Karimnagar Shivaratri: మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవోపేతంగా జరిగాయి. శైవక్షేత్రాలన్ని భక్తులు కిటకిటలాడాయి. శివన్నామస్మరణతో మారుమ్రోగాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా లింగార్చన, లింగొద్బవ సమయాన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.