OTT Malayalam Action Thriller: ఓటీటీలోకి హఠాత్తుగా అడుగుపెట్టిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Malayalam Action Thriller: మురా సినిమా హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. అంచనాలకు కంటే ముందే ఈ మలయాళ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మురా’ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మలా పార్వతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించారు. మురా చిత్రానికి మంచి థియేట్రికల్ రన్ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం సడెన్‍గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ వివరాలివే
మురా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్‍లపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, తెలుగు, తమిళం, హిందీ వెర్షన్లు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే మలయాళంలో మురా మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
అంచనాల కంటే ముందుగానే..
మురా చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నాలుగో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, అంతకు వారం ముందే నేడే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందస్తుగా ప్రచారం లేకుండా హఠాత్తుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
మురా మూవీకి సురేశ్ బాబు కథ అందించగా.. మహమ్మద్ ముస్తఫా తెరకెక్కించారు. సూరజ్, హృదు హరూన్, పార్వతితో పాటు కని కస్తూరి, క్రిష్ హాసన్, జోబిన్ దాస్, అనుజిత్ కణ్ణన్, యెధు కృష్ణ, విఘ్నేశ్వర సురేశ్, సిబీ జోసెఫ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
మురా మూవీని హెచ్‍ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా షుబు దర్శకత్వం వహించారు. ఉద్యోగం నలుగురు యువకులు, గ్యాంగ్‍స్టర్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తఫా తెరకెక్కించారు. సుమారు 50 రోజుల పాటు ఈ మూవీ థియేట్రికల్ రన్ సాగించింది. ఈ చిత్రానికి క్రిస్టి జోబీ సంగీతం అందించగా.. ఫాజిల్ నజెర్ సినిమాటోగ్రఫీ చేశారు.
మురా మూవీ స్టోరీలైన్
తిరువనంతపురంలో ఆనందు (హృదు హరూన్), మనూ (యధు కృష్ణన్), మనాఫ్ (అనుజిత్), సాజి (జోబిన్ దాస్) ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. రౌడీలుగా మారాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గ్యాంగ్‍స్టర్ అని (సూరజ్ వెంజరమూడు) దగ్గరకు చేరతారు. అని కోసం తమిళనాడులో ప్రమాదకరమైన దొంగతనం చేసేందుకు సిద్ధమవుతారు. దాని తర్వాత క్రిమినల్ పనులు చేయకూడదని ప్లాన్ చేసుకుంటారు. కానీ వారు అనుకున్న విధంగా ప్లాన్ సాగదు. వారికి సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎదురైన సవాళ్లు ఏంటి? వీటి నుంచి ఆ నలుగురు ఎలా బయటపడ్డారనేది మురా చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
మురా చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు దక్కాయి. కథ, నరేషన్ విషయంలోనూ పాజిటివ్ టాక్ దక్కింది. క్యారెక్టర్లను రాసుకున్న, తెరకెక్కించిన విధానం కూడా మెప్పిస్తుంది.
కాగా, తెలుగు రూరల్ యాక్షన్ డ్రామా మూవీ ‘పొట్టేల్’ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీలో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
సంబంధిత కథనం