MGU Recruitment : మహాత్మా గాంధీ వర్సిటీలో పార్ట్ టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు- దరఖాస్తు విధానం ఇలా
MGU Faculty Recruitment : నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పార్ట్ టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
MGU Faculty Recruitment : నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎం.ఎ(సైకాలజీ), ఎం.ఎ(ఎకనామిక్స్), ఎం.ఎ(ఇంగ్లీష్), ఎం.ఎ (హిస్టరీ, టూరిజం), బి.టెక్. (సి.ఎస్.ఇ), ఎం.బి.ఎ. ప్రోగ్రామ్‌లకు పార్ట్‌టైమ్/గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇతర విశ్వవిద్యాలయాల నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్లను ఎం.ఎ (సైకాలజీ), ఎం.ఎ (హిస్టరీ& టూరిజం), ఎం.ఎస్సీ (వృక్షశాస్త్రం) ప్రోగ్రామ్‌లకు అనుబంధ ప్రొఫెసర్ల నియామకానికి ఆహ్వానిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును, స్వీయ ధృవీకరణ సర్టిఫికేట్లతో కలిపి “రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ- 508 254” అడ్రస్ కు పంపాలి.
ముఖ్యాంశాలు
- దరఖాస్తులను 14.12.2024 నుంచి 28.12.2024 సాయంత్రం 4.30 గంటల వరకు ఎంజీయూ కార్యాలయంలో సమర్పించవచ్చు.
- దరఖాస్తులను ప్రతి పేజీకి నంబర్ వేసి సరిగ్గా సీల్ చేయాలి.
- ప్రతి విభాగానికి వేర్వేరుగా దరఖాస్తులను సమర్పించాలి.
- అసంపూర్ణ దరఖాస్తులు, తాజా ఫోటోగ్రాఫ్, సంతకం మొదలైనవి లేకుండా, చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారు.
- దరఖాస్తు ఫార్మాట్ https://www.mguniversity.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విద్యా అర్హతలకు తగిన వెయిటేజ్ ఇస్తారు.
- పార్ట్-టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీకి ఎంజీయూ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
పోస్టుల వివరాలు:
- ఎంఏ సైకాలజీ- 03 పోస్టులు
- ఎంఏ ఎకనామిక్స్- 01 పోస్టు
- ఎంఏ ఇంగ్లీష్- 02 పోస్టులు
- ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం- 01 పోస్టు
- బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- 03 పోస్టులు
- ఎంబీఏ (జనరల్)- 01 పోస్టు
- ఎంబీఏ (టీటీఎం)- 02 పోస్టులు
- ఎంబీఏ (ఇంటిగ్రేటెడ్)- 01 పోస్టు
- మొత్తం పోస్టులు- 14.
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ సెట్/ స్లెట్ లేదా పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
సంబంధిత కథనం