Swiggy Scenes : జొమాటోకి పోటీగా స్విగ్గీ ‘సీన్స్​’- ఇక ఆ టికెట్లు కూడా యాప్​లోనే..-swiggy launches scenes to compete with zomatos district know what is it and how it works ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Swiggy Scenes : జొమాటోకి పోటీగా స్విగ్గీ ‘సీన్స్​’- ఇక ఆ టికెట్లు కూడా యాప్​లోనే..

Swiggy Scenes : జొమాటోకి పోటీగా స్విగ్గీ ‘సీన్స్​’- ఇక ఆ టికెట్లు కూడా యాప్​లోనే..

Sharath Chitturi HT Telugu
Dec 16, 2024 06:40 AM IST

జొమాటోకి పోటీగా స్విగ్గీ మరో కీలక ప్రకటన చేసింది! స్విగ్గీ ‘సీన్స్​’ని లాంచ్​ చేస్తున్నట్టు వెల్లడించింది. స్విగ్గీ సీన్స్​ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? జొమాటోతో పోటీ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జొమాటోకి పోటీగా స్విగ్గీ సీన్స్​,,
జొమాటోకి పోటీగా స్విగ్గీ సీన్స్​,, (Bloomberg)

లైవ్ ఈవెంట్ టికెటింగ్ మార్కెట్​లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రకటించింది. ఈ మేరకు తన యాప్​లో 'సీన్స్' అనే కొత్త ఫీచర్​ని లాంచ్ చేసింది. ఈ స్విగ్గీ సీన్స్​.. జొమాటో కొత్తగా ప్రవేశపెట్టిన డిస్ట్రిక్ట్ ప్లాట్​ఫామ్​కి సవాలు విసురుతుంది. ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్న సీన్స్.. లైవ్ మ్యూజిక్ షోలు, న్యూ ఇయర్ ఈవ్ పార్టీలు, డీజే నైట్స్ సహా భాగస్వామ్య రెస్టారెంట్లలో వివిధ ఈవెంట్ల కోసం టికెట్లను కొనుగోలు చేయడానికి యూజర్స్​కి ఉపయోగపడుతుంది.

స్విగ్గీ సూపర్ యాప్​తో వ్యూహాత్మక ఇంటిగ్రేషన్..

ఈ ఫీచర్​ని స్విగ్గీ విస్తృత సూపర్ యాప్​లో విలీనం చేయడం జరిగింది. ఇది 17.1 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్ల పెద్ద యూజర్ బేస్​ను ఉన్న స్విగ్గీకి మరింత ఉపయోగపడుతుంది. ఇది క్యూ2 ఎఫ్​వై25 నాటికి సంవత్సరానికి 19 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. సినిమా టికెట్లతో సహా అనేక రకాల కార్యక్రమాలను అందించే జొమాటో డిస్ట్రిక్ట్ మాదిరిగా కాకుండా.. స్విగ్గీ సీన్స్ మాత్రం లైవ్ డైనింగ్, ఎంటర్​టైన్మెంట్ అనుభవాలపై మాత్రమే దృష్టి పెడుతుంది.

విస్తరణ ప్రణాళికలు..

స్విగ్గీ వృద్ధి కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికలను రూపొందిస్తోంది. క్రీడలు, వినోదంలోకి కార్యకలాపాలను విస్తరించడానికి సబ్సిడరీని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల పేటీఎం ఇన్సైడర్ వ్యాపారాన్ని జొమాటో రూ.2,048 కోట్లకు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం స్విగ్గీ ఈ తీసుకుంది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీని మించిన కంపెనీ వ్యూహంలో డిస్ట్రిక్ట్​ని గేమ్ ఛేంజర్​గా భావిస్తున్నారు.

స్విగ్గీ, జొమాటో మధ్య పోటీ ఈ మధ్య కాలంలో తీవ్రమవుతోంది. రెండు కంపెనీలు ఇప్పుడు ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, డైనింగ్ అవుట్, ఈవెంట్ ఎక్స్​పీరియన్స్​లో డైరక్ట్​గా పోటీ పడుతున్నాయి. సీన్స్​ అనేది ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.

స్విగ్గీ వన్ బీఎల్​సీకే మెంబర్​షిప్..

‘సీన్స్’తో పాటు స్విగ్గీ వన్ బీఎల్​సీకే అనే ప్రీమియం మెంబర్​షిప్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆన్-టైమ్ గ్యారంటీతో వేగవంతమైన ఫుడ్ డెలివరీ, కాంప్లిమెంటరీ డ్రింక్స్, ప్రాధాన్యత కస్టమర్ మద్దతుతో సహా ఈ సభ్యత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్​స్టార్ వంటి భాగస్వాముల నుంచి ఎక్స్​క్లూజివ్ డిస్కౌంట్లు, అన్​లిమిటెడ్ డెలివరీలు, బెనిఫిట్స్ పొందవచ్చు. మూడు నెలల పాటు రూ.299 ధరకు లాంచ్ అయిన వన్ బీఎల్​సీకే భారతదేశం అంతటా ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న స్విగ్గీ వన్ సభ్యులు అప్​గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

స్విగ్గీ కొత్త కార్యక్రమాలు ఫుడ్ డెలివరీకి మించి తన ఆఫర్లను వైవిధ్యపరచడానికి, పోటీ మార్కెట్​లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి విస్తృత వ్యూహంలో భాగంగా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం