Happy Vasantha Panchami 2023 । వసంత పంచమి శుభాకాంక్షలు.. జ్ఞాన స్వరూపిణి సరస్వతీ దేవీ మంత్రాలు చూడండి!-happy vasantha panchami 2023 wishes telugu greetings and saraswati mantras to chant during puja ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Happy Vasantha Panchami 2023 Wishes, Telugu Greetings And Saraswati Mantras To Chant During Puja

Happy Vasantha Panchami 2023 । వసంత పంచమి శుభాకాంక్షలు.. జ్ఞాన స్వరూపిణి సరస్వతీ దేవీ మంత్రాలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 06:06 PM IST

Happy Vasantha Panchami 2023: వసంత పంచమి శుభాకాంక్షలు, 2023 వసంత పంచమి శుభాకాంక్షలు, సరస్వతీ దేవీ పూజా ప్రాముఖ్యత, చదువుల తల్లి కటాక్షం కోసం పఠించాల్సిన మంత్రాలు ఇక్కడ తెలుసుకోండి.

Happy Vasanta Panchami 2023
Happy Vasanta Panchami 2023 (HT Photo)

Vasantha Panchami 2023 : హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు. ఇది వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనడమైనది. ఈ మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి జన్మించిన రోజు, కాబట్టే తూర్పు భారత దేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతి కటాక్షం కోసం భక్తులు సరస్వతీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారని భక్తుల నామ్మకం. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు.

జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి, ఉత్పాదకతకు ప్రతీక. ఆ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఉత్పాదకుడైన, సృష్టికర్త బ్రహ్మకు శారదే శక్తిదాయిని, కాబట్టి వసంత పంచమి రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం.

ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈరోజు పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు.

వసంత పంచమి రోజున, సరస్వతీ దేవిని కేవలం ఆలయాలలో మాత్రమే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలలోనూ పూజిస్తారు. అందరికీ సరస్వతీ కటాక్షం కలగాలని, సత్ప్రవర్తనతో మెరుగైన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలను తెలియజేద్దాం.

ఈ సందర్భంగా వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని స్మరిస్తూ చదివే మంత్రాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ మంత్రాల పఠనం వలన మీ వాక్కులో, మీ ఉచ్ఛారణలో స్పష్టత వస్తుంది, మీ ఆలోచనలు మెరుగవుతాయి, మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీరు చదువుల్లో, పరీక్షలలో గొప్పగా రాణిస్తారు, మీ జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు.

Happy Vasantha Panchami 2023- Saraswati Mantras To Chant

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।

విద్యారమ్భం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥

Happy Vasanta Panchami 2023
Happy Vasanta Panchami 2023

ఓం ఏన్ వాగ్దేవ్యై చ విద్మహే కామరాజాయ ధీమహి!

తన్నో దేవి ప్రచోదయాత్ ॥

Happy Vasanta Panchami 2023
Happy Vasanta Panchami 2023

సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే ।

విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే ॥

ఓం అర్హం ముఖ కమల వాసిని పాపాత్మ క్షయం కారీ

వద వద వాగ్వాదినీ సరస్వతి అం హ్రీం నమః స్వాహా ||

ఓం ఏం హ్రీం క్లీం మహాసరస్వతీ దేవ్యై నమః ||

Happy Vasanta Panchami 2023
Happy Vasanta Panchami 2023

శుక్లాం బ్రహ్మవిచారసారపరమంద్యాం జగద్వ్యాపనీం|

వీణా-పుస్తక-ధారిణీమభయదాం జాడ్యాంధకారపహామ్||

హస్తే స్ఫటిక మాలికాం విదధతీం పద్మాసనే సంస్థామ్|

వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ ||

2023లో వసంత పంచమిని 26 జనవరి, గురువారం నాడు జరుపుకుంటున్నాము. ఈరోజు నుంచి భారతదేశంలో వసంత రుతువు ప్రారంభమవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్