Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపులోనూ నిష్ణాతులే-girls born on these dates are experts in earning and saving money ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపులోనూ నిష్ణాతులే

Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపులోనూ నిష్ణాతులే

Gunti Soundarya HT Telugu
Aug 09, 2024 08:00 AM IST

Numerology: న్యూమరాలజీ ప్రకారం నిర్దిష్ట తేదీల్లో పుట్టిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలో నిపుణులుగా ఉంటారు. డబ్బు పొదుపు చేసే కళ కూడా వీరికి ఉందని చెబుతున్నారు.

డబ్బు సంపాదించడంలో ఈ అమ్మాయిలు దిట్ట
డబ్బు సంపాదించడంలో ఈ అమ్మాయిలు దిట్ట (pexels)

Numerology: మానవ జీవితంలో సంఖ్యలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం మాత్రమే కాదు న్యూమరాలజీ కూడా జీవితాన్ని భవిష్యత్ ని తెలియజేస్తుంది. న్యూమరాలజీలోని సంఖ్యల ఆధారంగా అంటే పుట్టిన తేదీ ఆధారంగా ఒకరి రోజువారీ జీవిత భవిష్యత్ తెలుస్తుంది. 

జ్యోతిష్యం వలె న్యూమరాలజీలో భూత, భవిష్యత్, వర్తమానాన్ని పుట్టిన తేదీ ఆధారంగా అంచనా వేస్తారు. న్యూమరాలజీలో అటువంటి రాడిక్స్ నెంబర్లలో జన్మించిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలో దిట్ట. అది మాత్రమే కాదండోయ్ డబ్బు ఆదా చేయడంలోనూ వీరి తర్వాతే ఎవరైనా అనేట్టుగా ఉంటారు. ఇల్లు, సంసారం ప్రశాంతంగా సాగిపోవాలంటే మహిళకు పొదుపు చాలా అవసరం. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ రాడిక్స్ కలిగిన అమ్మాయిలు ఆ కోవకే చెందుతారు. వృథా ఖర్చులు అసలు చేయరు. ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతారు. ఇలాంటి అమ్మాయిలు లైఫ్ లోకి వచ్చారంటే జీవిత భాగస్వామి సంతోషానికి అవధులు ఉండవు. ఇంతకీ ఆ రాడిక్స్ సంఖ్య ఏదో చూసేయండి. 

ఆర్థిక పరిస్థితి సూపర్ 

ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన అమ్మాయిలు 2 రాడిక్స్ సంఖ్యను కలిగి ఉంటారు. ఈ రాడిక్స్ సంఖ్యకు అధిపతి చంద్రుడు. చల్లని మనసు, భావోద్వేగాలకు చంద్రుడు ప్రతీకగా నిలుస్తాడు. చంద్రుని ప్రభావం కారణంగా ఈ రాడిక్స్ సంఖ్యలో జన్మించిన అమ్మాయిలు తెలివైనవారు, భావోద్వేగాలు, ముందు చూపు  ఆలోచనలు కలిగి ఉంటారు. వీళ్ళు చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరికి అద్భుతమైన ఆలోచనా శక్తి ఉందని చెబుతారు. ఆమె తన తెలివితేటలతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. సాధారణంగా వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అతిగా డబ్బు ఖర్చు పెట్టేందుకు అసలు ఇష్టపడరు. అందుకే వీరికి డబ్బు కొరత అనేది చాలా తక్కువగా ఉంటుంది. 

ఈ అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందంటే.. 

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ 2కి చెందిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఆమె తన మాటలతో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. ప్రతి ఒక్కరూ వాటిని వినడానికి ఇష్టపడతారు. వారు చదువులో నిష్ణాతులు. వారికి డబ్బు సంపాదించే కళ ఉందని, దాని వల్లే వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందని చెబుతారు. ఆమె సంపదను కూడబెట్టుకోవడాన్ని నమ్ముతుంది. వీరికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది.

కుటుంబ జీవితం ఆనందమయం 

నెంబర్ 2లో పుట్టిన అమ్మాయిల వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది. వారు తమ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, ప్రేమను పొందుతారు. ఆమె ఏ ఇంటికి వెళ్లినా అక్కడ ఆనందం, ఆశీస్సులు ఉంటాయని చెబుతారు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్ట దేవతలు. ఐశ్వర్యం, శ్రేయస్సు ఉంటాయి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్