Gunde Ninda Gudi Gantalu: రవికి శృతి టార్చర్ - పెళ్లైనా తర్వాతే రోజే గొడవపడిన కొత్త జంట - మీనాను క్షమించని బాలు
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 23 ఎపిసోడ్‌లో పెళ్లైన తర్వాత రోజే రవి, శృతి గొడవపడతారు. ఈ సమస్యలన్నింటికి శృతి తండ్రే కారణమని బాలు వాదిస్తాడు. శృతి కూడా ఏ మాత్రం తగ్గకుండా రవికి బదులిస్తుంది. పుట్టింటికి, అత్తింటికి దూరమై మీనా ఒంటరిదైపోతుంది.
Gunde Ninda Gudi Gantalu: పోలీస్ స్టేషన్‌లో సురేంద్ర చేసిన అవమానం పదే పదే వెంటాడుతుండటంతో సత్యం బాధ పడతాడు. నా ముగ్గురు కొడుకులు నేను గీసిన గీత దాటరంటూ విర్రవీగావు...ఇదేనా నీ పెంపకం అని సురేంద్ర అన్న మాటలు గుర్తొచ్చి విలవిలలాడుతాడు.
భోజనం చేయమని ప్రభావతి చెప్పిన ఆమె మాటలు విననట్లుగానే ఉంటాడు సత్యం. భార్య ఎంత పిలిచిన సమాధానం చెప్పడు. మీనా వల్లే భర్తకు ఈ గతి పట్టిందని ప్రభావతి అంటుంది. మీనాను వదిలిపేట్టేది లేదని ఆవేశంగా అంటుంది ప్రభావతి.
ఎన్నాళ్లు పస్తులు ఉంటావు...
అప్పుడే బాలు ఇంట్లో అడుగుపెడతాడు. మీ నాన్న నువ్వు చెబితేనే వింటారని, ఆయన్ని భోజనం చేయమని నువ్వే అడగమని బాలుతో అంటుంది ప్రభావతి. భోజనం ప్లేట్ తీసుకొచ్చి సత్యం ముందు పెడతాడు బాలు.
ఇలా ఎన్నాళ్లు పస్తులు ఉంటావని, ఏదైనా కోపం ఉంటే గట్టిగా నీ గుండెల్లో ఉన్న బాధ పోయేవరకు మాపై అరవమని తండ్రితో అంటాడు బాలు. అమ్మ పెంపకం బాగాలేక మేము ఇలా తయరయ్యామని తిట్టు...రవికి ఫోన్ చేసి చెడామడా వాయించమని బాలు అంటాడు. నిన్ను ఇలా చూడటం కష్టంగా ఉందని అంటాడు. ఎప్పటిలా ఉండమని తండ్రిని బతిమిలాడుతాడు.
ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు...
నేను నా కొడుకులను సరిగ్గా పెంచలేదని సురేంద్ర ముఖం మీదనే ఉమ్మేసివెళ్లిపోయాడని సత్యం ఎమోషనల్ అవుతాడు. నా జీవితంలో ఇంత అవమానం ఎప్పుడు జరగలేదని, ఆ క్షణమే నేను చచ్చిపోతే బాగుండునని అనిపించిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. రవి చేసిన తప్పు వల్ల వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నానని చెబుతాడు సత్యం. రవి ఏ తప్పు చేయలేదని, ప్రేమించి పెళ్లిచేసుకోవడం తప్పుకాదని సత్యాన్ని ఓదార్చుతాడు రంగా.
మీనా తప్పు ఏం లేదు...
నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఇంట్లో ఎవరూ ఉండలేకపోతున్నారని సత్యాన్ని కన్వీన్స్ చేస్తాడు రంగా. బాలు స్వయంగా తండ్రికి అన్నం తినిపిస్తాడు. మీనాను ఈ ఇంటి కోడలు తేస్తే...దానివల్లే ఇంత అనర్థం జరిగిందని ప్రభావతి అంటుంది. రవి, శృతిలను ప్రేమించుకోమని మీనా చెప్పిందా? మీనా ఆపితే రవి, శృతి పెళ్లిచేసుకోకుండా ఆగేవారా? అని రంగా అంటాడు.
ఒకరు చేసిన తప్పుకు మరొకరిని బాధ్యలను చేయోద్దని చెబుతాడు. కానీ మీనాదే తప్పు అని రంగాతో బాలు వాదిస్తాడు. రవి ప్రేమ పెళ్లి కారణంగా సత్యం చాలా కృంగిపోయాడని, అతడిని ఓ కంట కనిపెట్టుకొని ఉండమని బాలుతో చెబుతాడు రంగా. అతడి మాటలతో ప్రభావతి కంగారుపడుతుంది.
దేవుడే దిక్కు...
అత్తింటితో పాటు పుట్టింటికి దూరమైన మీనా తన బాధను దేవుడితో మొరపెట్టుకుంటుంది. తనకు ఏదైనా దారి చూపించమని వేడుకుంటుంది. నీ బాధను భర్తకు చెప్పుకుంటే తప్పకుండా వింటాడని పూజారి సలహా ఇస్తాడు. మరోసారి ప్రయత్నించమని చెబుతాడు.
రవి శృతి గొడవ...
ఇంట్లోవాళ్లు గుర్తొచ్చి రవి బాధపడతాడు. పెళ్లి చేసుకొని తొందరపడ్డామని శృతితో ఇంకొన్నాళ్లు ఆగితే బాగుండేదని చెబుతాడు.మాట్లాడితే మా వాళ్లు అంటున్నావు...నా కోసం అందరిని త్యాగం చేసి వచ్చిన వాడిలా మాట్లాడుతావు...నేను కూడా మా తల్లిదండ్రులను వదిలేసి వచ్చానని, నా జీవితం గురించి వాళ్లు ఎన్నో కలలు కంటే వాటన్నింటిని కాదని నీ కోసం వచ్చానని రవితో గొడవపడుతుంది శృతి.
మీ నాన్నే కారణం...
మీ నాన్నే ఈ గొడవలన్నింటికి కారణమని, మా నాన్నపై పోలీస్ కేసు పెట్టకపోయింటే ఇన్ని అనర్థాలు జరిగేవి కాదని శృతితో అంటాడు రవి. వాళ్ల సమస్యను మన మధ్యకు తీసుకురావొద్దని శృతి అంటుంది.
నన్ను పెళ్లి చేసుకొని నువ్వు పెద్ద తప్పు చేశానని ఫీలవుతున్నావు..అది ఓపెన్‌గా చెప్పలేక ఇలా ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతున్నావని రవితో శృతి వాదిస్తుంది.
టార్చర్ పెట్టకు...
నీ మాటలతో నన్ను టార్చర్ పెట్టకు అని రవితో అంటాడు శృతి. నా మాటలు, ప్రేమ నీకు టార్చర్‌లా అనిపిస్తున్నాయా...నేను నీకు ఒక్క రోజులోనే బోర్ కొట్టేశానా అని రవితో గొడవపెట్టుకుంటుంది శృతి. ఆవేశంగా డబ్బింగ్ చెప్పడానికి బయలుదేరుతుంది. ఎక్కవికి వెళుతున్నావో చెప్పమని శృతిని అడుగుతాడు రవి. నేను ఎక్కడికి వెళితే...నీకెందుకు నువ్వు హ్యాపీగా మీ ఇంటికి వెళ్లమని వెటకారంగా రవికి సమాధానమిస్తుంది శృతి.
రవిపై శృతి సెటైర్లు...
స్కూటీ లేకపోవడంతో డబ్బింగ్ స్టూడియోకు ఎలా వెళ్లాలా అని శృతిఆలోచిస్తుంది. మీ నాన్నకు ఫోన్ చేస్తే తెచ్చి ఇస్తారని శృతిపై రవి సెటైర్లువేస్తాడు. నేను ఫోన్ చేస్తే సంతోషంగా ఇంటికిరమ్మంటారు మీ వాళ్లలా కాదని శృతి వెటకారంగా భర్తకు ఆన్సర్ ఇస్తుంది. అయితే అక్కడికే వెళ్లమని రవి బదులిస్తాడు. బుద్దిలేకుండా అమాయకుడైన మా నాన్నపై కేసు పెట్టారని రవి అంటాడు. మీ వాళ్లు అంత బుద్దిమంతులు అయితే మన ప్రేమను అర్థం చేసుకొని ఎందుకు పెళ్లిచేయలేదని శృతి కోపంగా బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శృతిని చూసిన సంజు...
డబ్బింగ్ స్టూడియోకి వెళుతున్న శృతిని సంజు చూస్తాడు. ఆమెపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. రవి ఎంట్రీ అతడి ప్లాన్‌ను చెడగొడతాడు. తాను డబ్బింగ్ స్టూడియో దగ్గర దిగబెడతానని రవి ఎంత చెప్పిన శృతి వినకుండా ఆటో ఎక్కివెళ్లిపోతుంది. రవిని చూసి సంజు షాకవుతాడు.
నా దగ్గరకు రావోద్దు...
బాలు కారుకు అడ్డంగా వెళుతుంది మీనా. నా బ్రతుకు రోడ్డు పాలైందని, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వచ్చానని అంటుంది. ఎక్కడికైనా వెళ్లిపో నా దగ్గరకు మాత్రం రావొద్దని అంటాడు బాలు. నీ లాంటి పెళ్లానికి విలువ ఇస్తే నన్ను జైలులో పెడతారని బాలు అంటాడు. నేను చనిపోయిన తర్వాతైనా నా విలువ మీకు అర్థమవుతుందని కన్నీళ్లతో బాలుకు బదులిస్తుంది మీనా. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్