Thaman : తమన్ ఫస్ట్ రెమ్యునరేషన్ 30 రూపాయలట - ఓజీ, రాజాసాబ్ అప్‌డేట్స్ చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్
Thaman Interview: పుష్ప 2 రిలీజ్ తర్వాత అవార్డులన్నీ అల్లు అర్జున్ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నాడు. గేమ్ ఛేంజర్‌లో ఏడు పాటలుంటాయని తెలిపాడు. తన బర్త్‌డే సందర్భంగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో సినీ జర్నీపై తమన్ ఏం చెప్పాడంటే?
Thaman Interview: ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ హవా కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమా అనగానే మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పేరు వినిపిస్తోంది ఓజీ, రాజాసాబ్. గేమ్ ఛేంజర్‌తో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు. అల్లు అర్జు పుష్ప 2 మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో పాటు మ్యూజిక్ జర్నీపై తమన్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
గేమ్ ఛేంజర్‌లో ఏడు పాటలు...
ఒకప్పుడు టాలీవుడ్‌లో రొటీన్ సినిమాలే ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో దర్శకులు సినిమాలు చేస్తోన్నారు. వాటికి తగ్గట్లుగా మ్యూజిక్ అందించడం ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది ప్రస్తుతం తెలుగులో నేను మ్యూజిక్ అందిస్తోన్న ‘తెలుసు కదా’, ‘ఓజీ’, ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ ఇలా దేనికదే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘డాకు మహారాజ్’ చిత్రంలో మూడు పాటలే ఉంటాయి. గేమ్ చేంజర్‌లో ఏడు పాటలుంటాయి. డైరెక్టర్ శంకర్ చాలా ఏళ్ల తరువాత ఓ ప్రాపర్ కమర్షియల్ సినిమాను చేస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్ ఇలా ఏది కావాలంటే అది ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా గేమ్ చేంజర్ ఉంటుంది.
సంక్రాంతి పోటీ...
బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతికి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్‌కి రిలీజ్ కావాల్సింది.కానీ ప్లాన్ మారిపోయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చింది. గేమ్ ఛేంజర్‌ను సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం దిల్‌రాజు ఎంతో కష్టపడ్డారు. చాలా అడ్జెస్ట్‌మెంట్స్‌చేశారు. సంక్రాంతికి ఆయన చిత్రమే మరోకటి ఉంది. అందరితో మాట్లాడుకుని అందరికీ సర్ది చెప్పి గేమ్ చేంజర్‌ను జనవరి 10న ఫిక్స్ చేశారు.
అఖండ ఇచ్చినట్లుగా...
సినిమాలో ఎమోషన్ లేకపోతే నేను ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిన వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన కంటెంట్‌కు అనుగుణంగా నేను మ్యూజిక్ ఇస్తాను. అఖండకు ఇచ్చినట్టుగా భగవంత్ కేసరికి ఇవ్వలేను. బీజీఎం అనే దానికి మణిశర్మ తరువాత ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి.. ఇంకొన్ని చిత్రాలకు ఇన్‌స్టూమెంట్ సౌండ్ ఎక్కువగా వినిపించాలి. అఖండకు చేసే టైంలో శివుడే నాలోకి వచ్చి చేయించినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ ఆ రేంజ్ బీజీఎం ఇస్తానో లేదో నాకు తెలీదు.
అవార్డులన్నీ బన్నీకే...
పుష్ప 2 చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ తరువాత అవార్డులన్నీ కూడా బన్నీకి గారి కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పది హేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు సుకుమార్. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను.
ఓజీ కోసం...
నేను ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్దగా ఏమీ సాధించలేదు. ఇకపై సాధించాల్సింది ఉంది. ప్రస్తుతం మన ఇండస్ట్రీ ఎదుగుతూ వస్తోంది. ఒకప్పుడు పక్క భాషలు, రాష్ట్రాల నుంచి ఆర్టిస్టుల్ని తీసుకొచ్చుకునే వాళ్లం. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా ఫేమస్ ఆర్టిస్టులు తెలుగు సినిమాల్లో నటిస్తామని వస్తున్నారు. ఓజీ కోసం కొరియన్, జపాన్ వాళ్లతో చర్చిస్తున్నాం. మన స్పాన్ పెరుగుతోంది. ఇంకా నేను కొత్తగా నేర్చుకుని గ్లోబల్ స్థాయికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది.
రెహమాన్ స్ఫూర్తి...
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ స్థాయికి వెళ్లాలి అన్నది నా కల. బాయ్స్ టైంలో డైరెక్టర్ శంకర్ నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని అని గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. కానీ శంకర్, సుకుమార్ వంటి డైరెక్టర్ల స్టైల్‌కి నేను సరిపోను అనుకునేవాడ్ని. అందుకే వాళ్ల నంబర్లు కూడా నా దగ్గర ఉండవు. లాక్‌డౌన్ టైంలో శంకర్ గారు అల వైకుంఠపురములో సినిమాను కొన్ని వందల సార్లు చూశారట. దిల్ రాజు నాకు ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు, శంకర్‌ను వెళ్లి కలవమని చెప్పినప్పుడు భయం వేసింది. ఆరు నెలల్లోనే ఆల్బమ్ కంప్లీట్ అయింది.
ఇంగ్లీష్ వెర్షన్...
గేమ్ ఛేంజర్ నుంచి త్వరలో ఒక డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేస్తాం. ఆ తరువాత అమెరికాలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి డోప్ అనే పాటను రిలీజ్ చేస్తాం. ఆ పాట ఇంగ్లీష్ వర్షెన్ కూడా ఉంటుంది. గేమ్ చేంజర్ సాంగ్ పిక్చరైజేషన్ చూసి మైండ్ బ్లాక్ అయింది. వాటిని చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ కమర్షియల్ సాంగ్‌లను చూడబోతోన్నాం. అసలు ఆ ఆరు పాటలకే టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు. డైరెక్టర్ శంకర్ మొదట గేమ్ ఛేంజర్‌లో ఆరు పాటల్ని షూట్ చేశారు. ఆ తరువాతే సీన్లను షూట్ చేశారు.
ఆరు పాటలు...
రాజా సాబ్‌లో ఆరు పాటలుంటయి. ఓ రీమేక్ సాంగ్ కూడా ఉంటుంది. ప్రాపర్ కమర్షియల్ సినిమాకు ఉన్నట్లే సాంగ్స్ ఉంటాయి. జనవరి నుంచి పాటల అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నాం.
కాపీ కొట్టడం రాదు...
ఒకప్పుడు మూసధోరణిలో ఉన్న సినిమాలకు కంటిన్యూగా మ్యూజిక్ ఇస్తూ వచ్చాను. ఆ టైంలో కాపీ క్యాట్, కాపీ గోట్ అని ట్రోల్స్ చేశారు. మ్యూజిక్ విషయంలో ప్రస్తుతం నా ఆలోచన ధోరణి మారింది. అందుకే రొటీన్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు. తెలివైన వాళ్లు చాలా జాగ్రత్తగా కాపీ కొడతారు. ఎక్కడి నుంచి కొట్టారో కనిపెట్టలేం. కానీ నాకు అంత తెలివి లేదు. కాపీ కొట్టడం రాదు. అందుకే వెంటనే దొరికిపోతాను(నవ్వులు)
ఓజీ ఆప్‌డేట్స్...
ఓజీ నుంచి సెప్టెంబర్ 2న పాట, పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ వరదల ప్రభావంతో అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. జనవరి నుంచి అప్డేట్లు ఇస్తాం. దాదాపు 80 శాతం షూటింగ్ అయిపోయింది. ఇంత వరకు ఇండియాలో రానటువంటి ఓపెనింగ్స్ ఓజీకి వస్తాయి. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు కష్టపడుతున్నాం. అలాంటి ఈ టైమ్‌లో ఆయనతో పాటలు పాడించడం ఇంకా కష్టం.
డబ్బులు అడుగుతాను…
నా భార్యే నా అకౌంట్, మ్యూజిక్ వ్యవహారాలన్నీ చూస్తారు. నాకు ఏమైనా అవసరాలు పడితే డబ్బులు అడుగుతాను. ఆమె ఇస్తారు. నా కొడుకు ఐఐటీ ఫస్ట్ ఇయర్. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు.
నలభై వేలు...
నా మొదటి రెమ్యూనరేషన్ 30 రూపాయలు. ఆ స్థాయి నుంచి కీ బోర్డ్ ప్లేయర్‌గా నేను ఒక రోజుకి గరిష్టంగా 40 వేలు తీసుకున్నా. ఇండియాలో అదే హయ్యస్ట్. రోజంతా పని చేశాక సాయంత్రం నిర్మాత వచ్చి డబ్బులు ఇచ్చి వాటిని ఇంటికి తీసుకెళ్లడంలో కిక్కు ఉంటుంది. నేను సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను.
బన్నీ... త్రివిక్రమ్ మూవీ...
బన్నీ-త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని కూడా చేస్తున్నాను. ఆ సినిమాతో త్రివిక్రమ్ గారు నెక్ట్స్ లీగ్‌కు వెళ్తారు. అసలు ఆయన ఎప్పుడో వెళ్లాల్సింది. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ కొత్త ప్రపంచాన్ని చూపించబోతోన్నారు. అదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది.అఖండ 2 పనులు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక పాట అయిపోయింది.
ఓజీలో ఆకిరా నందన్....
ఓజీలో రమణ గోగుల గారితో ఓ పాట పాడించాలని చూస్తున్నాను. అకిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. ఓజీ కోసం అకిరాను పిలుస్తాను. అకిరా చేతి వేళ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. పర్ఫెక్ట్ పియానో ప్లే చేసే వ్యక్తిలా ఉంటాడు. రెండు నెలలు నాతో అకిరా పని చేశాడు.