Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధన లాభం.. రుణాలు, సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు.. మీ రాశి ఎలా ఉందో చూసుకోండి
Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.12.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశి ఫలాలు (దిన ఫలాలు) : 17.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : మంగళవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : పునర్వసు
మేష రాశి
మారుతున్న పరిస్థితులకు భయభ్రాంతులకు గురవుతారు. కొన్ని కార్యక్రమాలను అర్ధాంతరంగా ఆపేస్తారు. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి
వ్యక్తిగత ఎదుగుదల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. నూతన పరికరాలు, ప్రక్రియల పట్ల అవగాహన పెంచుకుంటారు. కార్యాలయంలో మీ నైపుణ్యం, మంచి పేరు కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి.
మిథున రాశి
నూతన ప్రాజెక్టులు అందుకుంటారు. టీ, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ వ్యాపారస్తులకు అనుకూలం. కోర్టు సంబంధమైన వ్యవహారాలు కోర్టు కన్నా బయట పరిష్కారమవుతాయి. నూతన వాహనం కొనుగోలు. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి.
కర్కాటక రాశి
స్థలాల క్రయ విక్రయాలలో లాభాలు. ట్రాన్స్ పోర్ట్ వ్యాపారులకు బాగుంటుంది. ఉద్యోగం లభిస్తుంది. నూతన ఉపాధి దొరుకుతుంది. మధ్యవర్తుల ద్వారా లాభాలు అందుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మహా పాశుపత కంకణం ధరించండి.
సింహ రాశి
కొందరి మాట విని మోసపోతారు. ఏ విషయంలోనైనా, వ్యవహారంలో అయినా ప్రత్యక్షంగా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోవద్దు. ఓం నమశ్శివాయ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి.
కన్య రాశి
జీవిత భాగస్వామితో అనురాగం, ఆప్యాయత చూపిస్తారు. కొందరి ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తుంది. అయినప్పటికీ వారి పట్ల ఓర్పు, సంయమనంతో వ్యవహరిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం. కొంతమందికి అవసరార్థం అందజేసిన ధనం కలిసి వస్తుంది. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి.
తుల రాశి
విదేశాల నుండి ఆర్డర్లు అందుకుంటారు. విదేశీ ద్రవ్యం చేతికి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. జ్యేష్ఠ సంతానం పట్ల ఆసక్తి చూపిస్తారు. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. అయినవాళ్లతో వ్యాపారం చేయాలన్న ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఈ విషయంలో కొంతమందికి మీ పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుంది.
వృశ్చిక రాశి
సహోద్యోగులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. కొంతమంది వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి చేసే విమర్శలు మీకు నచ్చకపోవచ్చు. మీరు తీవ్రంగా ఖండించడం, మీ సహ ఉద్యోగులకు అంతగా నచ్చకపోవచ్చు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలం.
ధనుస్సు రాశి
సినిమా రంగంలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఎక్కువగా సతమతమవుతారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుట ఆ బోట్టు ధరించండి.
మకర రాశి
కొన్ని సందర్భాలలో బయట జరుగుతున్న సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే నిర్ణయాలు కొంతమందికి సరిగ్గా అర్థంకాక మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపు తారు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త. శనీశ్వరాలయంలో తైలాభిషేకం జరిపించండి. నలుపు వత్తులు, నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.
కుంభ రాశి
సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవదర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. మెకానికల్, టైలరింగ్ వారికి అనుకూలం. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తారు. చేతికి కుబేర కంకణం ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది.
మీన రాశి
వ్యాపార ప్రదేశాల్లో కుళ్లు రాజకీయాలు పురుడు పోసుకుంటాయి. ప్రత్యర్థులు, అధికారులతో మంతనాలు జరిపి లేనిపోని చలాన్లు విధించడం, సమస్యలు సృష్టించడం మీకు నష్టం కలిగిస్తుంది. భూమిని అమ్మివేసి వచ్చిన ధనంతో రుణాలు తీర్చి, మిగిలిన ధనంతో దూర ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఫలిస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్