New Year 2025: జనవరి 2025 నుండి ఈ తేదీలలో జన్మించిన వారికి మంచి గడియలు.. విజయాన్ని అందుకుంటారు, తిరుగు ఉండదు-new year 2025 numerology says people who born on these dates will win and get success and all problems will go away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  New Year 2025: జనవరి 2025 నుండి ఈ తేదీలలో జన్మించిన వారికి మంచి గడియలు.. విజయాన్ని అందుకుంటారు, తిరుగు ఉండదు

New Year 2025: జనవరి 2025 నుండి ఈ తేదీలలో జన్మించిన వారికి మంచి గడియలు.. విజయాన్ని అందుకుంటారు, తిరుగు ఉండదు

Peddinti Sravya HT Telugu
Dec 16, 2024 10:20 AM IST

New Year 2025: 2025 జనవరిలో ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరం అంటే చాలా మంది ఎంతో సంతోషంగా, ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, మనం న్యూమరాలజీ ప్రకారం రాబోయే సంవత్సరం ఎలా కలిసి వస్తుంది? ఎవరికి బాగుంటుంది అనేది అంచనా వేయొచ్చు.

New Year 2025: జనవరి 2025 నుండి ఈ తేదీలలో జన్మించిన వారికి మంచి గడియలు
New Year 2025: జనవరి 2025 నుండి ఈ తేదీలలో జన్మించిన వారికి మంచి గడియలు (pixabay)

2024 ఇంకా కొన్ని రోజులతో ముగిసిపోతుంది. 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం చాలా మంది కొన్ని అలవాట్లను మార్చుకోవాలని చూస్తూ ఉంటారు. కొంత మందికి కొత్త సంవత్సరం 2024 కంటే ఇంకా బాగా కలిసి రావాలని భగవంతుడుని ఆరాధిస్తూ ఉంటారు. 2025 జనవరిలో ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరం అంటే చాలా మంది ఎంతో సంతోషంగా, ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, మనం న్యూమరాలజీ ప్రకారం రాబోయే సంవత్సరం ఎలా కలిసి వస్తుంది? ఎవరికి బాగుంటుంది అనేది అంచనా వేయొచ్చు.

ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే, సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్యకు అనుగుణంగా సంఖ్యలు ఉంటాయి. జ్యోతిష్యం మాదిరిగానే, న్యూమరాలజీ కూడా జాతకుల భవిష్యత్తు, స్వభావం, వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జత చేస్తారు, అప్పుడు వచ్చే సంఖ్య మీ డెస్టినీ నంబర్ అవుతుంది. ఉదాహరణకు ఈ 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి 7 సంఖ్య ఉంటుంది.

కొత్త సంవత్సరం వీరికి కలిసి వస్తుంది

న్యూమరాలజీ ప్రకారం జనవరి 2025 వీరికి బాగా కలిసి వస్తుంది. జ్యోతీష్య శాస్త్రంలో న్యూమరాలజీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే, దానిలో ఉన్న సమాచారం ప్రకారం భవిష్యత్తు గురించి అంచనా వేయొచ్చు. జనవరి 2025 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం రాడిక్ సంఖ్య 9 వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఇది అంగారకుడి సంఖ్య. రాడిక్ సంఖ్య 9 వారికి చాలా బాగా కలిసి వస్తుంది. 9వ తేదీన పుట్టిన వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే 18, 27వ తేదీన పుట్టిన వారికి కూడా బాగుంటుంది. మంచి ఎనర్జీతో, ధైర్యంతో ముందుకు వెళ్తారు.

ఈ రంగాల వారికి అదృష్టం

టెక్నికల్ రంగం వారికి అదృష్టం కలిసి వస్తుంది. సెక్యూరిటీ సర్వీసులో పనిచేసే వారికి, క్రీడాకారులకి ఎక్కువ ఎనర్జీ అందుతుంది. ఇంకా బాగా రాణించగలుగుతారు. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు పూర్తవడానికి ఇది మంచి సమయం. కొత్త బాధ్యతల్ని కూడా స్వీకరిస్తారు. అంగారకుడు ప్రభావం ఉండడం వలన మీ ధైర్యం రెట్టింపు అవుతుంది. ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే మీరు పూర్తి చేయగలుగుతారు. కష్టాల నుంచి బయటికి వచ్చేస్తారు. మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది. సులువుగా సక్సెస్ ని అందుకుంటారు.

వీరికి కూడా బాగుంటుంది

న్యూమరాలజీ 2025 ప్రకారం 9,1,8 సంఖ్యల వారికి బాగా కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలని అందుకోవచ్చు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కూడా ఈ సంఖ్యల వాళ్ళకి కలిసి వస్తుంది. అంగారకుడు ప్రభావం ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం కోపం తగ్గించుకోవాలి. లేదంటే ఈ సంఖ్యల వాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. లేదంటే చేసే పనితో విజయాన్ని అందుకోలేరు. ఇబ్బందులు వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం