OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేస్తున్న ఫహాద్ ఫాజిల్ మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి మరో హిట్ మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ వస్తోంది. ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
OTT Malayalam Crime Thriller: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బౌగెన్‌విలియా (Bougainvillia). అక్టోబర్ 17న రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కాగా.. తెలుగు ప్రేక్షకుల కోసం మన భాషలోనూ మూవీ రాబోతోంది.
బౌగెన్‌విలియా ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్, జోతిర్మయిలాంటి వాళ్లు నటించిన బౌగెన్‌విలియా మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని గతంలోనే వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా సోమవారం (డిసెంబర్ 9) ఓ స్పెషల్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది. "మీరు అసలు ఊహించని ట్విస్టుల కోసం సిద్ధంగా ఉండండి. బౌగెన్‌విలియా డిసెంబర్ 13 నుంచి మీ సోనీలివ్ లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది.
ఏంటీ బౌగెన్‌విలియా మూవీ స్టోరీ?
బౌగెన్‌విలియా మూవీ అక్టోబర్ 17న రిలీజైంది. ఈ సినిమాను అమల్ నీరద్ డైరెక్ట్ చేశాడు. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర రూ.35 కోట్లు వసూలయ్యాయి. రుచింతె లోకం అనే నవల నుంచి స్ఫూర్తి పొంది ఈ బౌగెన్‌విలియా మూవీని తెరకెక్కించారు.
ఈ సినిమా రాయ్స్ (కుంచకో బొబన్), రీతూ (జ్యోతిర్మయి) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వాళ్ల జీవితం ఓ పెద్ద ప్రమాదంతో మలుపు తిరుగుతుంది. ఆ ప్రమాదంలో రీతూ తన జ్ఞాపకశక్తి కోల్పోతుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ కేసులో ఇరుక్కుంటుంది. కేరళలో ఊహించని విధంగా కనిపించకుండా పోతున్న టూరిస్టుల కేసును ఛేదిస్తూ రీతూ దగ్గరికి వస్తాడు ఏసీబీ డేవిడ్ కోషి (ఫహాద్ ఫాజిల్).
అసలు ఆమె ఆ కేసులో ఇరుక్కుంది? ప్రమాదం తర్వాత ఏం జరిగింది? తన భార్యను ఈ కేసు నుంచి రాయ్స్ ఎలా కాపాడుకుంటాడన్నదే బౌగెన్‌విలియా మూవీ స్టోరీ. ఈ సినిమా రిలీజైన సమయంలో మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
సాధారణంగా మిస్టరీ, సస్పెన్స్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ల సినిమాలను తెరకెక్కించడంలో మలయాళం ఇండస్ట్రీ మేకర్స్ చాలా ముందుంటారు. సింపుల్ స్టోరీలను ఊహించని ట్విస్టులతో అందించడం వాళ్లకు అలవాటు. ఈ బౌగెన్‌విలియా కూడా అలాంటి సినిమానే. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ సోనీలివ్ ఓటీటీలోకి అడుగుపెడుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.