Runam: ప్రతీ హిందువు తీర్చుకోవాల్సిన 3 రుణాలు.. వీటిని ఎలా తీర్చుకోవచ్చు? తీర్చుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి
Runam: ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు రుణాలను తీర్చుకోవాలి. అది విధి. ఒకవేళ కనుక ఈ రుణాలు తీర్చుకోలేకపోతే ఇంకో జన్మ ఎత్తాలి. మానవ జన్మకు సార్ధకత జన్మ రాహిత్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణ విముక్తులు అవ్వాలి. ఇక మూడు రుణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువులు మొత్తం మూడు రుణాలకు కట్టుబడి ఉండాలి. హిందువులు ఈ మూడు రుణాలు కూడా తీర్చుకోవాలి. అయితే, హిందువుల పాటించే ప్రతి సంప్రదాయం వెనుక కూడా ఒక అంతర్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ మూడు రుణాలు కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది. మూడు రుణాలతో ప్రతి మనిషి పుడతాడు. ఋషి రుణం, దేవరుణం, పితౄణం.
ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు రుణాలను తీర్చుకోవాలి. అది విధి. ఒకవేళ కనుక ఈ రుణాలు తీర్చుకోలేకపోతే ఇంకో జన్మ ఎత్తాలి. మానవ జన్మకు సార్ధకత జన్మ రాహిత్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణ విముక్తులు అవ్వాలి. ఇక మూడు రుణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే, ఆ మూడు రుణాలను కూడా ఎలా తీర్చుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం.
హిందూమతంలో రుణం అంటే ఏంటి?
సంస్కృతంలో రుణం అంటే అప్పు అని అర్థం. మనిషి పుట్టిన తర్వాత ఈ రుణాలతో పుడతారు. వాటిని తీర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రుణ విముక్తులు అవ్వాలి. ఈ రుణాలు తీర్చుకోలేకపోతే ఇంకో జన్మ ఎత్తాలి.
పితౄణం
తల్లిదండ్రులు, పూర్వికులు మనకి జీవితాన్ని ఇస్తారు. కుటుంబానికి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. చనిపోయేలోగా పితౄణం తీర్చుకోవాలి.
దేవ ఋణం
దేవుళ్లకు, మనం చూడలేని శక్తులకి రుణం తీర్చుకోవాలి. నిప్పు, నీరు, భూమి పంచభూతాలు కూడా జీవాన్ని నిలబెట్టే ప్రకృతిలోని 5 అంశాల. దేవుళ్ళు ద్వారా అందించబడ్డాయి. మానవులు వారికి జీవితానికి సంబంధించిన ప్రాథమిక శక్తుల్ని అందించినందుకు దేవతలకు ఏదో ఒక రూపంలో రుణపడి ఉంటారు. ఆ రుణాన్ని కూడా తీర్చుకోవాలి.
ఋషి రుణం
మనం ఈ లోకంలో బతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందించినందుకు, నేర్పించినందుకు ఋషులకు, గురువులకు రుణపడి ఉండాలి. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల నుంచి స్కూల్లో టీచర్ల వరకు ఎవరైతే మనకి బోధించారో వారికి రుణ పడి ఉండాలి. వారికి తిరిగి చెల్లించే బాధ్యతని మనమే నెరవేర్చుకోవాలి.
పెళ్లితో ఈ మూడు రుణాలను కూడా తీర్చుకోవచ్చు
బ్రహ్మచర్యం ద్వారా ఋషి రుణాన్ని తీర్చొచ్చు. వేదధ్యయనం చేయాలి. అలాగే దైవారాధనలో ఉండాలి. గురువుల్ని ఆదరించాలి, పూజించాలి. పురాణాలు మొదలైన వాంగ్మయాన్ని అధ్యయనం చేసాకా.. తర్వాత తరానికి వాటిని అందించడం ద్వారా మనం ఈ రుణాన్ని తీర్చుకోవచ్చు. అలాగే యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞలు చేసి మనం దేవతల్ని తృప్తిపరచొచ్చు. యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి. పంటలు వృద్ధి చెందుతాయి. సత్సంతాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవచ్చు. పితృ దేవతలకి తర్పనాది క్రియలు చేసే సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం