Romantic OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తోన్న‌ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?-tollywood romantic comedy movie neeli megha shyama directly to stream on aha ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Romantic Ott: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తోన్న‌ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

Romantic OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తోన్న‌ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Dec 19, 2024 06:05 AM IST

Romantic OTT: విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించిన నీలి మేఘ శ్యామ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలోకి రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు ర‌వి ఎస్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రొమాంటిక్ ఓటీటీ
రొమాంటిక్ ఓటీటీ

Romantic OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ నీలి మేఘ శ్యామ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తోంది. త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నీలిమేఘ శ్యామ ఓటీటీలోకి రానున్న విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ మూవీ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. డిసెంబ‌ర్ నెలాఖ‌రున‌ ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.

విశ్వ‌దేవ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ‌...

నీలి మేఘ శ్యామ మూవీలో విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ర‌వి ఎస్ వ‌ర్మ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీకి శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందించాడు.

నీలి మేఘ శ్యామ క‌థ ఇదే...

శ్యామ్ (విశ్వ‌దేవ్‌) ఓ అల్ల‌రి యువ‌కుడు. ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేకుండా తిరుగుతూ ఎప్పుడూ తండ్రి చేతిలో తిట్లు తింటుంటాడు. హ‌ఠాత్తుగా ఓ రోజు ఇంట్లో వాళ్ల‌తో పాటు స్నేహితుల‌కు చెప్ప‌కుండా మ‌నాలి వెళ్లిపోతాడు శ్యామ్‌. మ‌నాలిలో శ్యామ్‌కు మేఘ (పాయ‌ల్ రాధాకృష్ణ‌) గైడ్‌గా ఉంటుంది.

కొద్ది పాటి జ‌ర్నీలో మేఘ‌తో శ్యామ్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఆ జంట ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగింది? అస‌లు శ్యామ్ మ‌నాలి ఎందుకు వెళ్లాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. నీలి మేఘ శ్యామ మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి వ‌స్తోంది.

35 చిన్న క‌థ కాదు...

ఇటీవ‌లే రిలీజై 35 చిన్న‌క‌థ కాదు మూవీతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్నాడు విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌. ప్ర‌సాద్ అనే బస్ కండ‌క్ట‌ర్ పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. 35 చిన్న క‌థ‌కాదు మూవీలో నివేథా థామ‌స్ హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో 35 చిన్న క‌థ కాదుతో పాటు కిస్మ‌త్‌, పిట్ట‌గొడ‌, ఛ‌ల్తే ఛ‌ల్తేతో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు.

త‌ర‌గ‌తి గ‌ది దాటి అనే వెబ్‌సిరీస్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయ‌ల్ రాధాకృష్ణ‌. ఆలా నిన్నుచేరితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించింది.

Whats_app_banner