One Hero: ఒకే హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్.. చిరంజీవి, నాగార్జునవే టాప్.. అనుష్క, రెజీనా ఎవరితో చేశారంటే?-tollywood heroines who mostly worked with one hero like prabhas chiranjeevi nagarjuna venkatesh anushka regina soundarya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  One Hero: ఒకే హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్.. చిరంజీవి, నాగార్జునవే టాప్.. అనుష్క, రెజీనా ఎవరితో చేశారంటే?

One Hero: ఒకే హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్.. చిరంజీవి, నాగార్జునవే టాప్.. అనుష్క, రెజీనా ఎవరితో చేశారంటే?

Sanjiv Kumar HT Telugu

Tollywood Heroines Who Mostly Worked With One Hero: ఒకే హీరోతో ఎక్కువగా సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. అయితే, వారు నటించిన హీరోల్లో ఎక్కువగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలు ఉన్నాయి. మరి ఏ హీరోయిన్ ఏ హీరోతో ఎన్ని సినిమాలు చేశారో ఇక్కడ తెలుసుకుందాం.

ఒకే హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్.. చిరంజీవి, నాగార్జునవే టాప్.. అనుష్క, రెజీనా ఎవరితో చేశారంటే?

Telugu Heroines Mostly Worked With One Hero: టాలీవుడ్‌లో ఎంతోమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందారు, ఇప్పటికీ హవా నడిపిస్తున్నారు. అయితే, సెంటిమెంటో లేదా కమిట్‌మెంటో తెలీదు కానీ, ఒక్క హీరోతోనే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.

జోడీ రిపీట్ అవడం

ఒక కాంబినేషన్ హిట్ అయితే ఆ జోడీనే రిపీట్ అవడం, ప్రేక్షకులు, అభిమానులకు ఆ కాంబో నచ్చడం కూడా కారణాలు అనుకోవచ్చు. మరి ఇలా ఒకే హీరోతో ఎక్కువ సార్లు సినిమాలు చేసిన కొంతమంది తెలుగు హీరోయిన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రెజీనా కసాండ్ర

సుధీర్ బాబు శివ మనసులో శ్రుతి మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా కసాండ్ర. హీరోయిన్ రెజీనా కసాండ్ర ఎక్కువగా సందీప్ కిషన్‌తో సినిమాలు చేసింది. సందీప్‌ కిషన్ రెజీనా కసాండ్ర కాంబినేషన్‌లో మొత్తంగా నగరం, నక్షత్రం, రొటీన్ లవ్ స్టోరీ, రా రా కృష్ణయ్య, కసడ తపరా (తమిళం) వంటి ఐదు సినిమాలు వచ్చాయి.

సౌందర్య

దివంగత హీరోయిన్ సౌందర్య అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా విక్టరీ వెంకటేష్‌తో సినిమాలు చేశారు. వెంకటేష్, సౌందర్య జోడీగా ఏడు సినిమాల్లో నటించారు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దేవి పుత్రుడు, జయం మనదేరా, రాజా, సూపర్ పోలీస్ సినిమాలు ఉన్నాయి.

అనుష్క

తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో అనుష్క ఒకరు. అనుష్క శెట్టి నాగార్జునతో టోటల్‌గా 9 సినిమాల్లో నటించింది. అయితే, వీటిలో ఐదు సినిమాలు డైరెక్ట్ మూవీస్ అయితే మిగతా నాలుగు చిత్రాల్లో కెమియో రోల్స్ చేసింది. వాటిలో సూపర్, డాన్, రగడ, ఢమరుకం, ఓం నమో వెంకటేశాయా హీరోయిన్‌గా చేసిన సినిమాలు అయితే.. ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయన, కేడీ (టైటిల్ సాంగ్), కింగ్ (పాటలో) గెస్ట్ రోల్ మూవీస్.

అనుష్క-ప్రభాస్

నాగార్జున తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కూడా ఎక్కువగా సినిమాలు చేసింది. వాటిలో బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్ (బాహుబలి 1), బాహుబలి ది కన్‌క్లూజన్ (బాహుబలి 2) సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, అనుష్క జోడీకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.

విజయశాంతి

లేడి యాక్షన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. ఆమె ఎక్కువగా సినిమాలు చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరు జోడీకి ఫుల్ బ్యాన్ బేస్ ఉండేది. చిరంజీవి, విజయశాంతి కలిసి మొత్తంగా 19 సినిమాల్లో నటించారు.

వాటిలో యముడికి మొగుడు, పాపం పసివాడు, కొండవీటి దొంగ, స్వయంకృషి, గ్యాంగ్ లీడర్, రుద్రనేత్ర, ధైర్యవంతుడు, ఛాలెంజ్, యుద్ధభూమి, ఛాణక్య శపథం, దేవాంతకుడు, సంఘర్షణ, మంచిదొంగ, మహానగరంలో మాయగాడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొండవీటి రాజా, చిరంజీవి సినిమాలు ఉన్నాయి.