
(1 / 6)
తెలుగులో వచ్చిన సరికొత్త బోల్డ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ రోటీ కపడా రొమాన్స్. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

(2 / 6)
రోటి కపడా రొమాన్స్ సినిమాలో బోల్డ్‌గా ఉండే బెడ్ రూమ్ సీన్స్‌తోపాటు మంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. నాలుగు జంటల మధ్య జరిగే రొమాంటిక్, లవ్, ఫన్, ఎమోషనల్ స్టోరీగా రోటీ కపడా రొమాన్స్ వచ్చింది.

(3 / 6)
బోల్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రోటి కపడా రొమాన్స్ మూవీలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి వంటి కొత్త నటీనటులు హీరో హీరోయిన్లుగా నటించారు.

(4 / 6)
రోటి కపడా రొమాన్స్ సినిమాకు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఆయన ఇదివరకు హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ సినిమాలను నిర్మించారు.

(5 / 6)
నాలుగు జంటల ప్రేమకథగా తెరకెక్కిన రోటి కపడా రొమాన్స్ మూవీ థియేటర్లలో విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది.

(6 / 6)
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో రోటి కపడా రొమాన్స్ ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 12 నుంచి తెలుగు భాషలో రోటి కపడా రొమాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీతో సాగే రొమాంటిక్ బోల్డ్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఎంపిక అని చెప్పొచ్చు.
ఇతర గ్యాలరీలు