Shivaratri Mantras Telugu : ఓం నమః శివాయ.. శివరాత్రి పవర్ ఫుల్ మంత్రాలివే
Maha Shivaratri Mantras In Telugu : శివయ్య కోసం ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో.. మంత్రాలు కూడా పఠించడం అంతే ముఖ్యం. మంత్రోచ్ఛారణతో వ్యక్తిలో ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది. ఆ దేవదేవుడి మంత్రాలు శక్తివంతమైనవి. వాటిని పఠిస్తే మంచిదని భక్తులు నమ్ముతారు.
మహాశివరాత్రిని దేశమంతా.. జరుపుకొంటుంది. భక్తిశ్రద్ధలతో శివయ్య భక్తులు అత్యంత నిష్టతో పూజలు చేస్తారు. ఉదయమే నిద్రలేచి, ఆదిశంకరుడి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఉపవాసం ఉన్నారు. మహాశివరాత్రి(Maha Shivratri) శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఇప్పటికే శివయ్య నామస్మరణతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అభిషేక ప్రియుడిని ప్రసన్నం చేసుకుంటున్నారు. మంత్రాలను క్రమమైన పద్ధతిలో మంత్రోచ్ఛారణ చేస్తే.. శరీరంలో ప్రకంపనలు ఏర్పడుతాయి. ఇవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. నిర్మలమైన మనసుతో మంత్రాలు ఉచ్ఛరిస్తే.. మంచి ఫలితాలు వస్తాయి.
ఓం నమ: శివాయ.. ఇది శివ పంచాక్షరి మంత్రం.. ఈ మంత్రాన్ని మించినది లేదని చెబుతుంటారు. ఓం నమ: శివాయ అని స్మరిస్తే.. చాలు ఆ దేవదేవుడు.. కరుణ మీ మీద ఉంటుంది. భోళాశంకరుడు మీ కోరికలను నెరవేరుస్తాడు. నిర్మలమైన మనసుతో ఈ మంత్రాన్ని జపించాలి. మనసులోని భయాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ప్రతి రోజూ.. 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. పాపాల నుంచి లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్.. ఈ మంత్రాన్ని ఏకాగ్రత లేనప్పుడు, ఏకాగ్రతను పెంచుకునేందుకు జపిస్తే ప్రయోజనమని చెబుతారు. ఇది జపిస్తే.. మనసు, శరీరం ఏకమై ప్రశాంతత ఉంటుందట.
ఓం నమో భగవతే రుద్రాయ.. శివుడి అనుగ్రం కోసం.. ఈ మంత్రాన్ని జపిస్తారు. ఇది పఠించడం ద్వారా.. దేవదేవుడి అనుగ్రహం పొందుతారని నమ్మకం.
ఓం త్రయంబకం యజామహో సుగంధిం పుష్టి వర్ధనం.. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్.. అందరికీ శక్తినిచ్చే.. ముక్కంటి దేవుడు శివుడిని పూజిస్తున్నాం. మరణం నుంచి దూరంగా ఉండాలి అనే అర్థంలో ఈ మంత్రాన్ని జపిస్తారు. దీర్ఘాయుషు కోసం పఠిస్తారు.
కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హరం.. సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి.. శివుడి మంత్రం జపించడం ఆరోగ్యం, సంపద, శ్రేయోసు కలిగుతుందని విశ్వాసం.
ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే.. శరణ్యే.. త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే.. అని మంత్రాన్ని కూడా జపించాలి.
కింది మంత్రాలను కూడా జపించొచ్చు
ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ:
ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం
ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:
ఓం శ్రీం హ్రీం సం సం హ్రీ శ్రైం సంకర్షణాయ ఓం..
ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ:
ఓం శ్రీ బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం
ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం
ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ :
ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్
ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:
పైన చెప్పిన మంత్రాలను 108 సార్లు మహాశివరాత్రి నుంచి 40 రోజులపాటు జపిస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. మిగతా రోజుల్లోనూ జపించాలి. ఉదయం 9 సార్లు, సాయంత్ర 9 సార్లు ఉచ్ఛరిస్తే.. జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.
గమనిక : ప్రజల సాధారణ ఆసక్తులు, దొరికిన సమాచారం ఆధారంగా.. కథనం ఇచ్చాం.