Telugu Cinema News Live December 19, 2024: Pushpa 2 Box Office Collection: చరిత్ర సృష్టించిన పుష్ప 2.. అత్యంత వేగంగా రూ.1500 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ మూవీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 19 Dec 202404:01 PM IST
- Pushpa 2 Box Office Collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను ఎడాపెడా బ్రేక్ చేస్తోంది. తాజాగా అత్యంత వేగంగా రూ.1500 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. కేవలం 14 రోజుల్లోనే అల్లు అర్జున్ మూవీ ఈ మార్క్ అందుకోవడం విశేషం.
Thu, 19 Dec 202402:32 PM IST
OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ చూపిస్తున్నారంటూ ఏకంగా 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ను బ్లాక్ చేయడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ పార్లమెంట్ లో వెల్లడించారు.
Thu, 19 Dec 202402:05 PM IST
- Cubicles Season 4: ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేసింది. కార్పొరేట్ ప్రపంచాన్ని కళ్లకు కడుతూ సాగుతున్న క్యూబికల్స్ (Cubicles) వెబ్ సిరీస్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Thu, 19 Dec 202401:09 PM IST
- Highest Paid Heroine: ప్రపంచంలోనే అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఒకే ఒక్క సినిమాకు ఏకంగా 70 మిలియన్ డాలర్లు సంపాదించడం విశేషం. ఈ మూవీలో నటించిన హీరో కంటే కూడా రెట్టింపు ఈ హీరోయిన్ సొంతమవడం విశేషం.
Thu, 19 Dec 202411:05 AM IST
- Ishmart Jodi Season 3 Streaming Date: యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న రొమాంటిక్ రియాలిటీ గేమ్ షో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ షోకి గెస్ట్‌లుగా ఒక ఎపిసోడ్‌లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ నుంచి మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు రానున్నారు.
Thu, 19 Dec 202411:05 AM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. తాజాగా వచ్చిన రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ టాప్ లో కొనసాగుతున్నా.. కొత్తగా ప్రారంభమైన సీరియల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ లోనూ మార్పులు వచ్చాయి.
Thu, 19 Dec 202409:48 AM IST
- Netflix Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. వచ్చే ఏడాది తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోయే తొలి సిరీస్ ను ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. గురువారం (డిసెంబర్ 19) టీజర్ కూడా రిలీజ్ చేసింది.
Thu, 19 Dec 202409:27 AM IST
Kcr Movie OTT: జబర్ధస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కేసీఆర్ మూవీకి గరువ వేగ అంజి దర్శకత్వం వహించాడు.
Thu, 19 Dec 202408:29 AM IST
- Keerthy Suresh mangalsutra: కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తొలిసారి మెడలో మంగళసూత్రంతో కనిపించింది. అయితే రెడ్ మోడ్రన్ డ్రెస్ లో ఆమె ఇలా కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Thu, 19 Dec 202408:25 AM IST
- 35 Chinna Katha Kadu TV Premiere Date: తెలుగు హీరోయిన్ నివేదా థామస్ తల్లిగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం 35 చిన్న కథ కాదు. హీరో రానా దగ్గుబాటి నిర్మించిన 35 చిన్న కథ కాదు మూవీ బుల్లితెరపై అలరించేందుకు టీవీలోకి వచ్చేస్తోంది. మరి ఈ సినిమా ఏరోజున రిలీజ్ కానుంది, ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.
Thu, 19 Dec 202407:34 AM IST
- Star Heroes Who Played Villain Roles In 2024: సినిమాల్లో విలన్ పాత్రలను స్టార్ హీరోలు కూడా చేస్తూ అలరిస్తున్నారు. అలా ఈ ఏడాది (2024) పవర్‌ఫుల్ విలన్ రోల్స్‌లో నటించి భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు ఎవరు, వారు నటించిన సినిమాలు ఏంటీ అనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
Thu, 19 Dec 202407:15 AM IST
Nikhil: యష్మితో లవ్‌స్టోరీపై బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ మరోసారి రియాక్ట్ అయ్యాడు. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయని అన్నాడు.
Thu, 19 Dec 202406:25 AM IST
- Nindu Noorella Saavasam December 19th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో అమర్‌తో పిల్లలు నవ్వుతుంటే అంతా మిస్సమ్మను మెచ్చుకుంటారు. తర్వాత పిల్లలు వచ్చి భాగీని హగ్ చేసకుంటారు. కోపం అలాగే ఉందని అంజు అంటే.. నేను కూడా చిన్న బ్రేక్ ఇచ్చానని మిస్సమ్మ అంటుంది.
Thu, 19 Dec 202406:14 AM IST
Roja Husband: సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా భర్త ఆర్‌కే సెల్వమణి తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సెల్వమణి తెలుగులో రెండు సినిమాలను రూపొందించాడు. ఆ సినిమాలు ఏవంటే?
Thu, 19 Dec 202405:45 AM IST
- Pushpa 2 Worldwide Box Office Collection Day 14: అల్లు అర్జున్, రష్మిక మందన్నా పుష్ప 2 కలెక్షన్స్‌లలో తగ్గేదే లే అన్నట్లు సాగుతున్నాయి. 14వ రోజున ఇండియాలో పుష్ప 2 నెట్ కలెక్షన్స్ రూ. 973 కోట్లకు చేరుకున్నాయి. మరి 14 రోజుల్లో పుష్ప 2 ది రూల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభాలు ఎంతో లుక్కేద్దాం.
Thu, 19 Dec 202404:48 AM IST
- ETV Win OTT Content Head About Leela Vinodam Story: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటించిన ఓటీటీ మూవీ లీలా వినోదం. ఈటీవీ విన్‌లో ఇవాళ్టి నుంచి లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల లీలా వినోదం మూవీ స్టోరీ, అది సెట్ అయిన విధానంపై ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్ కామెంట్స్ చేశారు.
Thu, 19 Dec 202404:05 AM IST
Malayalam OTT: మలయాళం యాక్షన్ డ్రామా మూవీ కడకన్ మూవీ సన్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో హకీమ్ షాజహాన్, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.
Thu, 19 Dec 202403:23 AM IST
- Karthika Deepam 2 Today Episode: కార్తీక్ తన భార్య దీప పేరుతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దీంతో జ్యోత్స్నకు, శివన్నారాయణకు కోపం వస్తుంది.
Thu, 19 Dec 202403:13 AM IST
- Girls Will Be Girls OTT Streaming: మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, హీరోయిన్ రిచా చద్దా సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. సన్‌డాన్స్ 2024 ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్స్ గెలుచుకున్న ఈ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Thu, 19 Dec 202403:08 AM IST
Mokshagna: Teja: బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ ఆగిపోయినట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ స్థానంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై క్లారిటీ వచ్చేసింది.
Thu, 19 Dec 202402:06 AM IST
- Brahmamudi Serial December 19th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో బ్యాంక్ వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేస్తామని, ఇంటి నుంచి బయటకు వెళ్లమని అంటారు. సీతారామయ్యపై కోర్టులో కేసు వేసి అయినా ఆస్తి దక్కించుకుంటామని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు. దాంతో ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్ వస్తుంది.
Thu, 19 Dec 202402:04 AM IST
Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంటలు డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో తనను మోసం చేసిన రవి, శృతితో పాటు కొట్టి అవమానించిన బాలు, మీనాలపై ఒకేసారి రివేంజ్ తీర్చుకునే ప్లాన్ వేస్తాడు సంజు. మౌనికను పెళ్లిచేసుకొని ఆమెను జీవితాంతం టార్చర్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు.
Thu, 19 Dec 202401:08 AM IST
- Producer About Vijay Sethupathi Viduthalai 2: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ విడుదల 2. కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత చింతపల్లి రామారావు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Thu, 19 Dec 202412:34 AM IST
Romantic OTT: విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన నీలి మేఘ శ్యామ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు రవి ఎస్ వర్మ దర్శకత్వం వహించాడు.