Vemulawada Murder: వేములవాడ లో యువకుడు దారుణ హత్య... అక్రమ సంబంధమే కారణమని అనుమానం…
Vemulawada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Vemulawada Murder: వేములవాడ మండలం కోనాయిపల్లి కి చెందిన రషీద్ గత కొంత కాలంగా వేములవాడలో నివాసం ఉంటున్నాడు. గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. ఉదయం వెళ్ళి రాత్రి ఇంటికి తిరిగివచ్చే రషీద్ ను గుర్తు తెలియని వ్యక్తులు వేములవాడ శివారులో అత్యంత దారుణంగా హత్య చేశారు. కత్తులతో పోడిచి, కాళ్ళు చేతులపై నరికి చంపారు. జనావాసాల మద్య జరిగిన హత్యతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.
మహిళతో వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా?
రషీద్ దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రషీద్ని వాసం ఉంటున్న కాలనీ చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మహిళ భర్త దుబాయిలో ఉంటుండగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ భర్త వారం రోజుల క్రితమే దుబాయ్ నుంచి వేములవాడకు చేరాడు. రషీద్ తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్న విషయంతో తెలియడంతో రాత్రి కాపు కాసి హత్య చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎవరితో శత్రుత్వం లేదని ఎవరు చంపారో తెలియదని అంటున్నారు.
త్వరలోనే హంతకులను పట్టుకుంటాం..
పుణ్యక్షేత్రం వేములవాడలో యువకుడు దారుణహత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూరల్ సీఐ శ్రీనివాస్ ఆద్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టింది. కొనైని ఆదారాలు సెకరించి హంతకులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే హత్య మిస్టరీని ఛేదించి హంతకులను పట్టుకుంటామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)