Maha Shivratri 2023 Vrat : శివరాత్రి ఉపవాసంలో మీరు ఏం తినొచ్చు?-maha shivratri 2023 foods that you can eat during the fast here s check list ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Maha Shivratri 2023 Vrat : శివరాత్రి ఉపవాసంలో మీరు ఏం తినొచ్చు?

Maha Shivratri 2023 Vrat : శివరాత్రి ఉపవాసంలో మీరు ఏం తినొచ్చు?

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 10:49 AM IST

Maha Shivratri 2023 : అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి మహా శివరాత్రి. భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. కొంతమంది శివ భక్తులు కఠోరమైన 'నిర్జల వ్రతం' పాటిస్తారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు తీసుకుంటారు.

మహా శివరాత్రి 2023
మహా శివరాత్రి 2023 (unsplash)

భారతదేశం అంతటా జరుపుకొనే అత్యంత పవిత్రమైన పండుగలలో మహా శివరాత్రి(Maha Shivratri) ఒకటి. ఈ రోజున దేశవ్యాప్తంగా 'హర్ హర్ మహాదేవ్' కీర్తనలు వినిపిస్తాయి. ఫిబ్రవరి 18, 2023న శివరాత్రి వచ్చింది. ఈ రోజున భక్తులు పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. కొంతమంది గంగా నదిలో పుణ్యస్నానం చేసి, శివుడిని పూజిస్తారు. మహా శివరాత్రి ఉపవాసంతో దేవదేవుడి ఆశీర్వాదంతోపాటుగా కోరికలు నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. వివాహిత స్త్రీలు తమ దాంపత్య జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి వ్రతాన్ని పాటిస్తే, మరో వైపు అవివాహిత స్త్రీలు తమకు మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందనే ఆశతో పూజ చేస్తారు. అయితే ఉపవాసం సమయంలో ఏం తినొచ్చు అనేది చాలామందికి తెలియదు.

మహా శివరాత్రి(Maha Shivratri) నాడు చాలా మంది భక్తులు 'నిర్జల వ్రతాన్ని' ఎంచుకుంటారు. వారు రోజంతా నీరు లేదా ఆహారం తీసుకోరు. చాలా మంది ఈ రకమైన ఉపవాసం చేయలేరు. అనారోగ్య సమస్యలు కావొచ్చు.. ఇతర కారణాలతో కావొచ్చు. అందువల్ల ఎక్కువ మంది ప్రజలు పండ్లు, పాలు తీసుకుంటారు. మహా శివరాత్రి రోజున మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇక్కడ ఉన్నాయి:

ఈ ప్రత్యేక సందర్భంలో రిఫ్రెష్, గట్-కూలింగ్ కోసం రోజ్ తండై మంచిది. ఇది శివరాత్రి ప్రత్యేక పానీయం, ఇది గులాబీతో తయారు చేస్తారు. మంచి రుచి కోసం మీరు దీనికి రూహాఫ్జాను కూడా జోడించవచ్చు. ఈ పానీయం మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తుంది. హెల్తీగా కూడా ఉంటుంది.

చిలగడ దుంపలు మహా శివరాత్రి పండుగ సమయంలో తినే ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటి. అవి మిమ్మల్ని రోజంతా నిండుగా ఉంచుతాయి. మీకు ఇష్టమైన ఆలూ టిక్కీ, ఆలూ పకోరా చేసుకోవచ్చు. అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు ఇతర మసాలా వంటివి అస్సలు ఉపయోగించొద్దు.

ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు శివలింగాన్ని పాలతో అభిషేకిస్తారు. ఎందుకంటే శివుడికి పాలు అంటే ఇష్టం. మహా శివరాత్రి నాడు ఉపవాసం సమయంలో కూడా పాలు విరివిగా వినియోగిస్తారు. మీరు ఉపవాస సమయంలో బాదం దూద్, ఖీర్, సబుదానా ఖీర్, మఖానే కి ఖీర్ వంటి పాలు మరియు పాల ఆధారిత డెజర్ట్‌లు, పానీయాలు తీసుకోవచ్చు.

ఉపవాస సమయంలో సాధారణంగా ఉపయోగించే ఆహార పదార్థాలలో సబుదానా ఒకటి. మీరు దానితో సబుదానా పకోరా, సబుదాన వడ వంటి అనేక వంటకాలను తయారు చేయవచ్చు. ఇది ఉపవాసం లేదా వ్రతం కోసం అన్ని ఆహార తయారీలలో ఉపయోగిస్తారు.

ప్రతి పూజ, ఉపవాసంలో పండ్లు పెద్ద భాగం. ఇది నిజంగా మీ ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు ఆకలిగా ఉంటే, మీరు ఈ రోజున ఫ్రూట్ చాట్‌లు, ఫ్రూట్ సలాడ్‌లు, ఫ్రూట్ మిల్క్‌షేక్‌లను కూడా తీసుకోవచ్చు. బాదం, వాల్‌నట్‌లు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష వంటి అనేక రకాల డ్రై ఫ్రూట్‌లను కూడా తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం