NNS 16th December Episode: అమర్‌ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్
NNS 16thDecember Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్లో అమర్ ప్రాణాలతో బయటపడతాడు. అటు మనోహరిని తిట్టి పంపించేస్తారు పిల్లలు. వాళ్ల జోలికి వెళ్లొద్దని ఆమెకు శివరాం, నిర్మల వార్నింగ్ ఇస్తారు.
NNS 16th December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 16) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ శరీరంలో బుల్లెట్ ఉందని, అది తీయకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటారు డాక్టర్లు. అది విని ఏడుస్తూ.. ఆయన లేకపోతే పిల్లలు బతకలేరు. మిస్సమ్మ బతకదు. ఆయన బతకాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది ఆరు. ఇప్పుడు నేను ఏమీ చేయలేనని గుప్త అంటాడు. దాంతో ఆరు మోకాళ్ల మీద కూర్చుని గుప్తను ప్రాధేయపడుతూ నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతుంది.
అమర్‌ను కాపాడే మార్గం చెప్పిన గుప్త
దీంతో గుప్త ఒక్క అవకాశం ఉందని చెప్పగానే ఏంటని ఆరు అడుగుతుంది. నువ్వు నీ స్పర్శ శక్తిని త్యజించి జగన్నాథున్ని ప్రార్థిస్తే బాగవుతుందని చెప్తాడు. వెంటనే ఆరు అక్కడే ఉన్న గణపతి విగ్రహం దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తుంది. దేవుడు ఆరు స్పర్శ శక్తిని తీసుకుంటాడు. ఇంతలో ఆపరేషన్ అయిపోతుంది.
డాక్టర్ బయటకు రాగానే మిస్సమ్మ.. అమర్‌కు ఎలా ఉందని అడుగుతుంది. ఇప్పుడే బాడీలోంచి బుల్లెట్ తీశాం. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆరు దేవుడికి దండం పెట్టుకుని సంతోషంగా అక్కడే కూలబడిపోతుంది. సంతోషంతో ఏడుస్తూ.. గుప్తను చూసి నమస్కారం చేస్తుంది.
అమర్‌ను చూసేందుకు ఆరు తహతహ
లోపలికి వెళ్లగానే ముసలి సంఘం మొత్తం నా మీదకు దాడికి వస్తారు. అదే జరిగితే అమర్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను. వాళ్ళు స్టార్ట్ చేసినట్టు అమర్ ముందు నేనే బాధపడినట్టు నటిస్తే.. అని మనసులో అనుకుంటుంది మనోహరి. దీంతో డాక్టర్ బయటకు రాగానే డాక్టర్ గారు మేము వెళ్లి మా అబ్బాయిని చూడొచ్చా అని శివరాం అడుగుతాడు. చూడొచ్చు పది నిమిషాల్లో రూంకు షిఫ్ట్ చేస్తున్నాము ఇంకో విషయం ఆయనుకు రెస్ట్ కావాలి. మీరు చూసి వచ్చేయండి. పేషెంట్ ను డిస్టర్బ్ చేయోద్దు అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
డాక్టర్ మాటలు విన్న ఆరు సంతోషంగా అమర్‌ను చూడటానికి వెళ్తుంటే గుప్త ఆపేస్తాడు. ఎందుకు గుప్త గారు నన్ను పదే పదే ఆపుతున్నారు అని ఆరు అడుగుతుంది. ఎందుకంటే నేను నిన్ను ఆపకపోతే నువ్వు తప్పు మీద తప్పు చేసేదవు. వాటిని కప్పి పుచ్చలేక నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది అని గుప్త చెప్తాడు. దీంతో ఆయన అంత పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. నాకు చూడాలని ఉండదా..? అని అడుగుతుంది. ఉండును కానీ ఆ బాలిక పక్కన ఉండగా నువ్వు వెళ్లరాదు అంటాడు గుప్త. సరే మిస్సమ్మకు కనిపించకుండా నేను చూడొచ్చా అని అడుగుతాడు. సరే అంటాడు గుప్త.
మనోహరిపై రామ్మూర్తి మండిపాటు
అందరూ రూంలోకి వెళ్లి అమర్‌ను చూస్తుంటారు. ఇంతలో మెలకువ వచ్చిన అమర్ ఏదో పలవరిస్తుంటే.. మనోహరి దగ్గరకు వెళ్లి అమర్ ఎలా ఉంది అని అడుగుతుంది. అమర్ మాత్రం మిస్సమ్మ అంటాడు. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి అమర్ చేయి పట్టుకుంటుంది. అమర్ కళ్లు తెరచి అందరినీ చూస్తాడు. బయట నుంచి తొంగి చూస్తున్న ఆరు గుప్తను కోపంగా.. ఇంకా నేనెప్పుడు మా ఆయన్ని చూడాలి అంటుంది.
అటు అమర్.. పిల్లలకు ఏం కాలేదు కదా..? అని అడుగుతాడు. ఏం కాలేదని చెప్తారు. ఇంతలో మనోహరి.. సారీ అమర్ ఇదంతా జరగడానికి ఒకరకంగా నేను కారణం అయ్యాను అంటుంది. దాంతో రామ్మూర్తి ఒక రకంగా కాదు మనోహరి గారు.. ఈ మొత్తానికి కారణం మీరే. చూడమ్మా మనోహరి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు నా కూతురు వద్దంటున్నా వినకుండా పిల్లలను ఎక్స్ కర్షన్‌కు పంపించకుండా ఉండాల్సింది అని రామ్మూర్తి అనడంతో అమర్ పర్వాలేదండి ఇక ఏమీ కాలేదు కదా..? అంటాడు. ఇంతలో సిస్టర్ వచ్చి పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరే ఉండండి అని చెప్పగానే మిస్సమ్మ మాత్రమే ఉంటుంది. అందరూ వెళ్లిపోతారు.
మనోహరిని తిట్టిన పిల్లలు, శివరాం
పిల్లలు నలుగురు గార్డెన్‌లో కూర్చోవడం చూసిన మనోహరి.. పిల్లల దగ్గర ఎలాగైనా మార్కులు కొట్టేయాలని, రేపు ఆ మిస్సమ్మ రాగానే మళ్లీ దాని మీదకు అందరినీ రెచ్చగొట్టాలని మనసులో అనుకుని పిల్లల దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే.. పిల్లలందరూ కలిసి మనోహరిని తిట్టి వెళ్లిపోమ్మని పంపిస్తారు. లోపలికి వెళ్లిన మనోహరిని శివరాం, నిర్మల మందలిస్తారు.
నువ్విక పిల్లల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని చెప్పి వెళ్లిపోతారు. దాంతో మనోహరి ఇరిటేటింగ్ ఫీలవుతుంది. పిల్లలకు మళ్లీ దగ్గరవ్వడానికి మనోహరి ఏం చేయబోతోంది? ఆరు ఆత్మ యమలోకానికి వెళ్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్ 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్