Gunde Ninda Gudi Gantalu: బయటపడ్డ సంజు కుట్ర - చెల్లి పెళ్లికి బాలు అడ్డు - భర్త ప్రేమకు మీనా క్లీన్ బౌల్డ్
Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంటలు డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో తనను మోసం చేసిన రవి, శృతితో పాటు కొట్టి అవమానించిన బాలు, మీనాలపై ఒకేసారి రివేంజ్ తీర్చుకునే ప్లాన్ వేస్తాడు సంజు. మౌనికను పెళ్లిచేసుకొని ఆమెను జీవితాంతం టార్చర్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు.
రవి, శృతి తిరిగి ఇంటికి రావడానికి బాలు ఒప్పుకోడు. వీడు చేసిన పనికి ఇంట్లోకి రానిచ్చి పెద్ద తప్పు చేశావు అంటూ మనోజ్‌ను చూపిస్తూ తండ్రితో అంటాడు బాలు. మనోజ్‌ను చూసి రవి తప్పు చేశాడు. ఇలా అందరిని క్షమించడానికి నువ్వేమైనా స్వామి క్షమానందుడివా అని తండ్రిని నిలదీస్తాడు బాలు. రవి, శృతిలను తిరిగి తీసుకురావడానికి తాను వేసిన ప్లాన్‌ను బాలు ఎక్కడ చెడగొడతాడోనని ప్రభావతి టెన్షన్ పడుతుంది.
జీవితంలో అన్ని చూశా...దేనికైనా పట్టువిడిపులు ఉండాలి...రవిని, వాడి భార్యను ఇంటికి రమ్మందామని సత్యం అంటాడు. తండ్రి మాట విని బాలుతో పాటు మనోజ్ షాకవుతారు. బాలు ఏదో మాట్లాడబోతుండగా...మావయ్య మంచి నిర్ణయం తీసుకున్నారు..దానిని చెడగొట్టవద్దని మీనా అంటుంది. బాలు నోరును ప్రభావతి మూసేస్తుంది.
సత్యం కండీషన్...
రవి, శృతిని ఇంటికి తీసుకురావడానికి సత్యం ఒప్పుకోవడంతో ప్రభావతి ఆనందంలో తేలిపోతుంది. అంత సంబరపడిపోవద్దని, వారి తిరిగి ఇంటికి రావడానికి నాదో కండీషన్ ఉందని అసలు విషయం రివీల్ చేస్తాడు సత్యం.
సురేంద్రనే తీసుకురావాలి...
ఆస్తి కోసమే నా కూతురిని నీ కొడుకు ప్రేమించేలా చేశావని శృతి తండ్రి సురేంద్ర తనను అవమానించాడని సత్యం అంటాడు. ఇప్పుడు వారిని మనం తీసుకొస్తే మళ్లీ అదే మాట అంటాడని, మరోసారి అతడితో మాటలు తాను పడలేనని సత్యం చెబుతాడు. సురేంద్రనే స్వయంగా శృతి, రవిని మనకు అప్పజెప్పాలి. మా అమ్మాయి ఇక మీ ఇంటి కోడలు. ఆమె పూర్తి బాధ్యత మీదే అని చెప్పాలని కండీషన్ పెడతాడు.ఆ కండీషన్ వినగానే అది జరిగే పని కాదని ప్రభావతి అనుకుంటుంది.
చీర కొంగుతో కాఫీ...
బాలు కోసం చీర కొంగుతోకాఫీ కప్ పట్టుకొని వస్తుంది మీనా. మామూలుగా చేతిలో పట్టుకొని రావచ్చుగా...అతి వినయమా అంటూ మీనాపై సెటైర్లు వేసి కాఫీ కప్ చేతిలో పట్టుకుంటాడు బాలు. వేడిగా ఉండటంతో చేతి కాలడంతో ఊదుకోవడం మొదలుపెడతాడు. ఇప్పుడు అర్థమైందా చీరకొంగుతో ఎందుకు పట్టుకొచ్చానో అని మీనా పంచ్‌లు వేస్తుంది.
మీనా నడుము...
కాఫీ తాగుతూ మీనా నడుమువైపు చూస్తూ ఉండిపోతాడు బాలు. భర్త తనను చూస్తోన్న విషయాన్ని మీనా కనిపెడుతుంది. సిగ్గుపడిపోతుంది. తడబడిపోయిన బాలు తాను బయటకు వెళ్లాలని షర్ట్ ఇవ్వమని అంటాడు. కొత్త షర్ట్ ఇస్తుంది మీనా. నేను కారు నడపటానికి వెళుతున్నానని, కారు కొనడానికి కాదని బాలు అంటాడు. మీరు ఇప్పుడు కారు ఓనర్ అని అంటుంది మీనా.
నా వల్లే మీరు కానర్ అయ్యారు కదా నాకు ఏం లేదా అని బాలు దగ్గరకు వస్తుంది మీనా. ఏంటి దగ్గరకు వస్తున్నావని, ఏం కావాలని బాలు అంటాడు. నా కోసం ఇటుకరాయిని బెడ్‌రూమ్ నుంచి తీసి పడేయమని బాలుతో అంటుంది. అది అక్కడ ఉంటేనే నువ్వేంటే ఏమిటో అందరికి తెలుస్తుందని బాలు అంటాడు.
మూడు భాగాలు...
కారు నడపటం ద్వారా వచ్చిన డబ్బును మూడు భాగాలు చేస్తాడు. ఓ భాగం ఇంటి తాకట్టు నుంచి విడిపించడానికి, మరో భాగం ఇంటి ఖర్చులతో పాటు మౌనిక పెళ్లికి అని చెబుతాడు. మూడో భాగం నువ్వు నా కోసం తాకట్టు పెట్టిన బంగారు గాజుల కోసం అని చెప్పగానే...నా భర్త బంగారం అని మీనా మురిసిపోతుంది. మన పిల్లల కోసం డబ్బులు ఎప్పటి నుంచి దాచిపెడదామని మీనా అంటుంది. అప్పు తీర్చే వరకు పిల్లల గురించి ఆలోచించేది లేదని చెబుతాడు.
కలలో ఊహించని గొప్ప సంబంధం...
రవి, శృతిలను ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ బెడిసికొట్టడంతో ప్రభావతి డీలా పడుతుంది. శృతి వల్ల అమ్మ నీ కంటే పెద్ద గయ్యాళిగంపలా ఉందని కామాక్షి నోరు జారుతుంది. అప్పుడే పెళ్లిళ్ల పేరయ్య అక్కడికి వస్తాడు. మీ అమ్మాయి మౌనికకు కలలో కూడా ఊహించని గొప్ప సంబంధం తీసుకొచ్చానని సంజు గురించి ప్రభావతికి చెబుతాడు పెళ్లిళ్ల పేరయ్య.
సంజుతో మౌనిక పెళ్లి...
సంజుకు ఆస్తి కోట్లలో ఉందని అంటాడు పెళ్లిళ్ల పేరయ్య. ఎక్కడో మౌనికను చూసి మనసు పడ్డాడటా...కొడుకు ఇష్టపడ్డ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని ఆ అబ్బాయి తల్లిదండ్రులు తనను పంపించారని చెబుతాడు. ఈ రోజు తాంబులాలు పుచ్చుకోవాలని పెళ్లిళ్ల పేరయ్య అంటాడు. ఇంట్లో సత్యం లేడని ప్రభావతి అంటుంది.
మీరు ఒక్కసారి సంజు ఇంటికి వస్తే వారి ఆస్తి పాస్తులు, వైభోగం చూసి వెంటనే పెళ్లికి ఒప్పుకుంటారని పెళ్లిళ్ల పేరయ్య అంటాడు. సత్యం లేకుండా పెళ్లి సంబంధం ఖాయం చేయడానికి ఎలా వెళ్లాలా అని ప్రభావతి ఆలోచనలో పడుతుంది. కానీ కామాక్షి ఆమెను ఒప్పిస్తుంది.
మీనాపై ఫైర్...
ప్రభావతి బయటకు వెళ్లబోతుండటం చూసి ఎక్కడికి వెళుతున్నావని అడుగుతుంది మీనా. బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడికి అని అడగొద్దని ఎన్నిసార్లు చెప్పానని కోడలిపై ప్రభావతి ఫైర్ అవుతుంది. మావయ్య వచ్చి అడిగితే ఏం చెప్పాగని మీనా అనగానే...వచ్చాకా నేను అన్ని చెప్పుకుంటానని ప్రభావతి వదులిస్తుంది.
సంజు రివేంజ్...
నన్ను మోసం చేసిన రవి, శృతితో పాటు కొట్టి అవమానించిన బాలు, మీనాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే మౌనికను పెళ్లిచేసుకోబోతున్నట్లు తన ప్లాన్‌ను తల్లి సువర్ణకు చెబుతాడు సంజు. మౌనికను పెళ్లిచేసుకొని ప్రతిరోజు ఆమెను టార్చర్ పెట్టి నలుగురిపై పగ తీర్చుకుంటానని చెబుతాడు. నీ పగ కోసం ఓ అమాయకురాలిని బలి చేయద్దని కొడుకుతో అంటుంది సంజు తల్లి. మౌనికను టార్చర్ చేస్తే ప్రతి ఒక్కరూ నా కాళ్ల దగ్గరకు వస్తారు. జీవితాంతం కుళ్లికుళ్లి ఏడుస్తారని అంటాడు.
చంపేస్తా...
సంజు చేస్తోన్న పని మంచిది కాదని, అతడికి సర్ధిచెప్పమని భర్త నీలకంఠంతో అంటుంది సువర్ణ. ఈ ప్లాన్ నాకు ముందే తెలుసునని నీలకంఠం అంటాడు. శృతిని పెళ్లి చేసుకుంటే సంజు తిక్కక చూసి రచ్చ చేసేది...ఇలాంటి స్థాయి తక్కువ వాళ్లైతే అణిగిమణిగి ఉంటారని నీలకంఠం అంటాడు.
తప్పు చేస్తున్నారని, అమాయకురాలి జీవితం నాశనం చేయద్దని సువర్ణ అంటుంది. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తానని భార్యకు వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం. తమ ప్లాన్ గురించి ఎవరికి చెప్పొద్దని అంటాడు.
ప్రభావతి బోల్తా...
సంజు ఇళ్లు చూసి ప్రభావతి, కామాక్షి ఆశ్చర్యపోతారు. అంత గొప్పింటి నుంచి మౌనికకు సంబంధం రావడం చూసి సంబరపడిపోతుంది. మౌనికను సంజు ఓ పెళ్లిలో చూశాడని, మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతున్నాడని, లేదంటే పెళ్లే చేసుకోనని అంటున్నాడని ప్రభావతితో అంటాడు నీలకంఠం. మా వాడికి వందల కోట్ల సంబంధాలు వస్తోన్న కాదని, వాడు ఇష్టపడ్డ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నానని నీలకంఠం అంటాడు.
వెండి గ్లాస్‌లో జ్యూస్...
ప్రభావతి, కామాక్షి కోసం సువర్ణ జ్యూస్ తీసుకొస్తుంది. వెండి గ్లాసుల్లో జ్యూస్ తీసుకురావడం చూసి ప్రభావతి ఆశ్చర్యపోతుంది. నీలకంఠం ఇచ్చిన పెళ్లి తాంబూలం తీసుకొని ఇంటికొస్తుంది.
మౌనికకు గొప్పింటి సంబంధం తీసుకొచ్చానని, కానీ కట్నం లేకుండా మౌనికను వాళ్లు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని ప్రభావతి సంబరపడిపోతుంది.నీ గురించి తెలిసి గొప్పింటి సంబంధం ఎలా వస్తుందని బాలు అనుమానంగా అడుగుతాడు. అమ్మ తెచ్చిన పెళ్లి సంబంధం అంటే ఆస్తి అంతస్తులే చూసి వచ్చుంటుందని, మంచి మర్యాద తెలుసుకొని వచ్చినట్లు కనిపించడం లేదని బాలు అంటాడు.
బాలు అడ్డు...
నీకు మౌనికకు పెళ్లి జరగకుండా బాలు అడ్డుపడేలా ఉన్నాడని సంజుతో నీలకంఠం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.