Netflix Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కొత్త ఏడాదిలో ఇదే మొదటిది.. టీజర్ రిలీజ్-netflix thriller web series black warrant teaser released to stream from 10th january 2025 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కొత్త ఏడాదిలో ఇదే మొదటిది.. టీజర్ రిలీజ్

Netflix Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కొత్త ఏడాదిలో ఇదే మొదటిది.. టీజర్ రిలీజ్

Hari Prasad S HT Telugu
Dec 19, 2024 03:18 PM IST

Netflix Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. వచ్చే ఏడాది తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోయే తొలి సిరీస్ ను ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. గురువారం (డిసెంబర్ 19) టీజర్ కూడా రిలీజ్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కొత్త ఏడాదిలో ఇదే మొదటిది.. టీజర్ రిలీజ్
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కొత్త ఏడాదిలో ఇదే మొదటిది.. టీజర్ రిలీజ్

Netflix Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ కొత్త ఏడాదికి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో వెల్‌కమ్ చెప్పబోతోంది. తాజాగా బ్లాక్ వారెంట్ (Black Warrant) పేరుతో ఓ సిరీస్ ను అనౌన్స్ చేసింది. ఈ ఏడాది హీరామండి, ఐసీ 814: ది కాందహార్ హైజాక్ లాంటి వెబ్ సిరీస్ తోపాటు అమర్ సింగ్ చంకీలా, కంట్రోల్ లాంటి మూవీస్ అందించిన నెట్‌ఫ్లిక్స్.. గురువారం (డిసెంబర్ 19) తన కొత్త వెబ్ సిరీస్ టీజర్ కూడా లాంచ్ చేసింది.

బ్లాక్ వారెంట్ టీజర్

జహాన్ కపూర్ లీడ్ రోల్లో నటిస్తున్న బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్.. జనవరి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక థ్రిల్లింగ్ ప్రిజన్ డ్రామా. తీహార్ జైల్లో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా సిరీస్ తెరకెక్కించారు. ఢిల్లీలోని ఈ జైలుకు ఆసియాలోనే అతిపెద్ద జైలుగా పేరుంది. అక్కడి పేరుమోసిన క్రిమినల్స్ తో తన అనుభవాన్ని జైలర్ సునీల్ కుమార్ గుప్తా కోణంలో చూపించే ప్రయత్నం ఈ సిరీస్ ద్వారా చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే, సత్యాంషు సింగ్ ఈ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు. జైలు జీవితం ఎలా ఉంటుందో బయటి ప్రపంచానికి కళ్లకు కట్టడానికి ఈ బ్లాక్ వారెంట్ సిరీస్ ద్వారా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో జైలర్ సునీల్ కుమార్ గా.. జహాన్ కపూర్ నటించాడు. అతనితోపాటు రాహుట్ భట్, పరమ్‌వీర్ సింగ్ చీమా, అనురాగ్ ఠాకూర్, సిద్ధాంత్ గుప్తాలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ గురించి..

అప్లౌజ్ ఎంటర్టైన్మెంట్, ఆందోళన ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి. తీహార్ జైలుకు జైలర్ గా ఉన్న సునీల్ గుప్తా, జర్నలిస్ట్ సునేత్ర చౌదరి రాసిన బ్లాక్ వారెంట్: కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తీహార్ జైలర్ అనే పుస్తకం ఆధారంగా సిరీస్ తెరకెక్కుతోంది.

నెట్‌ఫ్లిక్స్ తో కలిసి ఇండియాలో తొలి సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్ అందించిన టీమ్ తోనే ఈ ఓటీటీ ఈ కొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తుండటంతో బ్లాక్ వారెంట్ పై ఆసక్తి నెలకొంది. టీజర్ కూడా ఈ సిరీస్ పై అంచనాలు పెంచేలా ఉంది. 2024లో తన ఒరిజినల్ కంటెంట్ తో ఇండియన్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న నెట్‌ఫ్లిక్స్.. కొత్త ఏడాదిలో ఎలాంటి కంటెంట్ తో రానుందో చూడాలి.

Whats_app_banner