NNS 11th December Episode: లాండ్మైన్ తొక్కిన అమర్.. పడిపోయిన ఆకాష్.. మిస్సమ్మపైకి వెళ్లిన పాము!
NNS 11thDecember Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 11) ఎపిసోడ్ లో చీకటి పడినా పిల్లలు ఉన్న చోటికి వెళ్లిన అమర్ తోపాటు ఇటు మిస్సమ్మ కూడా ప్రమాదంలో పడుతుంది. పెద్ద పామును చూసిన ఆకాష్ పడిపోతాడు.
NNS 11th December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 11) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పిల్లలకోసం వెళ్లిన అమర్, భాగీ అడవిలో వెతుకుతుంటారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆకాష్ కిటికీలోంచి పెద్ద పామును చూసి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఇంతలో పిల్లలు అందరూ భయంతో ఆకాష్ అని పిలుస్తారు.
ఇంతలో అరవింద్ వచ్చి పిల్లలను తిడతాడు. ఏమైందని అడుగుతాడు. మా తమ్ముడు కిటికీలోంచి బయటకు చూసి కింద పడిపోయాడు అని చెప్తుంది అమ్ము. అరవింద్ మాత్రం కోపంగా లాస్ట్ టైం స్కూల్ లో ఆడిన నాటకాలు ఆడుతున్నారా..? అంటూ తిడతాడు.
వెపన్ లేకుండానే వెళ్తానన్న అమర్
ఆరు అడవిలోకి వచ్చి అమర్ వాళ్లు ఉన్న వైపు పరుగెడుతుంది. దూరంలో అమర్ వాళ్లు కనిపించగానే మిస్సమ్మ అంటూ పరుగెడుతుంది. మిస్సమ్మను పిలుస్తుంది. కానీ ఆరు మాటలు కానీ ఆరు కానీ మిస్సమ్మకు వినిపించదు.. కనిపించదు. ఇంతలో ఆర్మీ ఆఫీసర్ వస్తాడు. అరవింద్ చేసిన డిమాండ్ల గురించి అమర్‌కు చెప్తాడు. నువ్వు వెపన్ లేకుండా వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పగానే నాకు ఓకే సార్ నేను ఇప్పుడే వెళ్తాను అంటాడు. వాళ్లెంత దుర్మార్గులో తెలిసి కూడా మీరు వాళ్ల దగ్గరకు ఒంటరిగా వెళ్తా అంటారేంటండి వద్దు అంటూ బాధపడుతుంది ఆరు. మిస్సమ్మ కూడా వద్దని వారిస్తుంది.
అమర్ మాత్రం నాకేం కాదు మిస్సమ్మ నేను ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్లడం చాలా అవసరం అంటాడు అమర్. దాంతో ఆఫీసర్ వద్దని అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదు. ప్రమాదం ఏంటో తెలియకుండా నిన్ను అక్కడికి పంపించను అంటాడు. అది గజమయూరి అనే భయంకరమైన పాము ఉన్న ఏరియానంట సార్ అని మిస్సమ్మ చెప్తుంది. ఆ మాటలు విన్న ఆరు భయంగా పిల్లలకు పాము వల్ల ప్రమాదం ఉందన్నమాట అనుకుంటూ బాధపడుతుంది. గజమయూరి స్థావరంలోకి వెళ్లిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదని చెప్తున్నారు. అరవింద్‌కు ఈ విషయం చెప్పాలన్నా.. పిల్లలను అక్కడి నుంచి సేఫ్‌గా తీసుకురావాలన్నా నేను అక్కడికి వెళ్లాలి సార్ అని అమర్ చెప్పడంతో ఆర్మీ ఆఫీసర్ అరవింద్ కు ఫోన్ చేస్తాడు.
గజమయూరి గురించి పట్టించుకోని అరవింద్
అరవింద్ నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పగానే ఏంటి సార్ మీకు పిల్లలు అంటే మీకు లెక్కే లేనట్టు ఉంది. పోనీ ఒకరిని చంపి మీకు పార్శిల్ చేసి పంపించనా..? అనగానే మిస్సమ్మ భయపడుతుంది. జోక్ చేశాను సార్ ఎందుకు అంత టెన్షన్ అంటాడు. దీంతో ఆర్మీ ఆఫీసర్ అమరేంద్రను పంపిస్తాను అని చెప్పగానే ఇప్పుడొద్దు ఇవాళ రాత్రికి అక్కడే ఉండండి.. రేపు పొద్దున్నే పంపించండి అంటాడు. అమర్ నేను ఇప్పుడే వస్తాను అంటాడు. అరవింద్ వినడు. గజమయూరి పాము గురించి అమర్ చెప్పినా అరవింద్ కన్వీన్స్ కాడు.
ఓపిగ్గా మాట్లాడుతున్నానని అడ్వాంటేజ్ తీసుకుందామనుకుంటున్నావా.. ఆఫీసర్. ఇక్కడ చుట్టూ కెమెరాలు పెట్టాను మీ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది అంటూ ఫోన్ కట్ చేస్తాడు. కోపంగా పామంటా.. పాము.. అంటూ అనగానే అనుచరుడు నిజమే అయ్యుండొచ్చు అన్న పొద్దునే మనం బోర్డు చూశాము కదా..? అంటాడు. అరవింద్ తన అనుచరుణ్ని తిడుతూ అరవింద్ కావాలనే మనల్ని బెదిరించి బయటకు వచ్చేలా పాము కథలు చెప్తున్నాడు అంటాడు. పిల్లలు అందరూ భయపడుతుంటారు. ఆకాష్‌ను ఎందుకు అంతలా భయపడ్డావు అని అడిగితే పలకడు.. ప్రిన్సిపాల్ అడగ్గానే పామును చూశానని చెప్తాడు.
వద్దని చెబుతున్నా వెళ్లిన అమర్
ఏంటి పాముకే అంతలా అరవాలా..? అని ప్రిన్సిపాల్ అడగ్గానే మేడం పాము అంటే చిన్నది కాదు మేడం.. పెద్దది మన స్కూల్ అంత ఉంది మేడం అని ఆకాష్ చెప్పగానే ప్రిన్సిపాల్, పిల్లలు భయపడతారు. ఇంతలో ప్రిన్సిపాల్ మమ్మల్ని భయపెట్టాలని అలా చెప్తున్నావు కదా అని అడుగుతుంది. లేదు మేడం నిజంగానే చెప్తున్నాను అంటాడు. దీంతో ప్రిన్సిపాల్ భయంతో రౌడీని పిలిచి పాము గురించి చెప్తుంది. రౌడీ కోపంగా ప్రిన్సిపాల్ ను తిడుతాడు.
చీకటి పడినా కూడా అమర్ వాళ్లు ఫారెస్ట్ లో వెయిట్ చేస్తుంటారు. ఇంతలో అమర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి నేను లోపలికి వెళ్తున్నాను అంటాడు. ఆరు బాధపడుతుంది. చుట్టూ చీకటిగా ఉంది ఎలా వెళ్తారండి అనుకుంటుంది. ఆల్ రెడీ అక్కడ అందరి ప్రాణాలు రిస్క్‌లో ఉన్నాయి కదా.. ఇప్పుడు నీ ప్రాణాలు కూడా ఎందుకు రిస్క్‌లో పెట్టడం అంటాడు ఆర్మీ ఆఫీసర్.
మనం ఏం చెప్పినా అరవింద్ అదేదీ నమ్మడు సార్. అదంతా ప్లాన్ అనుకుంటాడు. మనం సేఫ్‌గా ఉండాలనుకుంటే అక్కడ ఉన్న ఎవ్వరూ సేఫ్‌గా ఉండరు సార్ అంటాడు అమర్. మిస్సమ్మ కూడా ఏవండి చాలా చీకటిగా ఉంది. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు మీరు వచ్చారని ఆ రౌడీ వెధవ మిమ్మల్ని ఏమైనా చేస్తే.. అని వారిస్తుంది. అక్కడ అంత మంది చిన్న పిల్లలు ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ కూర్చోలేను అంటాడు.
ఎవరెన్ని చెప్పినా వినకుండా అమర్ ఫారెస్ట్ లోకి వెళ్తానంటాడు. టార్చ్ లైట్ తీసుకుని వెళ్తాడు. అమర్ వెళ్లే లోపే ఆరు ఆత్మ పిల్లలు ఉన్న దగ్గరకు వెళ్తుంది. పిల్లల అవస్థలు చూసి బాధపడుతుంది. పాముతో పోరాడి అమర్ పిల్లల్ని కాపాడతాడా? భాగీకి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్ 11న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్