AP Medical Recruitment 2024 : తూర్పుగోదావరి జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫార్మసిస్ట్, ఎన్ జీఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థలు డిసెంబర్ 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం ఎనిమిది ఖాళీలను రిక్రూట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మూడు ఫార్మసిస్ట్,4 ఎన్ జీఎస్ పోస్టులు ఉండగా.. ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఉంది. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
ఫార్మసీ పోస్టులకు బీ ఫార్మసీ లేదా డిప్లామా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి. ఇక డేటా ఆపరేట్ పోస్టులకు డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉండాలి.LGS పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డిసెంబర్ 29వ తేదీలోపు ఆఫ్ లైన్ లో సమర్పించాలి. డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరుపై డీడీ కట్టాలి. ఓసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 200 కట్టాలి.
వంద మార్కులను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో 75 శాతం వేయిటేజీని అకడమిక్ మార్కులకు కేటాయిస్తారు. కాంట్రాక్ట్. ఔట్ సోర్సింగ్ కింద సర్వీస్ చేసిన వారికి 15 శాతం వేయిటేజీ ఇస్తారు. కాంట్రాక్ట్ సర్వీస్ కు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
- రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ - డిసెంబర్ 19, 2024
- అప్లికేషన్ల స్వీకరణ - డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 29, 2024
- ప్రివిజనల్ మెరిట్ లిస్ట్ - జనవరి 4, 2025
- ఫైనల్ మెరిట్ జాబితా - జనవరి 09, 2025
- ఆపాయింట్ మెంట్ అర్డర్ల అందజేత - జనవరి 14, 2024
- అధికారిక వెబ్ సైట్ లింక్ - https://kakinada.ap.gov.in/notice_category/recruitment/
పైన పేర్కొన్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు https://kakinada.ap.gov.in/notice_category/recruitment/ లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లొచ్చు. ఇక్కడ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ డిస్ ప్లే అవుతుంది. చివర్లో కనిపించే వ్యూ అనే ఆప్షన్ పై నొక్కితే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను చూడొచ్చు. సర్వీస్ సర్టిఫికెట్ ను కూడా అందుబాటులో ఉంచారు.