Bigg Boss Telugu 8: గౌతమ్ గొంతు పట్టుకుని లాగేసిన నిఖిల్.. డాక్టర్ బాబు వర్సెస్ యాక్టర్ బాబు ఫైట్.. అమ్మతోడు అంటూ ఒట్టు!
Bigg Boss Telugu 8 Gautham Krishna Vs Nikhil: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 17వ తేది ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు గౌతమ్ వర్సెస్ యాక్టర్ బాబు నిఖిల్ మధ్య పెద్ద ఫైట్ జరిగింది. దాదాపు ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. నిఖిల్ అయితే గౌతమ్ గొంతుపట్టుకుని మరి లాక్కుంటూ వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bigg Boss Telugu 8 October 17th Episode Highlihgts: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 17వ తేది ఎపిసోడ్‌లో కూడా ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ కొనసాగింది. బుధవారం (అక్టోబర్ 16) ప్రారంభమైన ఈ టాస్క్ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. అయితే, రెండో రోజున ఈ టాస్క్ కాస్తా ఓవర్ వయెలెన్స్‌కు దారి తీసింది.
టాస్క్ నుంచి తప్పించాలి
ఎపిసోడ్ ప్రారంభంలో విష్ణు, నబీల్ మాట్లాడుకుంటుంటే సైలెంట్‌గా నబీల్ చార్జర్ పెట్టుకున్నాడు టేస్టీ తేజ. దాంతో తేజ పవర్ కూడా పెరిగింది. అనంతరం "ఓవర్ స్మార్ట్ ఫోన్స్ మీరు సైరన్‌కు సైరన్‌కు మధ్యలో ఛార్జింగ్ పాట్‌ను పగలగొట్టారు. కాబట్టి మీరు ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఒక సభ్యుడిని కంటెండర్‌షిప్ నుంచి, టాస్క్ నుంచి తప్పించాలి. అది ఎవరో చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పాడు.
దాంతో రాయల్ క్లాన్స్ (ఓవర్ స్మార్ట్ ఫోన్స్) అంతా ఎవరిని తీసేద్దామా అని ఆలోచించుకుంటున్నారు. ఇదే సమయంలో నెమ్మదిగా వాష్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు నాగ మణికంఠ. ఆ తర్వాత వెంటనే విష్ణుప్రియ కూడా వెళ్లిపోయింది. ఇది చూసిన రాయల్ క్లాన్ పరిగెత్తుకుని వాష్‌రూమ్స్ దగ్గరికి వెళ్లిపోయారు. మణికంఠ, విష్ణు ఇద్దరిని లాక్ చేసేందుకు ప్రయత్నించారు.
బాత్రూమ్‌లో మణికంఠ
అది చూసి ఓజీ క్లాన్ (ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్) కూడా బాత్రూమ్‌లోకి పరిగెత్తారు. వాష్‌రూమ్‌లో ఉన్న మణికంఠ బయటకు రాకుండా కాపల నిల్చున్నారు రాయల్ క్లాన్ సభ్యులు. అప్పుడే మణికంఠ నుంచి బలవంతంగా ఛార్జింగ్ లాగేసేందుకు ట్రై చేశారు రాయల్ క్లాన్. దాంతో బాత్రూమ్ బయట ఉన్న తేజాను పక్కకు లాగాడు నిఖిల్.
అది చూసి నిఖిల్‌ను గట్టిగా పట్టుకున్నాడు గౌతమ్. దాంతో ఇద్దరిమధ్య కాసేపు తోపులాట జరిగింది. అప్పుడు గౌతమ్‌ను పక్కకి లాగేశాడు నబీల్. మరోవైపు ఈ గొడవలోకి మెహబూబ్‌ను రాకుండా పృథ్వీ ఆపాడు. అప్పుడు ఈ టాస్క్ నుంచి పృథ్వీని తీసేస్తున్నట్లు బిగ్ బాస్‌తో చెప్పారు. మరోవైపు తోపులాటలో గౌతమ్, నిఖిల్ ఇద్దరూ కిందపడిపోయారు.
గొంతు పట్టుకుని లాగి
గౌతమ్ చేతులతో గుద్దాడంటూ నబీల్ అన్నాడు. దానికి గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. నేను తోయలేదు అని మీదకు వచ్చాడు. అదే సమయంలో నిఖిల్‌ను గౌతమ్ పక్కకు లాగేయడంతో కిందపడ్డాడు నిఖిల్. ఆ కోపంలో నబీల్‌తో వాదిస్తున్న గౌతమ్‌ను వెనుక నుంచి గొంతు పట్టుకుని గార్డెన్ ఏరియాలోకి లాక్కెళ్లిపోయాడు నిఖిల్. దాంతో అంతా నిఖిల్ చేసిన పనికి షాక్ అయ్యారు.
"కొడితే నేను కొడతా" అని నిఖిల్ అరవడంతో నేను కొట్టలే.. "వాంటెడ్‌గా నేను కొట్టలే.. అని గౌతమ్ మరింత ఫైర్ అయ్యాడు. మూతి మీద గుద్దాడంటూ నిఖిల్ ఆరోపించాడు. "ఎక్కువ తక్కువ మాట్లాడకు.. నేను కొట్టినట్లు ఫుటేజీలో ఉంటే మా అమ్మ మీద ఒట్టు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకెళ్లిపోతా.. నేను వాంటెడ్‌గా కొట్టాలేదు" అంటూ గౌతమ్ శివాలెత్తిపోయాడు. నిఖిల్‌ను ఆగమంటూ యష్మీ ట్రై చేసింది.
ముందు వాడే కొట్టాడు
ఆ తర్వాత నువ్ గౌతమ్ మెడ పట్టుకుని లాగేశావ్. అది నేను చూశా. ఇది చాలా రాంగ్ నిఖిల్ అంటూ రోహిణి చెప్పింది. ముందు వాడే మూతి మీద కొట్టాడు అంటూ నిఖిల్ చెప్పుకున్నాడు. "నువ్ మాత్రం కావాలనే మెడ పట్టుకుని తీసుకొచ్చావ్, ఇది మా క్లాన్ అని కాదు. సాధారణంగా ఇలా చేయొద్దు" అన్న అర్థంలో రోహిణి చెప్పింది. కాగా.. హీరోగా, డాక్టర్ బాబుగా గత సీజన్‌లో గౌతమ్ పాపులర్ అయ్యాడు. నిఖిల్ పలు సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్నాడు.
టాపిక్