CAT 2024 response sheet: భారత్ లో మేనేజ్మెంట్ విద్యలో అగ్రగామి ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024కు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కోల్కతా నవంబర్ 29న అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్సైట్ iimcat.ac.in నుంచి ఆన్సర్ కీని యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గత సంవత్సరాల మాదిరిగానే ఐఐఎం కలకత్తా క్యాట్ 2024 పరీక్ష జరిగిన ఐదు రోజుల్లోనే రెస్పాన్స్ షీట్ ను అందుబాటులో ఉంచింది. క్యాట్ 2024 నవంబర్ 24న ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూడు సెషన్లలో జరిగింది. దేశవ్యాప్తంగా 170 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
రెస్పాన్స్ షీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే విద్యార్థులు తమ ఆబ్జెక్షన్లను తెలియజేసే అవకాశాన్ని త్వరలో కల్పిస్తామని, త్వరలోనే ఆబ్జెక్షన్ విండో ఓపెన్ అవుతుందని ఐఐఎం కలకత్తా ప్రకటించింది. ఆన్సర్ షీట్ లో ఏదైనా సమాధానాన్ని సవాలు చేయడానికి, ప్రతి ఆబ్జెక్షన్ కు నిర్ణీత మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలపడానికి కొన్ని రోజుల పాటు విండో తెరిచి ఉంటుందని, అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయడానికి తగినంత సమయం లభిస్తుందని తెలిపింది.
రెస్పాన్స్ షీట్ యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
క్యాట్ 2024 (CAT 2024)తుది ఫలితాలు 2025 జనవరి రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్లో యాక్సెస్ చేయవచ్చు. కొంతమందికి ఎస్ఎంఎస్ ద్వారా వ్యక్తిగత నోటిఫికేషన్లు కూడా రావచ్చు. క్యాట్ 2024 స్కోరు 2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని దయచేసి గమనించండి. అన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక ఐఐఎం క్యాట్ వెబ్సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.