OTT Bold Movies: మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ.. ఒకే ఓటీటీలోకి తెలుగులోకి వచ్చిన మూడు బోల్డ్ మూవీస్-ott bold movies fifty shades of grey fifty shades freed fifty shades darker now streaming in telugu on jio cinema ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Movies: మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ.. ఒకే ఓటీటీలోకి తెలుగులోకి వచ్చిన మూడు బోల్డ్ మూవీస్

OTT Bold Movies: మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ.. ఒకే ఓటీటీలోకి తెలుగులోకి వచ్చిన మూడు బోల్డ్ మూవీస్

Hari Prasad S HT Telugu
Oct 22, 2024 01:09 PM IST

OTT Bold Movies: ఓటీటీలోకి మూడు బోల్డ్ మూవీస్ ఒకేసారి తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చాయి. హాలీవుడ్ లో రిలీజై బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమాల్లో మొత్తం న్యూడ్ సీన్స్ తో థియేటర్లలో రచ్చరచ్చ చేశాయి.

మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ.. ఒకే ఓటీటీలోకి తెలుగులోకి వచ్చిన మూడు బోల్డ్ మూవీస్
మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ.. ఒకే ఓటీటీలోకి తెలుగులోకి వచ్చిన మూడు బోల్డ్ మూవీస్

OTT Bold Movies: ఒకే ఓటీటీలోకి మూడు హాలీవుడ్ బోల్డ్ మూవీస్ తెలుగులో రావడం విశేషం. 2015 నుంచి 2018 మధ్య ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఈఎల్ జేమ్స్ రాసిన ఫిఫ్టీ షేడ్స్ నవలల ఆధారంగా ఈ మూవీస్ తెరకెక్కాయి. న్యూడ్ సీన్స్ తో వచ్చిన ఈ సినిమాలకు రివ్యూలు నెగటివ్ గానే ఉన్నా.. వసూళ్లలో మాత్రం రికార్డులు తిరగరాశాయి.

ఫిఫ్టీ షేడ్స్ మూవీస్

హాలీవుడ్ లో వచ్చిన సినిమాల సిరీస్ ఫిఫ్టీ షేడ్స్. 2015లో తొలిసారి ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే, ఆ తర్వాత 2017లో ఫిఫ్టీ షేడ్స్ డార్కర్, 2018లో ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ అనే మూవీస్ వచ్చాయి.

ఇన్నాళ్లూ ఇంగ్లిష్ లోనే అందుబాటులో ఉన్న ఈ సినిమాలన్నీ ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమాలు ఇంగ్లిష్ లో అందుబాటులో ఉన్నాయి. తెలుగులో చూడాలనుకుంటే మాత్రం జియో సినిమా ప్రీమియంలో చూడొచ్చు.

న్యూడ్ సీన్స్‌తో రచ్చ రచ్చ

ఫిఫ్టీ షేడ్స్ ఫిల్మ్ సిరీస్ మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ చేశాయి. ముఖ్యంగా 2015లో వచ్చిన తొలి మూవీ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే చూసిన ఫ్యాన్స్ షాక్ తిన్నారు. డకోటా జాన్సన్, జేమీ డోర్నన్ నటించిన ఈ సినిమాల్లో మొదటి మూవీకి సామ్ టేలర్ జాన్సన్ డైరెక్ట్ చేయగా.. తర్వాతి రెండు సినిమాలను జేమ్స్ ఫోలీ డైరెక్ట్ చేశాడు.

ఓ లిటరేచర్ స్టూడెంట్, ఓ ధనవంతుడైన వ్యాపారవేత్త మధ్య కలిగే ఆకర్షణతో ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ డ్రే మూవీ సాగుతుంది. అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి అతని అందానికి పడిపోయిన ఆ స్టూడెంట్.. తర్వాత ఆ వ్యక్తి కోరుకున్నట్లుగా అతనికి సెక్యువల్ ఫేవర్స్ అందిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో వచ్చే న్యూడ్ సీన్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. సాధారణంగా పూర్తి న్యూడ్ సీన్లతో ఉండే సినిమాలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే మూవీలో చాలా సీన్లలో లీడ్ రోల్స్ ఇద్దరూ పూర్తి నగ్నంగా కనిపిస్తారు. ఆ ఇద్దరి ఆకర్షణ, ప్రేమ నుంచి పెళ్లి వరకూ మూడు భాగాలుగా ఈ ఫిఫ్టీ షేడ్స్ సినిమాలు వచ్చాయి.

హిట్ ఫ్రాంఛైజీ

ఈ మూవీస్ కి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చినా బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. కేవలం 15 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 132 కోట్ల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఆర్ రేటెడ్ ఫ్రాంఛైజీల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో ఫ్రాంఛైజీగా ఈ ఫిఫ్టీ షేడ్స్ నిలిచింది. ఇప్పుడీ సినిమాలన్నీ జియో సినిమాలో తెలుగులో అందుబాటులోకి వచ్చాయి.

Whats_app_banner