Mercury combust: బుధుడి సంచారం.. జూన్ 27 వరకు ఈ రాశుల వారికి సవాళ్ళు, పనిలో ఒత్తిళ్లు తప్పవు
Mercury combust: ప్రస్తుతం బుధుడు అస్తంగత్వ దశలో ఉన్నాడు. ఇదే దశలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో జూన్ 27వరకు కొన్ని రాశుల వారికి సవాళ్ళు, పనిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. వ్యాపారులకు నష్టం కూడా రావచ్చు.
Mercury combust: గ్రహాల రాకుమారుడు బుధుడు జూన్ 2న వృషభ రాశిలోకి అడుగు పెట్టాడు. జ్యోతిష్య శాస్త్రంలో మేధస్సు, తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇచ్చే గ్రహంగా బుధుడిని భావిస్తారు. వృషభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు.
ఇదే దశలో జూన్ 14న తన సొంత రాశి అయిన మిథున రాశిలో ప్రవేశిస్తాడు. అత్యంత వేగంగా రాశిని మార్చుకోగల గుణం బుధుడికి ఉంది. అందుకే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. అలా జూన్ 27 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. బుధుడి దహన ప్రభావం మేష రాశి నుంచి మీనం వరకు కనిపిస్తుంది. ఇది కొన్ని రాశులపై సానికూలంగా ఉన్నప్పటికీ మరి కొన్ని రాశుల వారికి చెడు ప్రభావాన్ని చూపుతుంది.
బుధుడి స్థానం బలహీనంగా ఉంటే ఒక వ్యక్తి అభద్రతా భావంతో ఉంటాడు. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఏ విషయాలను సులభంగా అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది. గ్రహాల దహనం అంటే గ్రహాల శక్తి తగ్గడం. అందువల్ల కొన్ని సార్లు ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. బుధుడి సంచారం ఏయే రాశుల వారికి అననుకూల ఫలితాలు ఇస్తుందో చూద్దాం.
మేష రాశి
మేష రాశి మూడు, ఆరో ఇంటికి బుధుడు అధిపతి. ఈ రాశి జాతకులకు బుధుడు రెండో ఇంట్లో స్థిరంగా ఉంటాడు. బుధ సంచారం కారణంగా జాతకులు అనేక సవాళ్లను, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది . వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగం పట్ల అసంతృప్తి చెందుతారు. వృత్తి పురోగతిలో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశికి పాలక గ్రహం శుక్రుడు. బుధుడు ఈ రాశి రెండు, ఐదో ఇంటికి అధిపతి. బుధుడి అస్తంగత్వం ఈ రాశిలోనే జరుగుతోంది. ఫలితంగా ఈ రాశి జాతకులకు వృత్తితో సహా జీవితంలోని అంశాలలో సవాళ్ళను ఇస్తుంది. ఈ కాలంలో అపార్థాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. వృషభ రాశి జాతకులు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండాలి. కెరీర్ లో తలెత్తే అపార్ధాలు వల్ల సమస్యలు ఏర్పడతాయి.
సింహ రాశి
బుధుడు సింహ రాశి రెండు, పన్నెండవ ఇంటికి అధిపతి సింహ రాశి 10వ ఇంట్లో అస్తంగత్వ దశలో సంచరిస్తాడు. ఫలితంగా మీరు తమ వృత్తిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. పని ప్రాంతంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. మీ కృషిని అధికారులు గుర్తించలేకపోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ సమయం కాస్త కఠినంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిని పాలించే గ్రహం కుజుడు. ఈ రాశి ఎనిమిది, 11వ ఇంటికి అధిపతి. వృశ్చిక రాశి జాతకుల ఏడవ ఇంటిలో బుధుడు సంచరిస్తాడు ఫలితంగా మీపై పని ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు రాకపోవచ్చు.
తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు. దాని తొమ్మిది, పన్నెండవ ఇంటికి అధిపతి బుధుడు. ఎనిమిదో ఇంట్లో దహనం జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారులు నష్టాలు చూసే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లో వివిధ అడ్డంకులు ఉండవచ్చు. కీర్తి తగ్గిపోతుంది. కార్యాలయంలో ఒత్తిడిని అనుభవిస్తారు. ఉద్యోగంలో అభద్రతాభావం తలెత్తుతుంది.