Mirzapur 3 OTT Streaming: ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్‍లో మీర్జాపూర్ మూడో సీజన్.. ఓ విషయంపై ప్రేక్షకుల అసంతృప్తి
Mirzapur 3 OTT Streaming: మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్‍కు వచ్చేంది. ఒక్క రోజులోనే ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. అయితే, ఓ విషయంలో మాత్రం అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సుమారు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చేసింది. తొలి రెండు సీజన్లు విపరీతంగా ఆకట్టుకోవటంతో మూడో సీజన్‍పై చాలా హైప్ క్రియేట్ అయింది. మూడో సీజన్‍లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే, చాలా నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూలై 5) మీర్జాపూర్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ట్రెండింగ్‍లో టాప్
మోస్ట్ అవైటెడ్‍గా ఉన్న మీర్జాపూర్ సీజన్ 3 అంచనాలకు తగ్గట్టే దుమ్మురేపింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో శుక్రవారమే (జూలై 5) స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూడో సీజన్.. ఒక్క రోజునే నేడు (జూలై 6) ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. నంబర్ 1 ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
మీర్జాపూర్ సీజన్ 3కి గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి మొహంతీ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, పియూష్ పైన్యులీ, హర్షిత శేఖర్ గౌర్, రాజేశ్ తైలంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. మీర్జాపూర్ సింహాసనం కోసం ఈ మూడో సీజన్‍లోనూ పోరును మేకర్స్ చూపించారు.
ఈ విషయంలో అసంతృప్తి
మీర్జాపూర్ సీజన్ 3 ఎపిసోడ్ల నిడివి (రన్‍టైమ్) కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎపిసోడ్లు చాలా సాగదీసినట్టు అనిపిస్తున్నాయని అంటున్నారు. సీజన్ ఇంట్రెస్టింగ్‍గానే ఉన్నా సాగదీత వల్ల ఆసక్తి దెబ్బ తింటోందని, బోర్ ఫీలింగ్ వస్తోందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీర్జాపూర్ మూడో సీజన్‍లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో సీజన్ సగటున సుమారు 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో ఈ సీజన్ నిడివి ఎక్కువైందని ఫ్యాన్స్ అంటున్నారు. అనవసరమైన సీన్లు తీసేసి ఉంటే మరింత థ్రిల్లింగ్‍గా, గ్రిప్పింగ్‍గా ఈ సీజన్ ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఓవరాల్‍గా కూడా మీర్జాపూర్ సీజన్ 3కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు సీజన్లు ఉన్న రేంజ్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉన్నా సీజన్ మొత్తం ఉత్కంఠభరితంగా తెరకెక్కిచడంతో మేకర్స్ ఈసారి తడబడ్డారనే కామెంట్లు వస్తున్నాయి. మొదటి రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్ ఆ రేంజ్‍లో లేదని కొందరు ప్రేక్షకులు అంటున్నారు.
మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్‍ను ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ఈ మూడో సీజన్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్