Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి రుణ సమస్యలు తీరుతాయి.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.12.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశి ఫలాలు (దిన ఫలాలు) : 21.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : శనివారం, తిథి : కృ. షష్టి, నక్షత్రం : పూర్వ ఫాల్గుణి
మేష రాశి
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం పై శ్రద్ద వహించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభ రాశి
వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల కదలి కలపై దృష్టిపెట్టండి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఉత్సాహ పరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. శుభకార్యాలు జరుగుతాయి.
మిధున రాశి
ప్రణాళికాబద్ధంగా పని చేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. పరిస్థితులు త్వరలో సర్దుకుంటాయి. పొదుపు పథకాలు కలిసిరావు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
కర్కాటక రాశి
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం, ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
సింహ రాశి
లక్ష్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోనుకావద్దు. ఆప్తులు సాయం అందిస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆసక్తికర మైన విషయాలు తెలుసుకుంటారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పెద్దల చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
కన్య రాశి
ప్రణాళికలు వేసుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం, చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
తుల రాశి
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త, సన్నిహితులతో సంభాషిస్తారు. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవు తాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. అవకాశాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
వృశ్చిక రాశి
వ్యవహారాల్లో మొహమాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధన సహాయం తగదు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు.
ధనుస్సు రాశి
రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లలకు శుభఫలితాలున్నాయి. గృహ మరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వాయిదాపడిన మొక్కులు తీర్చుకుంటారు.
మకర రాశి
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడుతారు. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది.
కుంభ రాశి
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సోమవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది.
మీన రాశి
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్