Maha Shivaratri Mantras : శివయ్య కోసం రాశికో మంత్రం.. మీ రాశి ఏది?-maha shivaratri 2023 mantras for different zodiac signs to please lord shiva here s details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri Mantras : శివయ్య కోసం రాశికో మంత్రం.. మీ రాశి ఏది?

Maha Shivaratri Mantras : శివయ్య కోసం రాశికో మంత్రం.. మీ రాశి ఏది?

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 02:52 PM IST

Maha Shivaratri 2023 mantras : మహాశివరాత్రి వచ్చేసింది. దేవదేవుడి భక్తులు.. అత్యంత నిష్ఠతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే వివిధ రాశుల వారు.. భోళా శంకరుడి జపం చేస్తూ.. పూజ చేయాలి.

మహాశివరాత్రి 2023
మహాశివరాత్రి 2023

భారతదేశంలో ముఖ్యమైన హిందూ పండుగలలో శివరాత్రి(Shivratri) ఒకటి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 18న వచ్చింది. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, బలం, మార్గదర్శకత్వం కోసం భక్తులు శివుని ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ప్రత్యేక పూజలు, ఉపవాసం, ధ్యానంతో కూడిన రాత్రి ఇది. శివరాత్రి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శివయ్య ఆశీర్వాదం ఇస్తాడని, ఉపవాసం చేస్తే.. కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ రోజున భక్తులు మహా శివరాత్రి(Maha Shivratri) వ్రత కథను కూడా పఠిస్తారు. ప్రతి రాశికి శ్రేయస్సు కోసం మంత్రం ఉంటుంది. పండితులు రాశుల ప్రకారం మంత్రాలను పఠించడం గురించి చెప్పారు.

మేషరాశి

మేష రాశి వారు శివునికి నీళ్ళు సమర్పించిన తర్వాత 'ఓం నాగేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు శివలింగానికి పాలు సమర్పించిన తర్వాత 51 సార్లు 'ఓం నమఃశివాయ్' అని జపించాలి.

మిథున రాశి

శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశివారు శివుని రుద్రాష్టకంతో 'ఓం నమః శివాయ కాలం మహాకాల కాలం కృపాలం ఓం నమః' అనే మంత్రాన్ని పఠించాలి.

కర్కాటక రాశి

మహాశివరాత్రి నాడు కర్కాటక రాశి వారు ఆవు పాలను నైవేధ్యంగా పెట్టి శివ చాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించాలి.

సింహరాశి

సింహరాశి వారు.. మహాదేవుడికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించిన తర్వాత.. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

కన్య రాశి

ఈ రాశికి చెందిన వారు మహాశివరాత్రి రోజున 'ఓం నమో శివాయ కాలం ఓం నమః' అనే మంత్రాన్ని జపించాలి.ఈ మంత్రాన్ని జపించేటప్పుడు బాగా ఉచ్చరించేలా చూసుకోవాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు శివుడు, పార్వతి దేవిని కలిసి పూజించాలి. 'ఓం పార్వతీ నాథాయ నమః' అని 51 సార్లు జపించాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారు మహాదేవుని పూజించిన తర్వాత తప్పనిసరిగా రుద్రాష్టకం స్తుతి చదవాలి. శివునికి నీటిని సమర్పించేటప్పుడు 'ఓం అంగరేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి.

మకరం

ఈ రాశికి చెందిన వ్యక్తులు శివునికి చందనాన్ని పూసిన తర్వాత 'ఓం భమేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని 51 సార్లు జపించాలి.

కుంభం

మకరం, కుంభ రాశులకు అధిపతి శని దేవుడు. ఈ రాశి వారు శివునికి పాలు, పెరుగు, తేనె సమర్పించిన తర్వాత 108 సార్లు 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించాలి.

మీన రాశి

మహాశివరాత్రి సందర్భంగా మీనరాశి వారు ఆలయంలో కూర్చుని, శివునికి ధాతురా, భాంగ్ నైవేద్యంగా సమర్పించిన తర్వాత Shivashtak చదవడం ఉత్తమం.

WhatsApp channel