Maha Shivaratri 2023 । ఆ రోజే మహా శివరాత్రి.. పూజా సమయాలు, శుభ ఘడియలు ఇవిగో!-maha shivaratri 2023 know date puja timings shubha muhurat fasting rules to get lord blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri 2023 । ఆ రోజే మహా శివరాత్రి.. పూజా సమయాలు, శుభ ఘడియలు ఇవిగో!

Maha Shivaratri 2023 । ఆ రోజే మహా శివరాత్రి.. పూజా సమయాలు, శుభ ఘడియలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 11:25 AM IST

Maha Shivaratri 2023: ఈ ఏడాది మహా శివరాత్రి ఏ రోజున వస్తుంది, పూజా సమయాలు, శుభ ముహూర్తం గడియలు, ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

Maha Shivaratri 2023
Maha Shivaratri 2023 (Pixabay/Shutterstock)

శివరాత్రి ప్రతీనెల వస్తుంది, కానీ ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే అపురూప ఘట్టాన్ని మహా శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడు, శక్తి కలయిక జరిగే రాత్రిగా నమ్ముతారు. అనంత విశ్వానికి ప్రతిరూపంగా ఉండే శివుడు, అనంతంలోని శక్తిగా పేర్కొనే పార్వత కలయిక జరిగే రాత్రి కాబట్టే దీనిని మహా శివరాత్రిగా పేర్కొంటారు. ఈ కలయిక సృష్టికి మూలంగా నిలుస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణ ఉవాచ.

మహా శివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. చాంద్రమానం ప్రకారం, మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి ఉంటుంది. ఈరోజు శివుడు, పారతి వివాహం చేసుకొని పార్వతీపరమేశ్వరులుగా అవతరించారని పురాణాల్లో ఉంది.

పురుషుడు అంటే సంస్కృతంలో ఆత్మ, మనసు అనే అర్థం ఉంది. స్త్రీని ప్రకృతిగా కొలుస్తారు. శివుడు పురుషుడు అయితే, పార్వతి ప్రకృతి స్వరూపం. వీరి కలయిక ప్రకృతిలో జీవం పోస్తుంది, ఈ రకంగా మహా శివరాత్రి సృష్టి కారకంగా ఉంటుంది. చీకటిని అధిగమించి జ్ఞానానికి ఉదయంగా ఈ రాత్రి సూచిస్తుంది. అందుకే మహా శివరాత్రికి అంతటి ప్రాశస్త్యం.

Maha Shivaratri 2023 Date - మహ శివరాత్రి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఇది ప్రతీ ఏడాది శీతాకాలం ముగింపు, వసంత ఋతువు ప్రారంభంలో మహా శివరాత్రి ఉంటుంది. అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండవచ్చు. అయితే ఈ ఏడాది 2023 మహా శివరాత్రి రోజును ఫిబ్రవరి 18వ తేదీన, శనివారం నాడు జరుపుకుంటున్నాము.

Maha Shivaratri 2023 Puja Timings - మహా శివరాత్రి శుభ ముహూర్తం, పూజా సమయాలు

2023 మహా శివరాత్రి పూజా సమయాలు, శుభ ఘడియలు దృక్ పంచాంగం ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • చతుర్దశి తిథి ఫిబ్రవరి 18, 2023న రాత్రి 08:02 గంటలకు ప్రారంభమవుతుంది
  • చతుర్దశి తిథి ఫిబ్రవరి 19, 2023న సాయంత్రం 04:18 గంటలకు ముగుస్తుంది
  • శివ రాత్రి మొదటి ప్రహార పూజ సమయం సాయంత్రం 06:13 నుండి 09:24 వరకు
  • శివ రాత్రి రెండవ ప్రహార పూజ సమయం 09:24 pm నుండి 12:35 am, ఫిబ్రవరి 19
  • శివ రాత్రి మూడవ ప్రహార పూజ సమయం ఉదయం 12:35 నుండి 03:46 వరకు, ఫిబ్రవరి 19
  • శివ రాత్రి నాల్గవ ప్రహార పూజ సమయం 03:46 am నుండి 06:56 am, ఫిబ్రవరి 19
  • నిషిత కాల పూజ సమయం 12:09 am నుండి 01:00 am వరకు, ఫిబ్రవరి 19, 2023.

మహా శివరాత్రి రోజున, భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు, శివాలయాలను సందర్శించి శివపార్వతులకు భక్తి, శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రాత్రి మొత్తం జాగరణ చేస్తూ శివనామస్మరణతో శివుని భజన చేస్తారు. ఇలా చేయడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Whats_app_banner

సంబంధిత కథనం