Lady Ambani: ఈ స్టార్ హీరో భార్యను, క్రికెటర్ అత్తను లేడి అంబానీ అని పిలుస్తారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?-suniel shetty wife mana shetty called as lady ambani of bollywood kl rahul mother in law mana shetty net worth property ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lady Ambani: ఈ స్టార్ హీరో భార్యను, క్రికెటర్ అత్తను లేడి అంబానీ అని పిలుస్తారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?

Lady Ambani: ఈ స్టార్ హీరో భార్యను, క్రికెటర్ అత్తను లేడి అంబానీ అని పిలుస్తారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?

Dec 19, 2024, 05:30 AM IST Sanjiv Kumar
Dec 19, 2024, 05:30 AM , IST

Star Hero Wife Called As Lady Ambani Of Bollywood: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరో భార్యను లేడి అంబానీ అని పిలుస్తారు. ఆమె ఎవరో కాదు మనా శెట్టి. హిందీ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి భార్యనే మనా శెట్టి. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అత్త అయిన మనా శెట్టి ఆస్తులు ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో సునీల్ శెట్టి కూడా ఒకరు. గత కొంతకాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి తన రెస్టారెంట్స్, బిజినెస్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. అయితే, సునీల్ శెట్టి భార్య మనా శెట్టిని బాలీవుడ్ లేడి అంబానీ పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో సునీల్ శెట్టి, మనా శెట్టి ఆస్తుల విలువ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం. 

(1 / 7)

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో సునీల్ శెట్టి కూడా ఒకరు. గత కొంతకాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి తన రెస్టారెంట్స్, బిజినెస్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. అయితే, సునీల్ శెట్టి భార్య మనా శెట్టిని బాలీవుడ్ లేడి అంబానీ పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో సునీల్ శెట్టి, మనా శెట్టి ఆస్తుల విలువ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం. (instagram)

సునీల్ శెట్టి భార్య మనా శెట్టి బాలీవుడ్‌లో బాగా చర్చనీయాంశమైంది. సునీల్, మానా వివాహం జరిగి దాదాపు 42 సంవత్సరాలు అయింది.

(2 / 7)

సునీల్ శెట్టి భార్య మనా శెట్టి బాలీవుడ్‌లో బాగా చర్చనీయాంశమైంది. సునీల్, మానా వివాహం జరిగి దాదాపు 42 సంవత్సరాలు అయింది.(instagram)

కేవలం 15 ఏళ్ల వయసులోనే తన సోదరి ఇషాతో కలిసి ఫ్యాషన్ డిజైనర్‌గా తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించింది మనా శెట్టి. ముంబైలో ఆర్ హౌస్ పేరుతో సొంత లగ్జరీ అలంకరణ, గిఫ్ట్ ఐటమ్స్ షాప్‌ను నిర్వహిస్తున్న మానా శెట్టి తన భర్తతో కలిసి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టింది.

(3 / 7)

కేవలం 15 ఏళ్ల వయసులోనే తన సోదరి ఇషాతో కలిసి ఫ్యాషన్ డిజైనర్‌గా తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించింది మనా శెట్టి. ముంబైలో ఆర్ హౌస్ పేరుతో సొంత లగ్జరీ అలంకరణ, గిఫ్ట్ ఐటమ్స్ షాప్‌ను నిర్వహిస్తున్న మానా శెట్టి తన భర్తతో కలిసి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టింది.(instagram)

మనా శెట్టి వ్యాపారంలో బాగా సంపాదిస్తు నిమగ్నమై ఉంటుంది. అంతేకాకుండా మనా శెట్టి మహిళలు, పిల్లల కోసం అవసరమైన నిధుల సేకరణ, ప్రదర్శనలను నిర్వహించే సేవ్ ది చైల్డ్ రన్ అనే స్వచ్ఛంద సంస్థతో సంబంధం ఉన్న సామాజిక కార్యకర్త కూడా.

(4 / 7)

మనా శెట్టి వ్యాపారంలో బాగా సంపాదిస్తు నిమగ్నమై ఉంటుంది. అంతేకాకుండా మనా శెట్టి మహిళలు, పిల్లల కోసం అవసరమైన నిధుల సేకరణ, ప్రదర్శనలను నిర్వహించే సేవ్ ది చైల్డ్ రన్ అనే స్వచ్ఛంద సంస్థతో సంబంధం ఉన్న సామాజిక కార్యకర్త కూడా.(instagram)

ఇక సునీల్ శెట్టి భార్య మనా శెట్టి నికర ఆస్తుల విలువ రూ. 16 నుంచి 17 కోట్లు ఉంటుందని సమాచారం. స్టార్ బయోపిక్‌ల ప్రకారం సునీల్ మొత్తం ఆస్తులు రూ. 200-250 కోట్ల వరకు ఉంటాయట.

(5 / 7)

ఇక సునీల్ శెట్టి భార్య మనా శెట్టి నికర ఆస్తుల విలువ రూ. 16 నుంచి 17 కోట్లు ఉంటుందని సమాచారం. స్టార్ బయోపిక్‌ల ప్రకారం సునీల్ మొత్తం ఆస్తులు రూ. 200-250 కోట్ల వరకు ఉంటాయట.(instagram)

సునీల్, మనా శెట్టి ప్రేమకథ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో సునీల్ శెట్టి మొదట మనాను చూడగానే ప్రేమలో పడ్డాడు. అందరి మనసులు గెలుచుకోవడానికి మొదట మనా సోదరిని కలిశాడు. ఆ తర్వాత మనా, సునీల్ లు కూడా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

(6 / 7)

సునీల్, మనా శెట్టి ప్రేమకథ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో సునీల్ శెట్టి మొదట మనాను చూడగానే ప్రేమలో పడ్డాడు. అందరి మనసులు గెలుచుకోవడానికి మొదట మనా సోదరిని కలిశాడు. ఆ తర్వాత మనా, సునీల్ లు కూడా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.(instagram)

అయితే తమ కుటుంబాల్లో సునీల్ శెట్టి మనా పెళ్లి గురించి చెప్పగా వెళ్లగా వారు నిరాకరించారు. అనంతరం సునీల్, మనా ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. వీరికి అతియా శెట్టి అనే కూతురు ఉంది. ఆ మధ్య ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో అతియా శెట్టి వివాహం జరిగింది. అంటే, బాలీవుడ్ లేడి అంబానీగా పిలవబడే మనా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అత్త అవుతుంది. 

(7 / 7)

అయితే తమ కుటుంబాల్లో సునీల్ శెట్టి మనా పెళ్లి గురించి చెప్పగా వెళ్లగా వారు నిరాకరించారు. అనంతరం సునీల్, మనా ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. వీరికి అతియా శెట్టి అనే కూతురు ఉంది. ఆ మధ్య ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో అతియా శెట్టి వివాహం జరిగింది. అంటే, బాలీవుడ్ లేడి అంబానీగా పిలవబడే మనా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అత్త అవుతుంది. (instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు