 14, 2023 07:16 PM IST

TS Assembly : తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తు్న్న సమయంలో మీడియా గ్యాలరీ నుంచి ఐ లవ్ యూ డాడీ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. దీంతో సభ్యులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఆందోళన చెందారు.

పాడి కౌశిక్ రెడ్డి
పాడి కౌశిక్ రెడ్డి

TS Assembly : తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయని కొందరు ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు స్పీకర్ ముందుకు వచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ముగించగానే ఒక్కసారిగా " ఐ లవ్ యూ డాడీ" అంటూ గ్యాలరీ నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి.

మీడియా గ్యాలరీ నుంచి అరిచిన కౌశిక్ రెడ్డి కూతురు

దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఉల్లికిపడ్డారు. ఎక్కడ నుంచి అరుపులు వచ్చాయో అని ఎమ్మెల్యేలు అటూ ఇటూ చూడడంతో మీడియా గ్యాలరీ నుంచి వచ్చిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురే అరిచిందని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అసెంబ్లీ సెక్యూరిటీ శ్రినికా రెడ్డిని మీడియా గ్యాలరీ నుంచి విజిటర్స్ గ్యాలరీకి తరలించారు. కాగా కౌశిక్ రెడ్డి కుమార్తెను మీడియా గ్యాలరీకి ఎందుకు అనుమతించారని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని భద్రతా సిబ్బందికి మీడియా ప్రతినిధులు సూచించారు.

పార్లమెంట్ ఘటనతో అసెంబ్లీలో భద్రతా కట్టుదిట్టం

అయితే బుధవారం పార్లమెంట్ లో జరిగిన ఘటన నేపథ్యంలో....ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేయాలని సూచించారు.ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలని అక్బరుద్దీన్ ఇటీవలే ఆదేశించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner