Shani Trayodashi: శని త్రయోదశి నాడు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? పూజ సమయం, వ్రత విధానం వివరాలు
Shani Trayodashi: శనివారం త్రయోదశి రానుండటంతో శని త్రయోదశి తిథిగా పిలువబడుతుంది. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం, శని త్రయోదశి తిథి రోజున శని దేవుడిని, శివుడిని పూజించడం వల్ల శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి.
ఈ సంవత్సరం శని త్రయోదశి తేదీ డిసెంబర్ 28న వచ్చింది. హిందూ మతంలో త్రయోదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రదోష ఉపవాసం కూడా పాటిస్తారు. శనివారం త్రయోదశి రానుండటంతో శని త్రయోదశి తిథిగా పిలువబడుతుంది. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం, శని త్రయోదశి తిథి రోజున శని దేవుడిని, శివుడిని పూజించడం వల్ల శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. శని త్రయోదశి తిథి, పూజా విధి గురించి తెలుసుకుందాం
శని త్రయోదశి వ్రతం ఎప్పుడు?
ద్రుక్ పంచాంగం ప్రకారం, శని త్రయోదశి తిథి డిసెంబర్ 28, 2024 న తెల్లవారుజామున 02:26 గంటలకు ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి డిసెంబర్ 29, 2024 ఉదయం 03:32 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, పంచాంగం ప్రకారం, డిసెంబర్ 28 న శని త్రయోదశి తిథి ఉపవాసం, ఆరాధన చేయడమా జరుగుతుంది. పూజా ముహూర్తం సాయంత్రం 05:33 నుండి 08:17 వరకు ఉంటుంది.
శని త్రయోదశి పూజా విధానం:
స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివునితో పాటుగా అన్ని దేవుళ్లను పూజించవచ్చు. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు, పూలు, అక్షింతలతో ఉపవాస దీక్షను మొదలు పెట్టాలి. ఆ తర్వాత సాయంత్రం పూజ గదిలో సాయంత్రం దీపం వెలిగించాలి. తరువాత శివాలయం లేదా ఇంట్లో శివుని ప్రతిష్ఠను నిర్వహించాలి. వీలైతే శనీశ్వరుని ఆలయంలో ఆవనూనె దీపం వెలిగించండి. అనంతరం నెయ్యి దీపంతో శివునికి హారతి ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. చివరగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి.
దోషాలు తొలగిపోవాలంటే ఇలా చేయండి
శని త్రయోదశి నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి. 9 ప్రదక్షిణాలు చేస్తే శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయస్వామికి కానీ 11 ప్రదక్షిణలు చేస్తే శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెడితే కూడా మంచిది. అలాగే నల్ల చీమలకు పంచదారని ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే కూడా శని త్రయోదశి నాడు మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత పదో 11 ప్రదక్షిణలు చేస్తే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా శని త్రయోదశి నాడు ఆచరించినట్లయితే సకల దోషాలు తొలగిపోయి శుభాలు పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.