TV Premiere Date: టీవీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. లెక్కల చుట్టు తిరిగే కథ.. ఎక్కడ చూడాలంటే?-rana daggubati produced movie 35 chinna katha kadu tv premiere on zee telugu over national maths day december 22 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tv Premiere Date: టీవీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. లెక్కల చుట్టు తిరిగే కథ.. ఎక్కడ చూడాలంటే?

TV Premiere Date: టీవీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. లెక్కల చుట్టు తిరిగే కథ.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 19, 2024 01:55 PM IST

35 Chinna Katha Kadu TV Premiere Date: తెలుగు హీరోయిన్ నివేదా థామస్ తల్లిగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం 35 చిన్న కథ కాదు. హీరో రానా దగ్గుబాటి నిర్మించిన 35 చిన్న కథ కాదు మూవీ బుల్లితెరపై అలరించేందుకు టీవీలోకి వచ్చేస్తోంది. మరి ఈ సినిమా ఏరోజున రిలీజ్ కానుంది, ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.

టీవీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. లెక్కల చుట్టు తిరిగే కథ.. ఎక్కడ చూడాలంటే?
టీవీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. లెక్కల చుట్టు తిరిగే కథ.. ఎక్కడ చూడాలంటే?

35 Chinna Katha Kadu TV Premiere Date: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్ నటించిన తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ 35 చిన్న కథ కాదు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది.

వినోదంతోపాటు విజ్ఞానం

ఇప్పటివరకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 35 చిన్న కథ కాదు మూవీ బుల్లితెరపై కూడా సందడి చేయనుంది. వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఛానెల్ ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని 35 చిన్న కథ కాదు సినిమా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది.

జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్​ గణితశాస్త్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా 35 చిన్న కథ కాదు మూవీని వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​‌గా టెలీకాస్ట్ చేయనుంది. డిసెంబర్ 22న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో 35 చిన్న కథ కాదు మూవీని ప్రసారం చేయనున్నారు.

35 చిన్న కథ కాదు మూవీ స్టోరీ

35 చిన్న కథ కాదు సినిమా కథ లెక్కల చుట్టూ తిరుగుతుంది. తిరుపతిలో నివసించే మధ్యతరగతికి చెందిన భార్యాభర్తలు సత్య ప్రసాద్​ (విశ్వదేవ్​ రాచకొండ), సరస్వతి (నివేదా థామస్​​). వారికి ఇద్దరు కొడుకులు అరుణ్​ (అరుణ్​దేవ్​ పోతుల), వరుణ్​(అభయ్​ శంకర్​). అరుణ్​ గణిత నియమాలు తప్పని వాటిని ఎందుకు పాటించాలంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.

అరుణ్ అడిగే ప్రశ్నలు

మ్యాథ్స్​ టీచర్​ చాణక్య వర్మ (ప్రియదర్శి) అరుణ్​ని జీరో అని పిలవడంతో సరస్వతి, సత్య ఆందోళన చెందుతారు. అరుణ్​ అడిగే ప్రశ్నలేంటి? సరస్వతి తన కొడుకు సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే 35 చిన్న కథ కాదు సినిమా చూడాల్సిందే.

ఎమోషనల్​ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​

గణిత శాస్త్రంలో అంకెలు సృష్టించే మాయాజాలం, ఆకట్టుకునే కథాంశంతో మేళవించిన అసాధారణ కథతో రూపొందిన ఈ సినిమాకి నందకిషోర్​ ఈమని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్​ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా అలరించిన 35 చిన్న కథ కాదు సినిమాని జీ తెలుగులో ఇంట్లోనే చూసేయొచ్చు.

నిర్మాతగా రానా దగ్గుబాటి

కాగా 35 చిన్న కథ కాదు సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Whats_app_banner