OTT Comedy Movie: ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ డ్రామా సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..
Adios Amigo OTT Release Date: అడియోస్ అమిగో సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. థియేటర్లలో రిలీజైన నెలలోనే ఈ మలయాళ కామెడీ డ్రామా చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
ఆసిఫ్ అలీ, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ మూవీ ‘అడియోస్ అమిగో’ చిత్రం ఆగస్టు 9వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ కామెడీ డ్రామా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి నాహస్ నాజర్ దర్శకత్వం వహించారు. ‘అడియోస్ అమిగో’ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
ఓటీటీ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే
అడియోస్ అమిగో చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (సెప్టెంబర్ 1) అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో రిలీజైన నెల రోజులలోపే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
నాలుగు భాషల్లో..
థియేటర్లలో మలయాళంలో రిలైజన అడియోస్ అమిగో చిత్రం ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ సెప్టెంబర్ 6న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
అడియోస్ అమిగో మూవీలో ఆసిఫ్, సూరజ్‍తో పాటు అనఘ, షైన్ టామ్ చాకో, గణపతి, అల్తాఫ్ సలీమ్, నందు, వినీత్ తట్టిల్ డేవిడ్, గణపతి పడువల్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నహాస్ నజర్ తెరకెక్కించారు. ఆర్థికంగా విభిన్న పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం, స్నేహం, వారి జర్నీతో ఈ మూవీని రూపొందించారు. కామెడీ ప్రధానంగా ఈ మూవీని తీసుకొచ్చారు.
అడియోస్ అమిగో చిత్రాన్ని ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆషిక్ ఉస్మాన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినా.. మోస్తరు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమాకు గోపీసుందర్, జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.
అడియోస్ అమిగో స్టోరీలైన్
ప్రియన్ (సూరజ్) ఆర్థిక కష్టాల్లో ఉంటాడు. తన తల్లికి గుండె ఆపరేషన్ తర్వాత కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఆసుపత్రిలో చేరుస్తాడు. అయితే, చికిత్స చేయించేందుకు డబ్బు ఉండవు. అప్పటికే అతడికి చాలా అప్పులు ఉంటాయి. దీంతో డబ్బు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఈ తరుణంలో ప్రిన్స్ (ఆసిఫ్)తో ప్రియన్‍కు పరిచయం ఏర్పడుతుంది. ప్రిన్స్ ధనవంతుడిగా ఉంటాడు. ఇద్దరికీ మద్యం తాగడం అలవాటు ఉండటంతో స్నేహితులుగా మారతారు.
తన తల్లి చికిత్సకు కావాల్సిన డబ్బును ప్రిన్స్ దగ్గర అడిగి తీసుకోవాలని ప్రియన్ అనుకుంటాడు. అయితే, తటపటాయిస్తుంటాడు. ఈ క్రమంలో ట్రావెల్ ప్లాన్‍ను ప్రియన్‍కు ప్రిన్స్ చెబుతాడు. ఇతరులతో ప్రిన్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రవర్తించడం చేస్తుండటంతో ప్రియన్ చిక్కుల్లో పడతాడు. ప్రిన్స్‌తో జర్నీ చేస్తున్నందుకు బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరి జర్నీ ఎలా ముగిసింది? ప్రిన్స్ వద్ద ప్రియన్ డబ్బు తీసుకోగలిగాడా? తన తల్లికి వైద్యం చేయించాడా? అనేది అడియోస్ అమిగో మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ సినిమాలో కామెడీ పండినా.. ఎమోషన్లు సరిగా లేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కథ కూడా అంత స్ట్రాంగ్‍గా దర్శకుడు చూపించలేదనే టాక్ వచ్చింది.