Manoj Bajpayee: నాన్నను చనిపోమన్నాను.. ఏడాదికే తల్లి మరణించింది: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయి
Manoj Bajpayee About His Father Death: తన తండ్రిని చనిపోమ్మని చెప్పినట్లు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయి షాకింగ్ విషయాలు చెప్పారు. తండ్రి చనిపోయిన మరుసటి ఏడాదే తన తల్లి కూడా మరణించారని, అదే నయమని ఆమె చెప్పినట్లు మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు.
Manoj Bajpayee About Mother Death: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యాక్టర్, వెర్సటాలిటీ నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఓటీటీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ సైలెన్స్ 2తో (Silence 2 OTT) అలరించిన ఆయన భయ్యాజీ అనే మూవీ చేస్తున్నారు.
షాకింగ్ విషయం
అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ చిత్రం మే 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే కాకుండా తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3 (The Family Man 3 OTT) కూడా చేస్తున్నారు. ఈ సీజన్ 3ను ఈ ఏడాదిలో ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తన తండ్రి రాధాకాంత్ బాజ్‌పాయ్‌ను తానే చనిపోమ్మని చెప్పినట్లు షాకింగ్ విషయం బయటపెట్టారు మనోజ్ బాజ్‌పాయ్.
విముక్తి చేయాలని
"నా జీవితంలో అత్యంత విషాదకర సంఘటన మా నాన్న మరణం. ఒకరోజు నా సోదరి కాల్ చేసి నాన్న జీవితం పూర్తియందని తెలిపింది. డాక్టర్స్ మాత్రం ఆయన ఇంకా ఈ ప్రపంచంలోనే ఇరుక్కున్నారని చెప్పారని ఆమె చెప్పింది. నాకు మా నాన్నకు మధ్య ఎక్కువ అనురాగం, ఆప్యాయత ఉండేది. అందుకని నన్నే ఆయన్ను విముక్తి చేయాలని చెప్పారు" అని మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు.
బాయ్ ఏడ్చేశాడు
"అప్పుడు నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అదే సెట్‌లో ఉన్నాను. నా వ్యాన్‌లో ఓ బాయ్ ముందే నేను మా నాన్నతో ఫోన్‌లో మాట్లాడాను. నాన్న నొప్పి భరించింది చాలు. ప్లీజ్ వెళ్లిపో.. అందరినీ వదిలి వెళ్లిపోయే సమయం వచ్చేసింది అని చెప్పాను. అలా మాట్లాడినందుకు నా మనసు చాలా కుంగిపోయింది. అక్కడ ఉండి నా మాటలను విన్న బాయ్ ఏడ్చేశాడు" అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పారు.
మనసు తేలికపడింది
"ఆ రోజులు ఎంత కష్టంగా గడిచాయో నాకు మాత్రమె తెలుసు. నేను అలా మాట్లాడిన తర్వాతి రోజు తెల్ల వారు జామున మా నాన్న మరణించారు. నాన్న నన్ను చూడాలనే తన శరీరాన్ని వదిలి వెళ్లిపోలేదు. ఎప్పుడైతే నా గొంతు విన్నారో అప్పుడు ఆయన మనసు తెలికగా అయింది. నాన్న చనిపోయారన్న వార్త విన్నాక కన్నీళ్లు ఆగలేదు" అని మనోజ్ బాజ్‌పాయ్ ఎమోషనల్ అయ్యారు.
చావే నయమని చెప్పి
"నాన్న చనిపోయిన కొంతకాలానికి మా అమ్మకు క్యాన్సర్ మళ్లీ తిరగబడింది. తను ఊరిలో ఉండి సొంత వైద్యం కోసం ప్రయత్నించింది. అయితే నా సోదరి మెరుగైన చికిత్స, వైద్యం కోసం అమ్మను సిటీకి తీసుకొచ్చింది. కానీ, ఆమెకు మా మీద ఆధారపడటం ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరి మీద ఆధారపడటం కంటే చావే నయమని వైద్యులతో చెప్పింది" అని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు.
ఏడాదికే మరణించారు
"నాన్న చనిపోయిన మరుసటి ఏడాదే మా అమ్మ కూడా మరణించారు" అని తన తల్లిదండ్రుల మరణవార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఎంతో బాధగా చెప్పారు మనోజ్ బాజ్‌పాయ్. కాగా మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి పేరు రాధాకాంత్ (Radhakant Bajpai) అకా ఆర్కే బాజ్‌పాయ్ 2021 అక్టోబర్‌లో చనిపోగా తల్లి 2022 డిసెంబర్‌లో మరణించారు.