Sci-Fi movies on AI: ఈ సినిమాలు చూస్తే ఏఐ అంటేనే భయపడిపోతారు.. ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కడ చూడాలంటే?-sci fi movies on artificial intelligence her megan the creator on netflix prime video hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sci-fi Movies On Ai: ఈ సినిమాలు చూస్తే ఏఐ అంటేనే భయపడిపోతారు.. ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కడ చూడాలంటే?

Sci-Fi movies on AI: ఈ సినిమాలు చూస్తే ఏఐ అంటేనే భయపడిపోతారు.. ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కడ చూడాలంటే?

Dec 16, 2024, 11:51 AM IST Hari Prasad S
Dec 16, 2024, 11:51 AM , IST

Sci-Fi movies on AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. అయితే హాలీవుడ్‌లో వచ్చిన ఈ ఐదు సినిమాలు చూస్తే మాత్రం ఏఐ అంటే భయపడిపోతారు. అవేంటి? ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.

Sci-Fi movies on AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై వచ్చిన మూవీ మేగన్ (M3gan). ఈ సినిమా ఓ ఏఐ ఆధారిత బొమ్మ చుట్టూ తిరుగుతుంది. పిల్లలకు మంచి ఫ్రెండ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో తయారు చేసిన ఈ బొమ్మ.. తర్వాత ఎలాంటి సమస్యలు సృష్టించిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో సినిమా అందుబాటులో ఉంది.

(1 / 5)

Sci-Fi movies on AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై వచ్చిన మూవీ మేగన్ (M3gan). ఈ సినిమా ఓ ఏఐ ఆధారిత బొమ్మ చుట్టూ తిరుగుతుంది. పిల్లలకు మంచి ఫ్రెండ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో తయారు చేసిన ఈ బొమ్మ.. తర్వాత ఎలాంటి సమస్యలు సృష్టించిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో సినిమా అందుబాటులో ఉంది.(Prime Video)

Sci-Fi movies on AI: హర్ (Her) హాలీవుడ్ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సై-ఫి మూవీ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సమంత పేరుతో ఉన్న ఓ ఏఐ అసిస్టెంట్ తో మూవీలోని లీడ్ క్యారెక్టర్ ప్రేమలో పడతాడు. భవిష్యత్తులో మనుషుల తోడు లేకుండా ఒంటరిగా ఉండే వారికి ఈ ఏఐ అసిస్టెంట్లు ఎలాంటి సాయం అందిస్తాయన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఏఐ క్లౌడ్ ఎంత ప్రమాదమో కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

(2 / 5)

Sci-Fi movies on AI: హర్ (Her) హాలీవుడ్ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సై-ఫి మూవీ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సమంత పేరుతో ఉన్న ఓ ఏఐ అసిస్టెంట్ తో మూవీలోని లీడ్ క్యారెక్టర్ ప్రేమలో పడతాడు. భవిష్యత్తులో మనుషుల తోడు లేకుండా ఒంటరిగా ఉండే వారికి ఈ ఏఐ అసిస్టెంట్లు ఎలాంటి సాయం అందిస్తాయన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఏఐ క్లౌడ్ ఎంత ప్రమాదమో కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.(Netflix)

Sci-Fi movies on AI: ది క్రియేటర్ అనే మూవీ 2023లో రిలీజైంది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఏఐ రోబోలు, మనుషుల మధ్య జరగబోయే యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించారు. 

(3 / 5)

Sci-Fi movies on AI: ది క్రియేటర్ అనే మూవీ 2023లో రిలీజైంది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఏఐ రోబోలు, మనుషుల మధ్య జరగబోయే యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించారు. (Prime Video)

Sci-Fi movies on AI: ప్రైమ్ వీడియోలో ఉన్న 2001: ఎ స్పేస్ ఒడిస్సీ మూవీ కూడా ఏఐపై రూపొందిన పాపులర్ మూవీస్ లో ఒకటి. HAL 9000 అనే కంప్యూటర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఏఐ ఎంత ప్రమాదకరమో, భవిష్యత్తులో వాటి నుంచి మనుషులకు వాటిల్లే ముప్పు గురించి ఈ సినిమా చర్చించింది.

(4 / 5)

Sci-Fi movies on AI: ప్రైమ్ వీడియోలో ఉన్న 2001: ఎ స్పేస్ ఒడిస్సీ మూవీ కూడా ఏఐపై రూపొందిన పాపులర్ మూవీస్ లో ఒకటి. HAL 9000 అనే కంప్యూటర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఏఐ ఎంత ప్రమాదకరమో, భవిష్యత్తులో వాటి నుంచి మనుషులకు వాటిల్లే ముప్పు గురించి ఈ సినిమా చర్చించింది.(Pixabay)

ఐ యామ్ మదర్ (I am mother) మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. ఓ పాపను ఓ హ్యూమనాయిడ్ రోబో పెంచుతూ ఉంటుంది. అయితే అలాంటి రోబో చేతుల్లో పెరిగిన ఆ పాప అసలు మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటుంది. ఏఐపై మరీ ఎక్కువగా ఆధారపడితే కలిగే నష్టాలేంటో ఈ సినిమా ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.

(5 / 5)

ఐ యామ్ మదర్ (I am mother) మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. ఓ పాపను ఓ హ్యూమనాయిడ్ రోబో పెంచుతూ ఉంటుంది. అయితే అలాంటి రోబో చేతుల్లో పెరిగిన ఆ పాప అసలు మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటుంది. ఏఐపై మరీ ఎక్కువగా ఆధారపడితే కలిగే నష్టాలేంటో ఈ సినిమా ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.(Netflix)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు