OTT Action Thriller: ఐదు నెలల తర్వాత తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ-ott action thriller furiosa a mad max saga to stream on jio cinema from 23rd october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఐదు నెలల తర్వాత తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Thriller: ఐదు నెలల తర్వాత తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Oct 21, 2024 12:18 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ ఓ సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఇప్పుడు తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఐదు నెలల తర్వాత తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
ఐదు నెలల తర్వాత తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Thriller: హాలీవుడ్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వారికి ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు మరో యాక్షన్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మూవీ పేరు ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఐదు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

yearly horoscope entry point

ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఓటీటీ రిలీజ్ డేట్

హాలీవుడ్ యాక్షన్ మూవీ ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను బుధవారం (అక్టోబర్ 23) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో సినిమా ఓటీటీ వెల్లడించింది. "అల్లకల్లోలం సృష్టించే మ్యాస్ట్రోని కలవండి.

ఫ్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా అక్టోబర్ 23 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది" అనే క్యాప్షన్ తో జియో సినిమా ఈ ట్వీట్ చేసింది.

ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ గురించి..

మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఐదో సినిమా ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా. గత సినిమాలను డైరెక్ట్ చేసిన జార్జ్ మిల్లరే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ ఈ ఫ్రాంఛైజీలోని లీడ్ రోల్ మ్యాక్స్ రాకాటాన్‌స్కీ గురించి కాకుండా.. మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ మూవీకి ప్రీక్వెల్ గా.. ఫ్యూరీ రోడ్ పాత్ర అయిన ఫ్యూరియోసా ఆరిజిన్ స్టోరీగా తెరకెక్కింది. ఈ ఫ్యూరియోసా పాత్రను ఆన్యా టేలర్ జాయ్ పోషించింది.

ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ ఈ ఏడాది మే 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. 168 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 173.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఐదు నెలల తర్వాత ఇప్పుడు జియో సినిమా ద్వారా ఇండియాలో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఇక్కడి అభిమానులు కూడా ఈ యాక్షన్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.

Whats_app_banner