AP Trains Information: ప్రయాణికులకు అలర్ట్ - నాలుగు రైళ్లు రద్దు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా 10 రైళ్లు రీషెడ్యూల్
ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ ఇచ్చారు. నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా పది రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.
రైల్వే ప్రయాణికులుకు వాల్తేర్ డివిజన్ డివిజన్ అలర్డ్ ఇచ్చింది. నాలుగు రైళ్లును రద్దు చేసింది. అలాగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పది రైళ్లను రీషెడ్యూల్ చేసింది. రెండు రైళ్లను షార్ట్ టేర్మినేషన్ చేశారు. రాయగడ-విజయనగరం సెక్షన్‌లోని వాల్తేర్ డివిజన్‌లోని కోమటిపల్లి స్టేషన్‌లో గూడ్స్ లూప్ లైన్, సైడింగ్‌ను ప్రారంభించడం కోసం నాన్-ఇంటర్‌లాకింగ్, ప్రీ-ఇంటర్‌లాకింగ్ పనులకు సంబంధించి ట్రాఫిక్ కమ్ పవర్ బ్లాక్‌ల కారణంగా నాలుగు రైళ్లు రద్దు చేశారు.
నాలుగు రైళ్లు రద్దు……
1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కోరాపుట్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (18512) రైలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు రద్దు.
2. కోరాపుట్‌లో బయలుదేరే కోరాపుట్-విశాఖపట్నం బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (18511) రైలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు రద్దు.
3. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ (08546) రైలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు రద్దు
4. కోరాపుట్‌లో బయలుదేరే కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ (08545) రైలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు రద్దు.
పది రైళ్ల రీషెడ్యూల్….
1. నవంబర్ 30, డిసెంబర్ 2, 3 తేదీలలో నాందేడ్‌లో బయలుదేరే నాందేడ్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20810) రైలు నాలుగు గంటల ఆలస్యంగా సాయంత్రం 4.30 గంటలకు బదులు రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది.
2. నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు దుర్గ్‌లో బయలుదేరే దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20829) రైలు రెండు గంటల ఆలస్యంగా ఉదయం 5.45 గంటలకు బదులు ఉదయం 7.45 గంటలకు బయలుదేరుతుంది.
3. నవంబర్ 29న కోయంబత్తూరు నుండి బయలుదేరే కోయంబత్తూరు-ధన్‌బాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06063) రైలు రెండు గంటల ఆలస్యంగా ఉదయం 11.50 గంటలకు బదులు మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరుతుంది.
4. నవంబర్ 29న ఈరోడ్‌లో బయలుదేరే ఈరోడ్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (08312) రైలు రెండు గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 2.45 గంటలకు బదులు మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరుతుంది.
5. నవంబర్ 29న బ్రహ్మపూర్ నుండి బయలుదేరే బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (09060) రైలు ఐదు గంటల ఆలస్యంగా ఉదయం 4.30 గంటలకు బదులు ఉదయం 9.30 గంటలకు బయలుదేరుతుంది.
6. డిసెంబర్ 3న కోయంబత్తూరు నుండి బయలుదేరే కోయంబత్తూరు-బరౌనీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06059) రైలు రెండు గంటల ఆలస్యంగా ఉదయం 11.45 గంటలకు బదులు మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరుతుంది.
7. నవంబర్ 30, డిసెంబర్ 1, 3, 4 తేదీల్లో విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-హజారత్ నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ (12807) రైలు నాలుగు గంటల ఆలస్యంగా ఉదయం 9.20 గంటలకు బదులు మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరుతుంది.
8. నవంబర్ 28, 29, 30, డిసెంబర్ 2, 3 తేదీల్లో హజారత్ నిజాముద్దీన్ నుండి బయలుదేరే హజారత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ (12808) రైలు నాలుగు గంటల ఆలస్యంగా ఉదయం 7 గంటలకు బదులు ఉదయం 11.00 గంటలకు బయలుదేరుతుంది.
9. డిసెంబర్ 1న విశాఖపట్నం నుండి బయలుదేరే రాయగడ మీదుగా విశాఖపట్నం-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (22847) రైలు నాలుగు గంటల ఆలస్యంగా ఉదయం 8.20 గంటలకు బదులు మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుంది.
10. నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20830) రైలు 1.20 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 2.50 గంటలకు బదులుగా సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరుతుంది.
రెండు రైళ్ల షార్ట్‌టెర్మినేషన్….
1. నవంబర్ 28 నుండి డిసెంబర్ 3 వరకు గుంటూరు నుండి బయలుదేరే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243) రైలు విజయనగరం వద్ద షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది.
2. నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244 ) రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుండి బయలుదేరుతుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం