తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live December 19, 2024: Hyderabad Formula E Race Case : అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎలా పెడుతారు..? తేదీలతో సహా ఏం జరిగిందో చెప్పిన కేటీఆర్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 19 Dec 202404:08 PM IST
తెలంగాణ News Live: Hyderabad Formula E Race Case : అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎలా పెడుతారు..? తేదీలతో సహా ఏం జరిగిందో చెప్పిన కేటీఆర్
- ఫార్ములా ఈరేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదన్నారు. రేస్ రద్దు కావటానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన ప్రభుత్వం… అసలు విషయాలను దాచిపెడుతోందని చెప్పారు.
Thu, 19 Dec 202402:16 PM IST
తెలంగాణ News Live: Bhadradri Kothagudem : ఎవరిదీ పాపం..? భద్రాద్రి కొత్తగూడెం శ్మశానవాటికలో పసికందు.!
- భద్రాద్రి కొత్తగూడెం శ్మశానవాటికలో పసికందు లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. నవజాత శిశువు వద్దకు వెళ్లి పరిస్థితిని చూసి.. బాలుడిగా గుర్తించారు.
Thu, 19 Dec 202411:06 AM IST
తెలంగాణ News Live: Hyderabad Formula E Race Case : ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు - ఏ1గా కేటీఆర్!
- Hyderabad Formula E Race Case Updates : ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేర్లను నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.
Thu, 19 Dec 202410:12 AM IST
తెలంగాణ News Live: తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష, మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది
Thu, 19 Dec 202410:06 AM IST
తెలంగాణ News Live: Telangana Police : క్రిస్మస్, సంక్రాంతి సీజన్.. ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా.. అయితే ఈ 7 జాగ్రత్తలు మర్చిపోవద్దు!
- Telangana Police : పండగల సీజన్ వచ్చింది. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకే సంక్రాంతి వస్తోంది. దీంతో చాలామంది ఊర్లకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇళ్లకు తాళం వేసి వెళతారు. వారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. 7 జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Thu, 19 Dec 202408:38 AM IST
తెలంగాణ News Live: TG Assembly Sessions 2024 : హరీష్ రావ్... నువ్వు ఏమైనా డిప్యూటీ లీడరా..? - మంత్రి కోమటిరెడ్డి
- Telangana Assembly Sessions 2024 Updates : బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాలను నిర్లక్ష్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయబోతున్నామని చెప్పారు. హరీశ్ రావుపై మరోసారి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.
Thu, 19 Dec 202407:23 AM IST
తెలంగాణ News Live: Indiramma Housing Scheme : అన్నా.. మనకో ఇల్లు మర్చిపోకే.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఊపందుకున్న పైరవీలు!
- Indiramma Housing Scheme : తెలంగాణలో ఇప్పుడు చర్చంతా ఇందిరమ్మ ఇళ్ల గురించే. ఎవరికి ఇల్లు వస్తుందో.. ఎవరికి రాదోనని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌లో లబ్ధి పొందడానికి ప్రజలు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ భగ్గుమంటోంది.
Thu, 19 Dec 202406:42 AM IST
తెలంగాణ News Live: Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు, మంత్రి పొన్నం టార్గెట్‌గా అసెంబ్లీ ఇన్‌ఛార్జి విమర్శలు
- Karimnagar Congress: కరీంనగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్ పార్టీ ముఖ్య నేతలపై ఫైరయ్యారు. పుష్ప తరహాలో తాను ఫ్లవర్ కాదని.. ఫైర్ అంటూ కార్యకర్తల సమక్షంలో తన ఆవేదనను, ఆక్రోశం వెళ్ళగక్కారు. ఇక సహించనని అల్టిమేటం ఇచ్చారు.
Thu, 19 Dec 202406:36 AM IST
తెలంగాణ News Live: Kodangal Medical College : కొడంగల్‌లో మెడికల్ కాలేజీ.. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం
- Kodangal Medical College : రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దీనిపై ఆరోగ్య మంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
Thu, 19 Dec 202404:33 AM IST
తెలంగాణ News Live: Cherlapally Railway station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!
- Cherlapally Railway station : ఎట్టకేలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 28న దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ స్టేషన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
Thu, 19 Dec 202403:53 AM IST
తెలంగాణ News Live: Darshanam Mogulaiah: బలగం క్లైమాక్స్ సింగర్ దర్శనం మొగిలయ్య కన్నుమూత, కిడ్నీలు ఫెయిలై మృతి
- Darshanam Mogulaiah: జానపద కళాకారుడు, బలగం చిత్రంలో క్లైమాక్స్ పాటతో అందరి మనసులు దోచుకున్న దర్శనం మొగిలయ్య కన్ను మూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగులయ్య వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు. 12 మెట్ల కిన్నెరపై పాటలు పాడే మొగిలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.
Thu, 19 Dec 202403:13 AM IST
తెలంగాణ News Live: Wanaparthy Robbery: వనపర్తి జిల్లా పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీలో పలువురికి తీవ్ర గాయాలు
- Wanaparthy Robbery: వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పుణ్య క్షేత్రాలు దర్శించుకుని స్వస్థలాలకు తిరిగి వెళుతున్న కుటుంబంపై దాడి చేసి దోచుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై వాహనంలో నిద్రిస్తున్న వారిపై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది.
Thu, 19 Dec 202412:46 AM IST
తెలంగాణ News Live: Peddapur Gurukulam: పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు కలకలం.. నాలుగు నెలల క్రితం పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి..
- Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టిస్తుంది. 8 వ తరగతి విద్యార్థి పాము కాటుకు గురై కోరుట్ల ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.నాలుగు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందగా, మరో విద్యార్థి పాము కాటు గురి కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
Thu, 19 Dec 202412:22 AM IST
తెలంగాణ News Live: Vemulawada Murder: వేములవాడ లో యువకుడు దారుణ హత్య... అక్రమ సంబంధమే కారణమని అనుమానం…
- Vemulawada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.