Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం-the makers of pushpa 2 the rule mythri movies shared an update about the film ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Ott: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం

Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం

Galeti Rajendra HT Telugu
Dec 20, 2024 09:28 PM IST

Pushpa 2 OTT release Date: పుష్ప 2 ఓటీటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు పైనే వసూళ్లు రాబట్టిన పుష్ప 2 మూవీ.. ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోందంటే?

ఓటీటీలోకి పుష్ప 2
ఓటీటీలోకి పుష్ప 2 (instagram)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ఓటీటీపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ శుక్రవారం క్లారిటీ ఇచ్చేసింది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,500 స్క్రీన్లలో రిలీజైన పుష్ప 2 మూవీ ఇప్పటికే రూ.1,500 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలు ఏవీ రేసులో లేకపోవడంతో పుష్ప 2 జోరు అప్పటి వరకూ కొనసాగే అవకాశం ఉంది. కానీ.. పుష్ప 2 త్వరలోనే ఓటీటీలోకి రాబోతోందంటూ వార్తలు వస్తుండటంపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది.

పుష్ప 2 ఓటీటీలోకి ఎప్పుడంటే?

పుష్ప 2 త్వరలో ఓటీటీలోకి వస్తుందనే వార్తలు పూర్తి అవాస్తవమని స్పష్టం చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. మూవీ రిలీజైన 56 రోజులలోపు ఓటీటీలో విడుదల చేయబోమని వెల్లడించింది. అప్పటి వరకూ థియేటర్లలోనే పుష్ప 2 మూవీని ఎంజాయ్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో పరోక్షంగా క్రిస్మస్, సంక్రాంతి సెలవులను కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తావిస్తూ హాలిడేస్ సీజన్‌లో బిగ్ స్క్రీన్‌పై సినిమాని ఎంజాయ్ చేయాలంది. దాంతో పుష్ప 2 మూవీ ఓటీటీలోకి సంక్రాంతి తర్వాతేనని తేలిపోయింది.

అమెజాన్ నుంచి పోటీ ఎదురైనా

పుష్ప 2 ఓటీటీ హక్కుల్ని భారీ ధరకి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అమెజాన్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. రూ.270కోట్లకి ఈ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప: ది రైజ్ మూవీ ఓటీటీ హక్కుల్ని 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీని థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు కూడా ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. దానికి కారణం అల్లు అర్జున్ సినిమాలో కనబర్చిన నటన.

తెలుగులో కంటే హిందీలోనే క్రేజ్

పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. రావు రమేశ్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు కంటే హిందీలోనే పుష్ప 2 కలెక్షన్లు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.

Whats_app_banner