Shiva's Favorite Zodiac Signs: ఈ రాశుల వారంటే శివుడికి చాలా ఇష్టం.. తలచుకున్న వెంటనే వీరి కోరికలు తీరుస్తాడు!
Shiva's Favorite Zodiac Signs: భక్తులకు ఇష్టదైవాలు ఉన్నట్లే దేవుళ్లకు ఇష్ట రాశులు ఉంటాయని మీకు తెలుసా. అవును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులంటే కొందరు దేవుళ్లకు ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. వాటి ఆధారంగా శివుడికి ఇష్టమైన రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శివుడు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన దేవుడు. ఆయనను, భోళా శంకరుడు, పరమేశ్వరుడు, అర్థనారీశ్వరుడు, మహాదేవుడు, సర్వేశ్వరుడు అంటూ అనేక పేర్లతో పిలుస్తారు. సృష్టి, స్థితి, సంహారం చేసే త్రిమూర్తులలో ఒకరైన దేవుడు శివుడు. ఆయన అర్ధనారీశ్వరుడు రూపంలో పార్వతితో కలిసి పురుష, మహిళ శక్తుల సమన్వయాన్ని సూచిస్తారు. పరమశివుడి అనుగ్రహం ఉంటే వ్యక్తి జీవితంలో శాంతి, ధైర్యం, ఆరోగ్యం, విజయం మెండుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి కృప ఉంటే భక్తులు కోరిన కోరికలు తీరతాయని విశ్వాసం. అలాంటి ఈశ్వరుడి అనుగ్రహం కొందరికి పుట్టుకతోనే లభిస్తుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులంటే శివుడికి ఇష్టమంట. ఈ రాశి జాతకుల కోరికలు శివుని తలచుకోగానే నెరవేరుతాయని నమ్ముతారు. శివుడికి ఇష్టమైన ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం.
శివుడికి ఇష్టమైన రాశులేవంటే..
మేష రాశి:
కృషికి ఉదాహరణగా నిలిచే రాశులలో మేష రాశి వారు ఒకరు. కుజుడు పాలించే మేష రాశి వారు ఎల్లప్పుడూ శ్రమకు ప్రాముఖ్యత ఇస్తారు. ప్రపంచాన్ని శాసించే శివునికి ఇష్టమైన రాశులలో మేషం ఉంది. ఈ రాశి వారి జీవితంలో అన్ని రకాల సమస్యలను శివుడు పరిష్కరిస్తాడు. తలచుకున్న వెంటనే కావాల్సిన సహాయం అందేలా చేస్తాడు. శివుడిని పూజించడం వల్ల ఈ రాశి వారి జీవితంలో భారీ మార్పులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృశ్చిక రాశి::
కుజుడు పరిపాలించే వృశ్చిక రాశి వారంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. వీరికి సహజంగానే చాలా తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే ఎల్లప్పుడూ శివుని ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది. పనిచేసే చోట తెలివితేటలు ఎక్కువ ప్రదర్వించగలుగుతారు. తద్వారా మీరు పురోగతిని పొందుతారు. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు వచ్చినా కూడా.. కొంత కాలం తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. ఎందుకంటే శివుడు మీపై ఆశీస్సులు కురిపిస్తాడు. మహా శివరాత్రి రోజున శివ పురాణం చదవడం వల్ల ఈ రాశి వారి జీవితాల్లో అద్భుతమైన పురోగతి లభిస్తుందని చెబుతారు.
మకర రాశి:
మకర రాశి వారు శివుడిని ఆరాధించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శనిదేవుడు మకర రాశికి అధిపతి కావడం వల్ల శివుడి అనుగ్రహం ఈ రాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడు న్యాయాధిపతి అయిన శనిని అనుగ్రహించినట్లే, కష్టపడే స్వభావం ఉన్న మకర రాశి వారిని కూడా ఆశీర్వదిస్తాడు. ధ్యానం, ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టే మకర రాశి వారు శివుడి ఆరాధన ద్వారా జీవితంలో స్థిరత్వం, కష్టాల నుండి విముక్తి, ఆర్థిక పురోగతి మరియు సమాజంలో గౌరవాన్ని పొందుతారు.
కుంభ రాశి:
శివుడికి శని మహాభక్తుడు. అందుకే శనికి ఈశ్వరుడు అనే బిరుదు ఇచ్చాడు. అలాంటి శివ భక్తుడైన శని కుంభ రాశికి అధిపతి. కనుక వీరంటే శివుడికి చాలా ఇష్టం. మకర రాశి వారు కష్టానికి ప్రసిద్ధి చెందారు. శని నుంచి మీకు ఇబ్బందులు తలెత్తే సమయంలో మీకు శివుడు తోడుగా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సులభంగా పరిష్కరించే మార్గాలు చూపిస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ పని మొదలు పెట్టినా శివుడిని తలచుకుని చేయడం వల్ల మకర రాశి వారికి అన్నింటా శుభం, విజయం కలుగుతాయి. సకల సంపదలు మీకే వస్తాయి. ఓం నమః శివాయ అనే మంత్రం జపిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడు మీకు చాలా ప్రయోజనాలను ప్రసాదిస్తాడు మరియు జీవితంలో పురోగతిని కలిగిస్తాడు.