Shaligram: శాలిగ్రామాన్ని ఎలా పూజించాలి? విష్ణు ఆశీర్వాదాలు పొందేందుకు పూజలో ఈ మంత్రం పఠించండి-how to worship shaligram chant this mantra to get the blessings of vishnu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shaligram: శాలిగ్రామాన్ని ఎలా పూజించాలి? విష్ణు ఆశీర్వాదాలు పొందేందుకు పూజలో ఈ మంత్రం పఠించండి

Shaligram: శాలిగ్రామాన్ని ఎలా పూజించాలి? విష్ణు ఆశీర్వాదాలు పొందేందుకు పూజలో ఈ మంత్రం పఠించండి

Gunti Soundarya HT Telugu
Jul 22, 2024 08:28 AM IST

Shaligram: శాలిగ్రామం విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఈ శాలిగ్రామాన్ని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు పుష్కలంగా లభిస్తాయి. జీవితంలో డబ్బు కొరత ఉండదు.

శాలిగ్రామాన్ని ఎలా పూజించాలి ?
శాలిగ్రామాన్ని ఎలా పూజించాలి ? (pinterest)

Shaligram: సనాతన ధర్మంలో శాలిగ్రామాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. శివుడిని లింగ రూపంలో ఎలా కొలుస్తారో అలాగే విష్ణు మూర్తి లింగరూపం శాలిగ్రామం అని చెబుతారు. అందుకే ఇది ఇంట్లో పెట్టుకుని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇవి స్వయంగా ఏర్పడే రాళ్ళు. నేపాల్‌లోని ముక్తినాథ్ సమీపంలోని గండకీ నదిలో ఇవి లభిస్తాయి.

yearly horoscope entry point

శాలిగ్రామాన్ని పూజించడం వల్ల ప్రయోజనాలు

ఇంట్లో శాలిగ్రామాన్ని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు నెలకొంటాయని విశ్వసిస్తారు. శాలిగ్రామ పూజ జరిగే ఇంటికి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుందని చెబుతారు. దేవతల మాదిరిగానే శాలిగ్రామ ఆరాధనకు కొన్ని ప్రత్యేక నియమాలు, మంత్రాలు ఉన్నాయి. పూజించేటప్పుడు ఏ విధంగా మంత్రాలు జపిస్తామో అదేవిధంగా శాలిగ్రామాన్ని పూజించేటప్పుడు కూడా ప్రత్యేక మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచి పూజించడం వల్ల భక్తుల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలో స్పష్టత ఉంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. పద్మ పురాణం, స్కంద పురాణం, ఇతర వేద గ్రంధాల ప్రకారం శాలిగ్రామాన్ని పూజించే భక్తుడు మంచి ఆరోగ్యం, సంపద, విజయం, సంతానం పొందుతారని అంటారు. శాలిగ్రామాన్ని పూజించిన వ్యక్తి గత జన్మ పాపాల నుండి విముక్తుడు అవుతాడని అంటారు. నిత్యం శాలిగ్రామాన్ని పూజించడం వల్ల భక్తులకు ధైర్యం, ఆత్మస్థైర్యం, అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి, చెడు దృష్టి నుంచి రక్షణ లభిస్తుంది.

శాలిగ్రామాన్ని పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

శాలిగ్రామాన్ని పూజించాలంటే ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తుల ధరించాలి. తర్వాత శాలిగ్రామానికి చందనం తిలకం వేయాలి. పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. శాలిగ్రామ్ ముందు చేతులు జోడించి స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని జపించాలి. “ఓం నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమ,హి తన్నో విష్ణుః ప్రచోదయాత్” ఈ మంత్రాన్ని పఠించలేకపోతే హరే కృష్ణ అని తొమ్మిది సార్లు జపించవచ్చు.

ఈ మంత్రాన్ని చెప్పిన జపించిన తర్వాత విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. ఇంట్లో శాలిగ్రామం ఉంచి పూజించాలనుకుంటే ఒకటి మాత్రమే ఉండేలాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాస్తు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శాలిగ్రామం ఉన్నా ఇళ్లలో మాంసం, మద్యం సేవించకూడదు .పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర వీటిని ఉంచి నిత్యం పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి సంతోషించి ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారు. క్రమం తప్పకుండా పూజించిన తర్వాత తులసి ఆకులు సమర్పించాలి.

శాలిగ్రామాన్ని అభిషేకించిన నీటిని తాగడం వల్ల అన్ని అనారోగ్య బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు. వీటినే పూర్తి భక్తితో పూజించిన వారికి మోక్షం, వైకుంఠ ప్రవేశం లభిస్తుంది. జనన మరణ చక్రం అంతమవుతుందని పద్మ పురాణం పేర్కొంటుంది. శాాలిగ్రామం పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరడం సులభతరం అవుతుంది. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner