52 kg gold in a car: రోడ్డు పక్కన వదిలేసిన కార్లో 52 కేజీల బంగారం; రూ. 11 కోట్ల నగదు-52 kg gold over rs 11 cr cash recovered from abandoned suv in bhopal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  52 Kg Gold In A Car: రోడ్డు పక్కన వదిలేసిన కార్లో 52 కేజీల బంగారం; రూ. 11 కోట్ల నగదు

52 kg gold in a car: రోడ్డు పక్కన వదిలేసిన కార్లో 52 కేజీల బంగారం; రూ. 11 కోట్ల నగదు

Sudarshan V HT Telugu
Dec 20, 2024 08:28 PM IST

Gold in a car: గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిన కార్లో 52 కేజీల బంగారం, రూ. 11 కోట్ల నగదు లభించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దాదాపు 10 గంటలుగా ఒక కారు రోడ్డు పక్కన నిలిపేసి ఉందని, దాంట్లో చాలా బ్యాగ్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం అందడంతో ఈ కారు ఉదంతం వెలుగులోకి వచ్చింది.

కార్లో 52 కేజీల బంగారం; రూ. 11 కోట్ల నగదు
కార్లో 52 కేజీల బంగారం; రూ. 11 కోట్ల నగదు (HT_PRINT)

52 kg gold in a car: రోడ్డు పక్కన కొన్ని గంటలుగా నిలిపేసి ఉన్న కారు.. అందులో పెద్ద సంఖ్యలో బ్యాగ్ లు చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి, ఆ కారు డోర్ ను బలవంతంగా తెరిచి, అందులోని బ్యాగుల్లో ఉన్నవాటిని చూసి అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

yearly horoscope entry point

ఇన్నోవాలో..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కుశాల్పురా రోడ్డులో రోడ్డు పక్కగా నిలిపి ఉన్న ఒక ఎస్యూవీలో రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారు కడ్డీలు, రూ.11 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ, పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు గ్వాలియర్ వాసి పేరు మీద రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుశాల్ పురా రోడ్డులో బ్యాగులతో వాహనం ఉందని, అందులో ఎవరూ లేరని డిపార్ట్ మెంట్ కు సమాచారం అందింది. కుశాల్ పురా రహదారిపై ఇన్నోవా క్రిస్టా చాలా సేపు నుంచి నిలిచి ఉందని, అందులో మనుషులెవరూ లేరని, వాహనంలో సుమారు ఏడెనిమిది బ్యాగులు ఉన్నాయని ఒక వ్యక్తి రతిబాద్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. దీంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) ప్రియాంక శుక్లా తెలిపారు.

మధ్య ప్రదేశ్ బండి

ఈ ఎస్ యూవీ రిజిస్ట్రేషన్ నంబర్ మధ్యప్రదేశ్ (madhya pradesh news) కు చెందిన ఎంపీ-07 సిరీస్ కు చెందినదని, నాలుగేళ్లుగా భోపాల్ లో నివసిస్తున్న గ్వాలియర్ కు చెందిన చందన్ సింగ్ గౌర్ పేరుపై ఈ వాహనం రిజిస్టరై ఉందని ప్రియాంక శుక్లా తెలిపారు. ఆ బంగారం, నగదు ఎవరికి చెందుతాయో దర్యాప్తు జరుపుతున్నామని మరో అధికారి తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడులు

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), లోకాయుక్త, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సంయుక్తంగా మధ్య ప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ రికవరీ జరిగింది. భోపాల్ లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ గురువారం నుంచి దాడులు నిర్వహిస్తోంది. త్రిశూల్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ గ్రూప్, ఇషాన్ గ్రూప్ లపై భోపాల్, ఇండోర్ లలో ఐటీ శాఖ దాడులు చేసింది. కారులో స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులు వారికి చెందినవేనని అనుమానిస్తున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.