Trains Cancelled : దయచేసి వినండి.. ఆరు రైళ్లు రద్దు.. మరో ఆరు రైళ్లు దారి మళ్లింపు!
Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు.. ఇండియన్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే గుంతకల్లు డివిజన్‌లో సేఫ్టీ పనులు కారణంగా.. ఆరు రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి, సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
1. విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 08528 విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్రత్యేక ప్యాసింజర్ రైలును జనవరి 2 నుండి జనవరి 8 వరకు రద్దు చేశారు.
2. రాయ్‌పూర్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 08527 రాయ్‌పూర్-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ రైలును జనవరి 3 నుండి జనవరి 9 వరకు రద్దు చేశారు.
3. విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 08504 విశాఖపట్నం-భవానీపట్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు జనవరి 3 నుండి జనవరి 8 వరకు రద్దు అయ్యింది.
4. భవానీపట్న నుండి బయలుదేరే రైలు నెంబర్ 08503 భవానీపట్న-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ రైలును జనవరి 4 నుండి జనవరి 9 వరకు రద్దు చేశారు.
5. విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 18530 విశాఖపట్నం-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. జనవరి 3 నుండి జనవరి 8 వరకు రద్దు అయ్యింది.
6. దుర్గ్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 18529 దుర్గ్-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ రైలును జనవరి 3 నుండి జనవరి 8 వరకు రద్దు చేశారు.
రైళ్ల మళ్లింపు..
డిసెంబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డివిజన్‌లో.. భద్రతకు సంబంధించిన పనులు జరగనున్నాయి. ఈ కారణంగా పలు రైళ్లు సాధారణ రూట్‌లో నంద్యాల - ధోనే - అనంతపురం మీదుగా కాకుండా.. నంద్యాల - యర్రగుంట్ల - గూటి - అనంతపురం మీదుగా మళ్లిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
1. పూరీ నుండి బయలుదేరే రైలు నెంబర్ 22883 పూరీ - యశ్వంత్‌పూర్ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. డిసెంబర్ 20 నుండి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. డోన్ స్టాప్‌ను రద్దు చేశారు.
2. యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 22884 యశ్వంత్‌పూర్ - పూరీ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. డిసెంబర్ 21 నుంచి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. డోన్ స్టాప్‌ను రద్దు చేశారు.
3. హౌరా నుండి బయలుదేరే రైలు నెంబర్ 22831 హౌరా - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 18, 25 తేదీల్లో దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. డోన్, గూటీ స్టాప్‌లను తొలగించారు.
4. యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 22832 యశ్వంత్‌పూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు.. డిసెంబర్ 20న మళ్లించిన మార్గంలో నడుస్తుంది. డోన్, గూటీ స్టాప్‌లను తొలగించారు.
5. భువనేశ్వర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 02811 భువనేశ్వర్ - యశ్వంత్‌పూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు.. డిసెంబర్ 21న మళ్లించిన మార్గంలో నడుస్తుంది. డోన్ స్టాప్‌ను రద్దు చేశారు.
6. యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 02812 యశ్వంత్‌పూర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 23న మళ్లించిన మార్గంలో నడుస్తుంది. డోన్ స్టాప్‌ను రద్దు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)