OTT Malayalam Movie: ఓటీటీలోకి వస్తున్న సర్వైవల్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..
Grrr Movie Release OTT Date: గర్ర్ (Grrr) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. సర్వైవల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. థియేటర్లలో రిలిజైన రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
మలయాళ మూవీ గర్ర్ (Grrr) టైటిల్‍తోనే ఇంట్రెస్ట్ పెంచింది. సింహగర్జన శబ్దమే టైటిల్‍గా ఈ సర్వైవల్ కామెడీ చిత్రం వచ్చింది. సూరజ్ వెంజరమూడు, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలు పోషించిన గర్ర్ చిత్రం జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. విభిన్నమైన స్టోరీతో వచ్చింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వస్తున్న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ నేడు డేట్‍ను వెల్లడించింది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
గర్ర్ సినిమా ఆగస్టు 20వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ నేడు (ఆగస్టు 13) అధికారికంగా వెల్లడించింది. ఆగస్టు 20 నుంచి నవ్వులతో గర్జించేందుకు రెడీగా ఉండండి. డిస్నీప్లస్ హాట్‍స్టార్‌లో గర్ర్ వస్తోంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ చిత్రాన్ని త్వరలో తీసుకొస్తామంటూ కొంతకాలంగా చెబుతూ వస్తోంది హాట్‍స్టార్. అయితే, ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్‍ను ఇప్పుడు ఖరారు చేసింది. ఆగస్టు 20న గర్ర్ మూవీని తీసుకొచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది.
తెలుగులోనూ..
గర్ర్ తెలుగు వెర్షన్‍ను కూడా హాట్‍స్టార్ స్ట్రీమింగ్‍కు తీసుకురానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
గర్ర్ చిత్రానికి జై కే దర్శకత్వం వహించారు. సింహం నుంచి ఇద్దరు తప్పించుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో బోబన్, సూరజ్‍తో పాటు శృతి రామచంద్రన్, అనఘ, రాజేశ్ మాధవన్, మంజు పిళ్లై, శోభి తిలకన్, సెంథిల్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు.
గర్ర్ మూవీని ఆగస్టు సినిమా పతాకంపై షాజీ నదేశన్, ఆర్య నిర్మించారు. డాన్ విన్సెంట్, కాళిదాస్ మీనన్, టోనీ టార్జ్ సంగీతం అందించిన ఈ మూవీకి జయేశ్ నాయర్ సినిమాటోగ్రఫీ, వివేక్ హర్షన్ ఎడిటింగ్ చేశారు. తక్కువ బడ్జెట్‍తోనే తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మోస్తరుగా కలెక్షన్లు దక్కాయి.
గర్ర్ స్టోరీలైన్
కేరళలోని తిరువనంతపురం జూలో గర్ర్ మూవీ స్టోరీ సాగుతుంది. తన ప్రియురాలు మోసం చేసిందనే బాధతో మద్యం సేవించి జూలో ఉన్న కంచె దాటి సింహం ఉన్న ప్రాంతానికి వెళతాడు రెజిమోన్ (బోబన్). తాను ధైర్యవంతుడినని నిరూపించుకునేందుకు సింహం వద్దకు వెళ్లాలనుకుంటాడు. అతడిని కాపాడేందుకు జూ అధికారి హరిదాస్ కూడా కంచె దాటి అక్కడికి వెళతాడు. సింహం అక్కడ ఉండటంతో ఇద్దరూ ప్రమాదంలో పడతారు. వారి కుటుంబాల్లోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ ఇద్దరిని సింహం నుంచి కాపాడేందుకు పోలీసులు, జూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. చాలా రకాలుగా కృషి చేస్తారు. వారు కూడా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారా అనే అంశాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో ఎక్కువగా కామెడీనే ఉంటుంది. అలాగే సింహం నుంచి ఎలా తప్పించుకుంటారనే ఉత్కంఠ కూడా సాగుతుంటుంది. అయితే, ఈ మూవీకి థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.