NNS December 7th Episode: బస్సును ట్రాక్ చేసిన అమర్- కనిపెట్టిన కిడ్నాపర్- మనోహరికి తిట్లు- రేఖా బంధనంలో ఆరు
Nindu Noorella Saavasam December 7th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో బస్సును ట్రాక్ చేస్తూ ఉంటాడు అమర్. అయితే తనకు కాల్ చేసింది అమర్ అనే విషయం తెలుసుకుంటాడు డ్రైవర్. మరోవైపు పిల్లలు ఎక్స్‌కర్షన్‌కు వెళ్లడం వద్దని మిస్సమ్మ ఎంత చెప్పిన వినలేదని నిర్మల ఏడుస్తుంది.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 7th December Episode)లో అమర్ బస్సులో ఉన్న డ్రైవర్‌కు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. హైవే దాటి ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాము అని చెప్తాడు బస్సు డ్రైవర్.
షాకింగ్‌గా అమర్
అక్కడ ఏమీ అనుమానంగా లేదు కదా..? అని అడగ్గానే ఏం లేదని చెప్తాడు. మిమ్మల్ని ఎవరూ ఫాలో అవ్వడం లేదా..? అంటే లేదని డ్రైవర్ చెప్పగానే ఫోన్ కట్ అవుతుంది. అమర్ షాకింగ్‌గా నిలబడిపోతాడు. శివరామ్ భయంగా అమర్ ఏమైంది చెప్పు అని అడుగుతాడు. నిర్మల కూడా భయపడుతూ అమర్ ఆ డ్రైవర్ పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడుగుతుంది. అమర్ ఏమీ పలకడు.
ఇంతలో రాథోడ్ కూడా ఆ డ్రైవరు.. అంటూ అనుమానంగా అడగుతాడు. మరోవైపు డ్రైవరుకు అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. అందులో అమర్ నెంబర్ ఉండటంతో అరవింద్‌కు ఫోన్ చేసి కంగారులో అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడానని.. నేను అతనికి దొరికిపోయానని చెప్తాడు. దీంతో అరవింద్ కోపంగా డ్రైవరును తిడతాడు.
బస్సులోకి రాజు
అమర్ చేతిలో నేను ఓడిపోకూడదు.. ఈసారి అమర్‌కు దొరికితే జీవితంలో బయటకు రాలేను అనుకుంటూ రాజుకు ఫోన్ చేసి దాబా దగ్గరకు బస్సు వస్తుంది. నువ్వు వెళ్లి ఆ బస్సు ఎక్కు అని చెప్తాడు. అమర్ లాప్ టాప్ తీసుకుని బస్సును ట్రాక్ చేస్తుటాడు. అందరూ భయంతో చూస్తుంటారు. మరోవైపు బస్సు దాబా దగ్గర ఆపగానే రాజు వచ్చి బస్ ఎక్కుతాడు. ప్రిన్సిపాల్ ఎవరు నువ్వు అని అడుగుతుంది. మేడం మా వాడే అని డ్రైవర్ చెప్తాడు.
ఇంతలో అరవింద్ మళ్లీ డ్రైవరుకు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు. డ్రైవర్ మీరు చెప్పినట్టే చేస్తానని ఫోన్ కట్ చేసి బస్సు ఆపుతాడు. బస్సు ఎందుకు ఆపావని ప్రిన్సిపాల్ అడుగుతుంది. డ్రైవర్ సీట్‌లోంచి వచ్చి గన్ తీసి అందర్ని బెదిరిస్తాడు. ఏం కావాలి మీకు అంటూ ప్రిన్సిపాల్ అడగ్గానే.. ఈ బస్సులో ఇప్పటి నుంచి నేను చెప్పిందే వినాలి. ఈ బస్సులో బాంబు ఫిక్స్ చేశా.. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఒక్క బటన్ నొక్కగానే అందరూ పోతారు. అంటూ వెళ్లి బస్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్.
దాంతో పిల్లలందరూ భయంతో వణికిపోతుంటారు. డ్రైవర్.. రాజును పిలిచి మన మీద అమరేంద్రకు డౌటు వచ్చింది. మనం వీళ్లను మన ప్లేస్‌కు తీసుకెళ్లే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న తప్పటడుగు వేసినా అందరం దొరికిపోతాం అని చెప్తాడు. సరే అన్నా నేను చూసుకుంటాను అంటాడు రాజు. నిర్మల ఏడుస్తుంది.
ఇక నుంచి మిస్సమ్మదే నిర్ణయం
అసలు తప్పంతా మనదేనండి.. పిల్లలు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మనమే.. మిస్సమ్మ చెప్తున్నా వినకుండా పిల్లలను పంపించాం అని నిర్మల అంటుంది. అవునే వాళ్ల వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలియక పంపించాం అంటాడు శివరామ్. మామయ్యా పిల్లలు మారం చేస్తుంటే మీరేం చేస్తారు అంటుంది మిస్సమ్మ. ఇక నుంచి పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమ్మగా మిస్సమ్మే తీసుకోవాలండి.. ఇలా తలా ఒకటి ఆలోచిస్తూ ఏది బడితే అది చేస్తూ పిల్లల ప్రాణానికే ప్రమాదం తీసుకొచ్చాం అంటుంది నిర్మల.
సరిగ్గా చెప్పావే.. తల్లి మనసు కాబట్టి ప్రమాదాన్ని ముందే పసిగట్టింది అంటాడు శివరామ్. ప్రతిసారి వీళ్లకు దీని భజన ఏంటో అంటూ మనసులో అనుకుని ఏంటి ఆంటీ ఒక్కసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా తెలుస్తుంది అని మనోహరి అంటుంది. అలా అనగానే నిర్మల కోపంగా మనోహరిని తిడుతుంది. నువ్వే మధ్యలో వచ్చి వాళ్లు వెళ్లేలా చేశావు అంటుంది.
అడిగింది చేస్తానన్నారు
ఇంతలో అమర్ వచ్చి నాన్నా మీరేం భయపడకండి పిల్లలను సేఫ్‌గా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి వెళ్లిపోతాడు. మిస్సమ్మ నేను కూడా వస్తాను అని అడుగుతుంది. సరేనని అమర్, మిస్సమ్మను తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు అరుంధతి బాధగా గుప్త దగ్గరకు వెళ్లి ఏదైనా చేసి నా పిల్లలను కాపాడండి. నేను యమపురికి వస్తే.. నేను అడిగింది చేస్తా అన్నారు కదా..? అంటుంది.
బాలికా ఇప్పుడు నా చేతిలో ఏమీ ఉండదని నీకు చెబితిని కదా..? జరుగునది వీక్షించడం తప్పా ఏమీ చేయకూడదు. చేయలేను అంటాడు గుప్త. అయితే నా పిల్లలను నేనే కాపాడుకుంటాను అని అరుంధతి వెళ్తుంటే గుప్త మంత్రం వేసి ఆరు చుట్టు బంధనం వేస్తాడు. అరుంధతి వెళ్లకుండా ఆపేస్తాడు. నువ్వు ఆ గీత దాటి బయటకు వస్తే నేను నీ అనుమతి లేకుండా నిన్ను మా లోకానికి తీసుకెళ్లవచ్చు అంటాడు.
టాపిక్