Girls Will Be Girls OTT: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్ విన్నింగ్ రొమాంటిక్ బోల్డ్ మూవీ- 3 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
Girls Will Be Girls OTT Streaming: మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, హీరోయిన్ రిచా చద్దా సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. సన్‌డాన్స్ 2024 ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్స్ గెలుచుకున్న ఈ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Girls Will Be Girls OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల జోనర్ సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని జోనర్స్‌కు మాత్రమే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు మంచి కాన్సెప్ట్ ఉన్న బోల్డ్ మూవీస్‌ను కూడా ఎంకరేజ్ చేస్తారు ఓటీటీ ఆడియెన్స్.
నిర్మాణంలో ఎంట్రీ
అయితే, ఇటీవల కొన్ని బోల్డ్ సినిమాలు నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అలాంటి వాటిలోని ఒక రొమాంటిక్ బోల్డ్ మూవీనే గర్ల్స్ విల్ బీ గర్ల్స్. ఈ సినిమాతో ఓటీటీలోకి ప్రొడక్షన్‌తో ఎంట్రీ ఇచ్చాడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ యాక్టర్ అలీ ఫజల్. అతనితోపాటు అలీ భార్య, హీరోయిన్ రిచా చద్దా కూడా ఈ నిర్మాణంలో భాగం పంచుకుంది.
సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో
భార్యాభర్తలు అయిన అలీ ఫజల్, రిచా చద్దా కలిసి నిర్మాణంలో ఓటీటీలోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన సినిమానే గర్ల్స్ విల్ గర్ల్స్. అయితే, నేరుగా ఓటీటీ రిలీజ్ చేయడానికి ముందు ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. జనవరి 20న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ ప్రీమియర్ వేశారు.
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ అవార్డ్స్
సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీని ప్రదర్శించంగా.. అందులో ప్రపంచ సినిమా నాటక విభాగంలో ఆడియెన్స్ అవార్డుతో సహా రెండు అవార్డ్స్ గెలుచుకుంది. అనంతరం జకార్తా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్, లాస్ ఏంజిల్స్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ అవార్డ్ అందుకుని సత్తా చాటింది గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ.
నేరుగా ఓటీటీలోకి
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మొత్తంగా ఐదు అవార్డ్స్ అందుకున్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సినిమాను అనంతరం నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. డిసెంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో హిందీ, మలయాళం, ఇంగ్లీష్ మూడు భాషల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ నిర్మాణంలో డెబ్యూ
అలీ ఫజల్, రిచా చద్దా తొలి ఓటీటీ నిర్మాణ మూవీగా తెరకెక్కిన బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్‌కి షుచి తలాటీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే డైరెక్టర్‌గా పరిచం అయ్యారు షుచి తలాటీ. అంటే, ఈ సినిమా అలీ ఫజల్, రిచా చద్దాతోపాటు (నిర్మాణం పరంగా) షుచి తలాటీకి డెబ్యూ ఓటీటీ మూవీ. అలాగే, ఇందులో చాలా వరకు కొత్త నటీనటులు నటించారు.
మీరా పాత్ర చుట్టూ
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీలో ప్రీతి పాణిగ్రాహి, కేశవ్ బినోయ్ కిరణ్ మెయిన్ లీడ్ రోల్స్ చేయగా.. పాపులర్ నటి కని కుశృతి కీలక పాత్ర పోషించింది. అలాగే, ఈ సినిమాలో కాజోల్ చౌగ్, జితిన్ గులాటీ, దేవిక షహని, నందిని వర్మ ఇతర పాత్రలు పోషించారు. హిమాలయన్ బోర్డర్ స్కూల్‌లో చదువుకునే మీరా (ప్రీతి పాణిగ్రాహి) అనే అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.